QuotesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/quotes/131/manchimaataf98b93be-eb91-4924-ba68-7899fc8f1df4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/quotes/131/manchimaataf98b93be-eb91-4924-ba68-7899fc8f1df4-415x250-IndiaHerald.jpgనేటి తరం పిల్లలకు ఘటోత్కచుడి గురించి పెద్దగా తెలియదు. కానీ 1995వ సంవత్సరంలో వచ్చిన ఘటోత్కచుడు సినిమా ద్వారా పిల్లలకు బాగా అర్ధమయ్యింది ఘటోత్కచుడు అంటే ఎవరో.. అంతేకాదు ఘటోత్కచుడు పాత్రలో సత్యనారాయణ గారు అద్భుతంగా నటించి పిల్లల స్నేహితుడిగా మారిపోయాడు. పురాణాలలో ఈ ఘటోత్కచుడు ఎలా జన్మించాడో తెలుసుకుందాం.. పాండవులలో ఒకరైన భీమసేనుని పుత్రుడు. ఇతను ఇంద్రజాల విద్యలలో ఆరితేరినవారు. మహాభారతంలో తన విద్యలను ప్రదర్శించి, కౌరవసైన్యాన్ని చెల్లాచెదురు చేసిన మహాబలశాలి. ఒకానొక సమయంలో పాండవులు అరణ్యవాసం చేసినపMANCHIMAATA{#}Rakshasudu;Research and Analysis Wing;king;Husband;marriage;Cinemaమంచిమాట : ఘటోత్కచుడి జన్మ రహస్యం ఏమిటి..?మంచిమాట : ఘటోత్కచుడి జన్మ రహస్యం ఏమిటి..?MANCHIMAATA{#}Rakshasudu;Research and Analysis Wing;king;Husband;marriage;CinemaTue, 22 Jun 2021 14:00:00 GMT
నేటి తరం పిల్లలకు ఘటోత్కచుడి గురించి పెద్దగా తెలియదు. కానీ 1995వ సంవత్సరంలో వచ్చిన ఘటోత్కచుడు సినిమా ద్వారా పిల్లలకు బాగా అర్ధమయ్యింది ఘటోత్కచుడు అంటే ఎవరో.. అంతేకాదు ఘటోత్కచుడు పాత్రలో సత్యనారాయణ గారు అద్భుతంగా నటించి పిల్లల  స్నేహితుడిగా మారిపోయాడు. పురాణాలలో ఈ ఘటోత్కచుడు ఎలా జన్మించాడో తెలుసుకుందాం..


పాండవులలో ఒకరైన భీమసేనుని పుత్రుడు. ఇతను ఇంద్రజాల విద్యలలో ఆరితేరినవారు. మహాభారతంలో తన విద్యలను ప్రదర్శించి, కౌరవసైన్యాన్ని చెల్లాచెదురు చేసిన మహాబలశాలి. ఒకానొక సమయంలో పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు, అక్కడ సంచరిస్తూ అలసిపోయి ఒక చెట్టుక్రింద సేద తీరుతారు. పాండవులు గాఢనిద్రలో ఉంటారు.. కానీ భీముడు మాత్రం మేల్కొని వీరికి కాపలాగా వుంటాడు. పాండవులు నిద్రిస్తున్న ప్రదేశం నుండి కొంత దూరంలో ఒక మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టు మీద హిడింబాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. ఈ రాక్షసుడు నరభక్షకుడు. ఈ రాక్షసుడికి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు హిడింబి.

రాక్షసుడు తన చెల్లిని పాండవుల దగ్గరకు వెళ్లి నీ మాయలో వారిని పడవేసి, వారిని చంపి నా దగ్గరకు తీసుకు రా ..ఇద్దరం కలిసి తిందాము అని చెప్తాడు. ఇక ఆమె తన అన్న చెప్పినట్టుగా పాండవుల దగ్గరకు వెళ్లగానే , అక్కడ మిగతావారు నిద్రిస్తుండగా భీముడు మాత్రం వారికి కాపలా ఉన్న విషయాన్ని ఆమె గమనిస్తుంది. శరీరం అందమైన ఆకృతి కలిగిన భీముని చూసి మనసు పారేసుకుంటుంది. ఇక తన మనసులో ఇతనే నా భర్త అని అనుకుంటుంది. మా అన్న చెప్పినట్టు వీరిని చంపలేను.. మా అన్న కంటే నేను ప్రేమించిన వాడే ఎక్కువ అని అనుకుంటుంది హిడింబి.


దాంతో భీముడు, హిడింబి కలుసుకుని మాట్లాడుకుంటున్న మాటలను హిడింబాసురుడు  వింటారు. కోపంతో నువ్వు నన్ను మోసం చేస్తావా వీళ్ళందర్నీ తీసుకొస్తాను అని చెప్పావు.. నువ్వు మాట తప్పినందుకు నేను వీళ్ళందర్నీ తింటాను అంటూ తన చెల్లి పై చేయి ఎత్తగా, అప్పుడు భీముడు  కోపంతో ఒక ఆడదాని పైన చేయి లేపుతావా అంటూ..  హిడింబాసురుడిని నేలకేసి కొట్టి చంపేస్తాడు.  తర్వాత హిడింబి, కుంతీదేవిని ఒక వరం అడిగింది. నీ కొడుకును నాకు ఇచ్చి పెళ్ళి చేయమని, అప్పుడు మీరు రాక్షస కుమార్తె కదా.. ఎలా పెళ్లి చేసుకోగలరు అంటూ కుంతీదేవి ఆలోచనలో  పడుతుంది. కానీ హిడింబి కుంతీ దేవితో నీవు కూడా ఒక ఆడదానివే కదా తల్లి.. ఒక ఆడదాని మనసు నీవు అర్థం చేసుకోలేవా అని అడుగుతుంది. అప్పుడు తన కొడుకును ఇచ్చి వివాహం చేస్తుంది. అలా రాక్షస యువరాణి హిడింబి కి, పాండవుల రాజు భీమసేనునికి మధ్య పుట్టిన సంతానమే ఘటోత్కచుడు. ఇక పుట్టిన క్షణకాలంలోనే పెద్దపెద్ద రాక్షసుల కంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగిపోయాడు. అలా ఘటోత్కచుడు జన్మించాడు.





దృశ్యం డైరెక్టర్ కి బంపర్ ఆఫర్... ?

హాలీవుడ్ ని సైతం ఇండియాకి రప్పించిన గొప్ప నటుడు..

రాక్షస యువరాణి హిడింబి కి, పాండవుల రాజు భీమసేనునికి మధ్య పుట్టిన సంతానమే ఘటోత్కచుడు. ఇక పుట్టిన క్షణకాలంలోనే పెద్దపెద్ద రాక్షసుల కంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగిపోయాడు. అలా ఘటోత్కచుడు జన్మించాడు.

ఆ సినిమాలో విజయ్ దళపతితో నటించింది.. సొంత కొడుకేనట?

జ‌గ‌న్‌కు వీర‌ భ‌జ‌న...చిరు కీర్త‌నల వెన‌క క‌థ ఇదా ?

కుర్ర హీరోలకు తలనొప్పి గా మారిన వెంకటేష్!!

చెల్లిని రంగంలోకి దింపడానికి ఆ హీరోయిన్ కష్టాలు

45 ఏళ్ళ వయసులోనూ ఆకట్టుకుంటున్న మీనా...

రెండు పార్ట్ లుగా ప్రభాస్ సినిమా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>