PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-lo-yuvatipai-aaruguru-gang-rape-mamidi-totaloki-teesukelli-daarunamga1a89cfec-86d1-4cdd-8783-75f73a61a45e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-lo-yuvatipai-aaruguru-gang-rape-mamidi-totaloki-teesukelli-daarunamga1a89cfec-86d1-4cdd-8783-75f73a61a45e-415x250-IndiaHerald.jpgఅసెంబ్లీలో దీనిని ఆమోదించి కేంద్రానికి పంపారు. ఇక‌, ఈలోగా రాష్ట్ర వ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్ల‌ను ఏర్పాటు చేశారు. ప‌దే ప‌దే దిశ గురించి చెబుతూనే ఉన్నారు. ఇలాంటి అత్యాచార ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డిన వారిని వ‌దిలిపెట్టే ప‌నిలేద‌ని అంటున్నారు. ఇక‌, దిశ యాప్‌ను కూడా తీసుకువ‌చ్చారు. మ‌రోవైపు హోం శాఖ మంత్రిగా మ‌హిళే ఉన్నారు. మ‌రి ఇంత జ‌రుగుతున్నా.. ప్ర‌భుత్వం ఇంత చేస్తున్నా.. మ‌హిళ‌ల‌పైనా... యువతుల‌పైనా జ‌రుగుతున్న ఘోరాల‌ను ఎవ‌రూ నిలువ‌రించ‌లేక పోతున్నారు. తాజాగా తాడేప‌ల్లిలో ముఖ్య‌మంత్రి నివాసానికి కూత Disa{#}Traffic police;police;Andhra Pradeshరాష్ట్రంలో ద‌శ‌-లేని `దిశ‌`.. లోపం ఎవ‌రిది.. ?రాష్ట్రంలో ద‌శ‌-లేని `దిశ‌`.. లోపం ఎవ‌రిది.. ?Disa{#}Traffic police;police;Andhra PradeshTue, 22 Jun 2021 15:35:00 GMTఏడాది కింద‌ట‌.. తెలంగాణ‌లో జ‌రిగిన ఓ మెడిక‌ల్ విద్యార్థిని అత్యాచారం.. ఆత‌ర్వాత‌.. హ‌త్య ఘ‌ట‌న దేశాన్ని కుదిపేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ ఘోరానికి పాల్ప‌డిన న‌లుగురు నిందితుల‌ను పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు. ఈ ఘ‌ట‌నను పార్టీల‌కు అతీతంగా అంద‌రూ ఖండించారు. అయితే.. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకున్న ఏపీ సీఎం జ‌గ‌న్‌.. వెన్వెంట‌నే.. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఏపీలో జ‌రిగితే.. ఏం చేయాల‌నే విష‌యంపై దృష్టిపెట్టి.. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించే.. ఉద్దేశంతో.. `దిశ‌` చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చారు.

అసెంబ్లీలో దీనిని ఆమోదించి కేంద్రానికి పంపారు. ఇక‌, ఈలోగా రాష్ట్ర వ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్ల‌ను ఏర్పాటు చేశారు. ప‌దే ప‌దే దిశ గురించి చెబుతూనే ఉన్నారు. ఇలాంటి అత్యాచార ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డిన వారిని వ‌దిలిపెట్టే ప‌నిలేద‌ని అంటున్నారు. ఇక‌, దిశ యాప్‌ను కూడా తీసుకువ‌చ్చారు. మ‌రోవైపు హోం శాఖ మంత్రిగా మ‌హిళే ఉన్నారు. మ‌రి ఇంత జ‌రుగుతున్నా.. ప్ర‌భుత్వం ఇంత చేస్తున్నా.. మ‌హిళ‌ల‌పైనా... యువతుల‌పైనా జ‌రుగుతున్న ఘోరాల‌ను ఎవ‌రూ నిలువ‌రించ‌లేక పోతున్నారు.

తాజాగా తాడేప‌ల్లిలో ముఖ్య‌మంత్రి నివాసానికి కూత వేటు దూరంలో జ‌రిగిన ఘ‌ట‌న ప్ర‌భుత్వానికి, దిశ చ‌ట్టానికి కూడా మాయ‌ని మ‌చ్చ‌గా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి దిశ చ‌ట్టాన్ని రూపొందించారు.. కేవ‌లం మూడు వారాల్లోనే నిందితుల‌కు క‌ఠిన‌మైన శిక్ష‌లు ప‌డేలా చేస్తామ‌ని చెబుతున్నా రు. దీనికిగాను ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌నే రూపొందించారు. అయినా కూడా ఎందుకు మ‌హిళ‌ల‌కు, యువ‌తుల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంది? అనేది మాత్రం ప్ర‌శ్న‌గానే నిలిచిపోయింది.

దీనికి ఎవ‌రిది లోపం ?  చ‌ట్టాన్ని అమ‌లు చేయాల్సిన అధికారుల్లో లోపం ఉందా?  లేక‌.. ప్ర‌భుత్వంలోనే లోపం ఉందా ?  లేక‌.. స‌మాజంలోనేలోపం ఉందా? అనేది అంతుచిక్క‌డం లేదు. దీంతో అన్ని వైపుల నుంచి కూడా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌హిళ‌ల‌కు, యువ‌త‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు మ‌రింత ప‌టిష్టంగా చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుందో లేదో చూడాలి.

 



కరోనాతో మావోయిస్ట్ అగ్ర నేత మృతి...?

త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌పై నిఘా పెట్టాలి : స‌జ్జ‌న్నార్

మోడీని దింపుదాం... థ‌ర్డ్ ఫ్రంట్ టీం రెడీ... !

వాసాల‌మ‌ర్రికి వ‌స్తూనే ఉంటా?

బ్రేకింగ్: ఏపీ అధికారులకు జైలు శిక్ష క్యాన్సిల్...?

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు వార్నింగ్!

ప్రొద్దుటూరులో ఉద్రిక్త‌త‌?

Breaking : ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

ఏపీలో దిశ‌కు ద‌శ - దిశ లేదా.. యువ‌తుల‌కు ర‌క్ష‌ణ ఏది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>