MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/old-heroines-auntiesb9145048-10ce-4a8d-a1a6-dacb85e4f14d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/old-heroines-auntiesb9145048-10ce-4a8d-a1a6-dacb85e4f14d-415x250-IndiaHerald.jpgరమ్యకృష్ణ 1975 సెప్టెంబర్ 15వ తేదీన కృష్ణన్ - మాయా దంపతులకు చెన్నైలో జన్మించారు. రమ్యకృష్ణ అసలు పేరు రమ్య. అయితే తమిళ్ లో ఆడ పిల్లలకు తమ తండ్రి పేరు గాని, భర్త పేరు గాని.. వారి పేరు చివర్లో తగిలిస్తారు. అలా రమ్య తన తండ్రి పేరు కృష్ణన్ పేరును జోడించి, రమ్యకృష్ణన్ గా పేరు పిలువబడుతోంది. ఇక ప్రస్తుతం ఆమెను రమ్యకృష్ణ గా పేరు మార్చారు మన తెలుగు ఇండస్ట్రీ వారు. ఇక ఈమెకు చెల్లెలు కూడా ఉంది. బాల్యంలో అత్యంత చురుకుగా ఉండడంతో ఈమె మావయ్య చో రామస్వామి ప్రోత్సాహంతో భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంది. ఇక ఈయన కOld-heroines-aunties{#}chakravarthy;k raghavendra rao;parvathi;puri jagannadh;ramya;ramya krishnan;sree;Rajani kanth;Film Industry;Kuchipudi;Queen;Bahubali;Reddy;september;Industry;Ishtam;Husband;dance;Akkineni Nagarjuna;Heroine;Telugu;Cinema;Joseph Vijay;Hero;Father;Hyderabad;Tamilశివగామి.. మొట్టమొదటి అత్త పాత్ర..శివగామి.. మొట్టమొదటి అత్త పాత్ర..Old-heroines-aunties{#}chakravarthy;k raghavendra rao;parvathi;puri jagannadh;ramya;ramya krishnan;sree;Rajani kanth;Film Industry;Kuchipudi;Queen;Bahubali;Reddy;september;Industry;Ishtam;Husband;dance;Akkineni Nagarjuna;Heroine;Telugu;Cinema;Joseph Vijay;Hero;Father;Hyderabad;TamilTue, 22 Jun 2021 12:26:39 GMT
రమ్యకృష్ణ 1975 సెప్టెంబర్ 15వ తేదీన కృష్ణన్ - మాయా దంపతులకు చెన్నైలో జన్మించారు. రమ్యకృష్ణ  అసలు పేరు రమ్య. అయితే తమిళ్ లో ఆడ పిల్లలకు తమ తండ్రి పేరు గాని, భర్త  పేరు గాని.. వారి పేరు చివర్లో తగిలిస్తారు. అలా రమ్య తన తండ్రి పేరు కృష్ణన్ పేరును జోడించి, రమ్యకృష్ణన్ గా పేరు పిలువబడుతోంది. ఇక ప్రస్తుతం ఆమెను రమ్యకృష్ణ గా పేరు మార్చారు మన తెలుగు ఇండస్ట్రీ వారు. ఇక ఈమెకు చెల్లెలు కూడా ఉంది. బాల్యంలో అత్యంత చురుకుగా ఉండడంతో ఈమె మావయ్య చో రామస్వామి ప్రోత్సాహంతో భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంది. ఇక ఈయన కూడా నాటకాలు రాసి నటించేవారు. ఇక రమ్యకృష్ణ నాటకాలలోనటిస్తూ, నృత్య ప్రదర్శనలు ఇస్తూ మంచి గుర్తింపు పొందింది.


ఇక తర్వాత తన మామయ్య  ప్రోత్సాహంతోనే 1984లో  తన 8వ తరగతి చదువుతున్నప్పుడు , తమిళ్ లో హీరోయిన్ అవకాశం రావడంతో నటించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మరొక సినిమాలో చిన్న పాత్రలో నటించింది. అదే సంవత్సరంలో మరొక సినిమాలో హీరోయిన్ గా నటించినా కూడా అది పెద్దగా హిట్ కొట్టలేకపోయింది. ఇక 1985లో సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కి  షిఫ్ట్ అవుతున్న సమయంలో 1986లో భలే మిత్రులు సినిమాలో నటించింది. ఇందులో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ గుర్తింపు రాకపోవడంతో సహాయక పాత్రలలో  నటించేది.


ఇక తెలుగులో శ్రీ దేవి కామాక్షి కటాక్షం సినిమాలో పార్వతి దేవి పాత్ర పోషించి, అద్భుతంగా నటించింది. ఇక ఈ సినిమాలో కామాక్షి పాత్ర కూడా ఈమె నటించింది. మంచి విజయం సాధించడంతో ఇక నాగార్జున సరసన సంకీర్తన సినిమాలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసింది రమ్యకృష్ణ. ఇక ఈ సినిమా కూడా హిట్ కాలేదు. ఆ తర్వాత చక్రవర్తి సినిమా లో చిరంజీవికి చెల్లెలిగా నటించింది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో 1990 లో అల్లుడుగారు సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకుంది రమ్యకృష్ణ. ఇక అప్పటి నుంచి 1996 వరకు దాదాపు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తీసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తర్వాత అమ్మోరు చిత్రంలో నటించి, ఇక ఈమెకు  తిరుగులేదని అనిపించుకుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించి అందరి మన్ననలు పొందింది. నరసింహలో నీలాంబరి పాత్ర అత్యద్భుతం .ఇక ఈ పాత్రలో ఈమె తప్ప మరొకరు చేయలేరు. 1990 నుండి 2000 సంవత్సరం మధ్య ఏకంగా దశాబ్దకాలంపాటు స్టార్ హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపింది.


2005లో వచ్చిన నా అల్లుడు సినిమా ద్వారా మోడ్రన్ అత్తగా సినీరంగ ప్రవేశం చేసింది. అలా  హీరోయిన్ నుంచి ఆంటీ గా మారిపోయింది రమ్యకృష్ణ. ఇక తర్వాత  కొంచెం ఇష్టం కొంచెం కష్టం  సినిమాలలో హీరో తల్లిగా నటించింది. ఇక బాహుబలి సినిమాలో శివగామి గా నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రమ్యకృష్ణ, సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున సరసన  నటించింది. ఇక తరువాత శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో అత్త పాత్రలో శివంగిలా నటించింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న లైజర్  సినిమాలో మరొక పాత్రలో నటించబోతోంది రమ్యకృష్ణ. లేడీ క్వీన్ గా బిరుదు పొందింది.





జ‌గ‌న్‌కు వీర‌ భ‌జ‌న...చిరు కీర్త‌నల వెన‌క క‌థ ఇదా ?

విజయ మల్లయ్య దారిలో సోనూ?

కుర్ర హీరోలకు తలనొప్పి గా మారిన వెంకటేష్!!

చెల్లిని రంగంలోకి దింపడానికి ఆ హీరోయిన్ కష్టాలు

45 ఏళ్ళ వయసులోనూ ఆకట్టుకుంటున్న మీనా...

రెండు పార్ట్ లుగా ప్రభాస్ సినిమా.. ?

రంగంలోకి గాలి కుటుంబం...వివాదానికి చెక్‌పెట్టేనా..?

క‌ష్టాల క‌డ‌లి నుంచి జ‌ట్టును కాపాడే క్రీడాకారిణిగా

అక్కడ విశాల్ కు జరిగిందే ఇక్కడ ప్రకాష్ రాజ్ కు జరుగుతుందా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>