PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-0f4fb455-d10c-415d-81f8-256cf21324ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-0f4fb455-d10c-415d-81f8-256cf21324ec-415x250-IndiaHerald.jpgజర్నలిస్టు రఘుపై కేసులు పెట్టి అరెస్ట్ చేసిన తీరును చూసి బీసీ కమిషన్ ఘాటుగా స్పందించింది. కమిషన్ నోటీసులతో విచారణకు హజరైనా డిప్యూటీ కలెక్టర్ పద్మజా రాణి, డీఎస్పీపై ప్రశ్నలతో ముంచెత్తింది. గుర్రంపోడు భూములు ప్రైవేటుకు కంపనీకి చెందినవి అని అయితే ఆ కంపెనీ ఎలాంటి రక్షణను కోరలేదని పోలీసులు కమిషన్ ఎదుట అంగీకరించారు. వెంటనే సీరియస్ అయిన కమిషను ప్రైవేటు కంపెనీ భూములకు కంప్లైట్ కూడా లేకుండా మీరేలా రక్షణ కల్పిస్తున్నారు అని కమిషన్ సభ్యుడు ఆచారి మండిపడ్డారు. జర్నలిస్టుగా రఘు కుట్ర చేశాడని మీ వద్ద ఆధారాలునPolitical {#}kranthi kumar;raghu;High court;Backward Classes;collector;Gharshana;Kodad;Varsham;Traffic police;Arrest;Party;policeచెప్తే కేసులు పెడతారా..కలెక్టర్, డీఎస్పీ పై బీసీ కమిషన్ సీరియస్.. !చెప్తే కేసులు పెడతారా..కలెక్టర్, డీఎస్పీ పై బీసీ కమిషన్ సీరియస్.. !Political {#}kranthi kumar;raghu;High court;Backward Classes;collector;Gharshana;Kodad;Varsham;Traffic police;Arrest;Party;policeTue, 22 Jun 2021 13:05:00 GMTజర్నలిస్టు రఘుపై కేసులు పెట్టి అరెస్ట్ చేసిన తీరును చూసి బీసీ కమిషన్ ఘాటుగా స్పందించింది. కమిషన్ నోటీసులతో విచారణకు హజరైనా డిప్యూటీ కలెక్టర్ పద్మజా రాణి, డీఎస్పీపై ప్రశ్నలతో ముంచెత్తింది. గుర్రంపోడు భూములు ప్రైవేటుకు కంపనీకి చెందినవి అని అయితే ఆ కంపెనీ ఎలాంటి రక్షణను కోరలేదని పోలీసులు కమిషన్ ఎదుట అంగీకరించారు. వెంటనే సీరియస్ అయిన కమిషను ప్రైవేటు కంపెనీ భూములకు కంప్లైట్ కూడా లేకుండా మీరేలా రక్షణ కల్పిస్తున్నారు అని కమిషన్ సభ్యుడు ఆచారి మండిపడ్డారు. జర్నలిస్టుగా రఘు కుట్ర చేశాడని మీ వద్ద  ఆధారాలున్నాయా అని అడగగా షెడ్డు వైపు నాయకులకు చూపించాడని పోలీసులు సమాధానమిచ్చారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుతూ చూపించినంత మాత్రాన కేసులు పెడతారా,  అక్కడ చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు. మరి వారిపై కూడా కేసులు పెట్టాలన్నారు.  కేసు పెట్టి మూడు నెలలైనా చార్జిషీట్  వేయకుండా ఇప్పుడే ఎందుకు అరెస్టు చేశారని కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది.

 కంప్లైంట్ లేకుండా అక్కడ పోలీసులకి ఏం పని అని కమిషన్ మండిపడింది. ఈ కేసుపై  రఘు హైకోర్టుకు వెళ్లారని పోలీస్ అధికారి చెప్పగా మీరు విలేకరిపై కేసు పెడితేనే కదా ఆయన హైకోర్టు కు వెళ్ళింది అని  కమిషన్ చివాట్లు పెట్టింది. రఘు కుట్ర పన్నాడని ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడగ్గా మా స్టాప్ చూశారు కానీ వేరే ఆధారాలేవీ లేవని ఒక పోలీస్ అధికారి వెల్లడించారు. స్టాప్ చూసినంత మాత్రాన కేసు పెడతారా అని కమిషన్ అడిగింది. అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఉండేదే జర్నలిస్టులని పార్లమెంటుపై ఉగ్రవాద దాడి సమయంలో కూడా వారు విడియో తీశారని, ఘర్షణ వీడియోను పోలీసులు తీయలేరని, జర్నలిస్టు తీస్తే అది నేరం అవుతుందా అని కడిగిపారేశారు. అరెస్ట్ చేసేటప్పుడు యునిఫాం ఉండాలని ఏం లేదని అయితే నేమ్ ప్లేట్స్, ఐడీ కార్డు కనపడాలని సుప్రీం రూల్స్ చెబుతున్నట్లు అధికారులు ఒప్పుకున్నారు.

 ఈ మొత్తం తతంగంలో  థర్డ్ పార్టీ ఫిర్యాదు ఏమీ లేదని, ఓన్లీ పోలీసు అధికారుల ఫిర్యాదు మాత్రమే ఉన్నరని ఒప్పుకున్నారు. అక్కడే ఉన్న కోదాడ ఎస్ఐ క్రాంతి కుమార్ ఫిర్యాదు చేశాడని అధికారి తెలపగ అక్కడ రఘు ఉన్నాడని కేసు పెట్టామని అన్నారు. మరీ అదే ప్లేస్ లో పోలీసులు కూడా ఉన్నారని వారిపై కూడా కేసు పెడతారా అని కమిషన్ అడిగింది.  పోలీసులకు ఏమైనా గాయాలైనట్లు ఉన్న ఫోటోలు, వీడియోలు వచ్చే విచారణకు సబ్మిట్ చేయాలని, అయితే, ప్రజలకు జరిగిన గాయాల గురించి తమకు తెలియవని చెప్పటంతో  కమిషన్ విస్మయం వ్యక్తం చేసింది.  ప్రజలకు గాయాలైతే పోలీసులకు పట్టవా అని అడిగింది. ప్రైవేటు భూములకు పోలీసుల రక్షణ బాగుందంటూ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.  తదుపరి విచారణను వాయిదా వేసింది.



జ‌గ‌న్‌కు వీర‌ భ‌జ‌న...చిరు కీర్త‌నల వెన‌క క‌థ ఇదా ?

దారుణం..ఐదుగురు కుటుంబ స‌భ్యుల‌ గొంతుకోసి చివ‌రికి..!

సోము ఎమ్మెల్యే అవ్వాలంటే...!

బీజేపీని చెత్త‌పార్టీ అన్న టీఆర్ఎస్ మంత్రి

అసలు ఫ్రెండ్స్ ఏనా వీళ్ళు.. వామ్మో!

త్వరలో థర్డ్ ఫ్రంట్ రాబోతుందా.. కాంగ్రెస్ ని పక్కకు తోసేశారా..!

వివేకా హత్య కేసులో ఏకంగా కుటుంబాన్నే పిలిచిన సిబిఐ...?

తాడేపల్లి గ్యాంగ్ రేప్ లో ఇద్దరు అరెస్ట్?

వీళ్ళను ఏం చేస్తే సమాజం బాగుంటుంది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>