MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-59cc2a9c-a30b-49de-8017-213041510c13-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-59cc2a9c-a30b-49de-8017-213041510c13-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తున్నారు. వాటిలో దేశ‌వ్యాప్తంగా క్రేజ్ ఉన్న సినిమా స‌లార్. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. అంతేకాకుండా భారీ బడ్జెట్ తో హోంబ‌లే బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక 2022 ఎప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేస్తామని మేక‌ర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను తెలంగాణ లోని గోదావరిఖని బొగ్గుగ‌నుల్లో పూర్తి చేశారు. ఇక్క‌డ ఓ భారీsalar{#}Shruti;Shruti Haasan;sruthi;KGF;Telangana;Darsakudu;Director;Prabhas;Coronavirus;India;Hyderabad;Cinemaరెండు పార్ట్ లుగా ప్రభాస్ సినిమా.. ?రెండు పార్ట్ లుగా ప్రభాస్ సినిమా.. ?salar{#}Shruti;Shruti Haasan;sruthi;KGF;Telangana;Darsakudu;Director;Prabhas;Coronavirus;India;Hyderabad;CinemaTue, 22 Jun 2021 12:59:39 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తున్నారు. వాటిలో దేశ‌వ్యాప్తంగా క్రేజ్ ఉన్న సినిమా స‌లార్. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్  తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. అంతేకాకుండా భారీ బడ్జెట్ తో హోంబ‌లే బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక 2022 ఎప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేస్తామని మేక‌ర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను తెలంగాణ లోని గోదావరిఖని బొగ్గుగ‌నుల్లో పూర్తి చేశారు. ఇక్క‌డ ఓ భారీ యాక్ష‌న్ స‌న్నివేశాన్ని తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది. 

అంతే కాకుండా ప్ర‌భాస్ శృతి హాస‌న్ కు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ను ఇక్క‌డ తెర‌కెక్కించిన‌ట్టు సమాచారం. అయితే స‌లార్ ఫ‌స్ట్ షెడ్యూల్ తర్వాత ప్రభాస్ ఆది పురుష్ సినిమాలో షూటింగ్ లో పాల్గొన్నారు. క‌రోనా కారణంగా ముంబైలో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. దాంతో రిస్క్ చేయకుండా ప్రభాస్ ఈ రెండు సినిమాల షూటింగ్ ల‌ను హైదరాబాద్ లోనే ప్లాన్ చేయాల‌ని మేక‌ర్స్ కు తెలిపారట‌. దాంతో ప్రభాస్ నిర్ణయానికి మేక‌ర్స్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండ‌గా ఇప్పుడు స‌లార్ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కేజీఎఫ్‌ సినిమాను రెండు రెండు పార్టులుగా విడుదల చేసినట్టే ఈ సినిమాను కూడా స‌లార్ పార్ట్ 1, స‌లార్ పార్ట్ 2 గా విడుదల చేయాల‌ని ప్ర‌శాంత్ నీల్ భావిస్తున్న‌ట్టు ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథ ప్రకారం గా సినిమా నిడివి ఎక్కువ అవుతుందంట. అంతేకాకుండా సినిమా బడ్జెట్ కూడా అనుకున్నదానికంటే ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్ర‌శాంత్ నీల్ స‌లార్ ను రెండు పార్టులుగా విడుద‌ల‌ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వెలుబ‌డాల్సిందే.



ఈ నెల 28న పీవీ విగ్రహావిష్కరణ .. !

శ్రీవారి టికెట్ లు హాట్ కేక్ లే...?

జ‌గ‌న్‌కు వీర‌ భ‌జ‌న...చిరు కీర్త‌నల వెన‌క క‌థ ఇదా ?

కేసీఆర్ ను ఏకవచనంతో దుమ్మెత్తి పోసిన షర్మిల...?

స‌లార్ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కేజీఎఫ్‌ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేసినట్టే ఈ సినిమాను కూడా రెండు పార్టులుగా విడుదల చేయాల‌ని ప్ర‌శాంత్ నీల్ భావిస్తున్న‌ట్టు ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కుర్ర హీరోలకు తలనొప్పి గా మారిన వెంకటేష్!!

చెల్లిని రంగంలోకి దింపడానికి ఆ హీరోయిన్ కష్టాలు

45 ఏళ్ళ వయసులోనూ ఆకట్టుకుంటున్న మీనా...

అక్కడ విశాల్ కు జరిగిందే ఇక్కడ ప్రకాష్ రాజ్ కు జరుగుతుందా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>