NRISuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/srilanka-corona3727b89d-4f60-4b9f-ba38-42bfbf879c8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/srilanka-corona3727b89d-4f60-4b9f-ba38-42bfbf879c8e-415x250-IndiaHerald.jpgశ్రీలంక లో నివసిస్తున్న 92 మంది భారతీయులు కరోనా వైరస్ బారిన పడ్డారని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం రోజు వెల్లడించారు. ఐరన్ వర్క్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ప్రవాసులు కరోనా వైరస్ బారిన పడ్డారు. శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమైంది. స్థానిక మీడియా ప్రకారం.. కొలంబో ఉత్తర శివారు వట్టాలా లోని కర్మాగారంలో 194 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే వారిలో 128 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 128 మందిలో 92 మంది భారతదేశానికి చెందినవారే కావడం గమనార్హం. అయితే వైరస్ బారిన పడిన వారందరినీ ప్రస్తుతం ఐసోలేషన్ వsrilanka corona{#}Sri Lanka;Indians;monday;Iron;Coronavirus;local language;workers;June;Traffic policeకరోనా బారిన పడిన ఎన్నారైలు.. అప్రమత్తమైన ఆ దేశం..?కరోనా బారిన పడిన ఎన్నారైలు.. అప్రమత్తమైన ఆ దేశం..?srilanka corona{#}Sri Lanka;Indians;monday;Iron;Coronavirus;local language;workers;June;Traffic policeTue, 22 Jun 2021 09:00:00 GMTశ్రీలంక లో నివసిస్తున్న 92 మంది భారతీయులు కరోనా వైరస్ బారిన పడ్డారని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం రోజు వెల్లడించారు. ఐరన్ వర్క్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ప్రవాసులు కరోనా వైరస్ బారిన పడ్డారు. శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమైంది. స్థానిక మీడియా ప్రకారం.. కొలంబో ఉత్తర శివారు వట్టాలా లోని కర్మాగారంలో 194 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే వారిలో 128 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 128 మందిలో 92 మంది భారతదేశానికి చెందినవారే కావడం గమనార్హం. అయితే వైరస్ బారిన పడిన వారందరినీ ప్రస్తుతం ఐసోలేషన్ వార్డుకి తరలించారు. అలాగే తాత్కాలికంగా ఫ్యాక్టరీ మూసివేశారు.

అయితే కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయిన కార్మికులను ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే క్వారంటైన్ లో ఉంచారు. గత నాలుగు వారాలుగా కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్న శ్రీలంక ప్రభుత్వం సోమవారం రోజు ట్రావెలింగ్ పై లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసింది. అయితే అక్కడి వైద్య అధికారులు మాత్రం థర్డ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారుతుందని.. లాక్ డౌన్ అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 23వ తేదీన రాత్రి 10 గంటలకు మళ్లీ ఆంక్షలు అమలు చేస్తామని శ్రీలంక ప్రభుత్వం చెప్పినట్లు సమాచారం. ప్రత్యేక బృందాల ద్వారా ప్రజల కదలికలను తాము పర్యవేక్షిస్తామని శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది. ఆంక్షలు తొలగించినప్పటికీ ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఒక పోలీస్ అధికారి మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

ప్రస్తుతం శ్రీలంకలో డెల్టా వైరస్ విపరీతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ ద్వీపదేశం లో ఏప్రిల్ నెలలో కరోనా థర్డ్ వేవ్ విజృంభించింది. అయితే ఏప్రిల్ నెల నుంచి ప్రతిరోజు సుమారు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. శ్రీలంక దేశంలో ఇప్పటివరకూ 2,39,689 కరోనా వైరస్ బారిన పడగా వారిలో 2,01,389 కోలుకున్నారని సమాచారం. ఇక 2,581 మంది కరోనా తో చనిపోయారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించింది.


కరోనా థర్డ్ వేవ్: పిల్లల పేరెంట్స్ లో మొదలైన భయం...

దళపతి గురించి మనకు తెలియని మరి కొన్ని విషయాలు..

కరోనా బారిన పడిన ఎన్నారైలు.. అప్రమత్తమైన ఆ దేశం..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ ఎన్ఆర్ఐ కేటగిరి లో చూడండి.

గుడ్ న్యూస్.. సీజ్ అయిన వాహనాలను తీసుకెళ్లొచ్చు?

చైనాకు షాక్.. యోగి సక్సెస్?

కరోనా పరిహారం.. చేతులెత్తేసిన కేంద్రం..

నేడు దత్తత గ్రామానికి సీఎం.. !

కోలీవుడ్ స్టార్ విజయ్ భార్య ఎవరో తెలుసా ?

ఆ దేశంలో థ‌ర్డ్ వేవ్ 5 ల‌క్ష‌ల మందిని చంపేసింది... ఇండియాకు వార్నింగ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>