MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suryaa7f8d77b-acff-4e1b-9b08-b02f283797f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suryaa7f8d77b-acff-4e1b-9b08-b02f283797f3-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో సూర్య కు తమిళనాట మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ఉన్న స్టార్ హీరోలలో ముందు వరుసలో ఉంటారు ఆయన. ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ రాగా తెలుగులో కూడా ఆయన సినిమాలను విడుదల చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. గజిని సినిమా ద్వారా టాలీవుడ్ కి ప్రవేశించిన సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా అయితే చేయలేదు కానీ ఆయన తమిళంలో తీసిన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి మంచి క్రేజ్ ను, మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు. ఇటీవలే ఆయన నుంచి వచ్చిన ఆకాశం నీ హద్దురా చిత్రం సూపర్surya{#}dhanush;Ghajini;boyapati srinu;bollywood;surya sivakumar;Tollywood;dil raju;News;Dalapathi;Mass;India;vegetable market;Joseph Vijay;Darsakudu;Director;Chitram;Audience;Telugu;Tamil;Hero;Cinemaసూర్య.. ఫ్రమ్ కోలీవుడ్ వయా టాలీవుడ్ టు బాలీవుడ్..సూర్య.. ఫ్రమ్ కోలీవుడ్ వయా టాలీవుడ్ టు బాలీవుడ్..surya{#}dhanush;Ghajini;boyapati srinu;bollywood;surya sivakumar;Tollywood;dil raju;News;Dalapathi;Mass;India;vegetable market;Joseph Vijay;Darsakudu;Director;Chitram;Audience;Telugu;Tamil;Hero;CinemaTue, 22 Jun 2021 16:01:00 GMTతమిళ  స్టార్ హీరో సూర్య కు తమిళనాట మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ఉన్న స్టార్ హీరోలలో ముందు వరుసలో ఉంటారు ఆయన. ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ రాగా తెలుగులో కూడా ఆయన సినిమాలను విడుదల చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు.  గజిని సినిమా ద్వారా టాలీవుడ్ కి ప్రవేశించిన సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా అయితే చేయలేదు కానీ ఆయన తమిళంలో తీసిన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి మంచి క్రేజ్ ను, మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు. ఇటీవలే ఆయన నుంచి వచ్చిన ఆకాశం నీ హద్దురా చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

సినిమా సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్న సూర్య తెలుగు లో డైరెక్ట్ సినిమా చేయబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రంగా సూర్యతో సినిమా చేయబోతున్నాడని దానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు అని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పటికే తమిళ స్టార్ హీరోలైన ధనుష్ విజయ్ దళపతి లు తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సూర్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. అందుకే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. మాస్ మసాలా సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట అయిన సూర్యను మరో రేంజ్ లో చూపించబోతున్నాడు అని తెలుస్తోంది.

అయితే తెలుగులో మాత్రమే కాదట బాలీవుడ్ లోనూ ఓ సినిమా చేయాలన్నది సూర్య ఆలోచనట. ఇప్పటికే టాలీవుడ్ లో తనకు మంచి మార్కెట్ ఉంది కాబట్టి తెలుగులో  ఉన్న మార్కెట్ ను ఎక్కువ చేసుకోవడానికి ఈ తెలుగు సినిమా చేస్తున్నాడని, ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడని, తద్వారా  పాన్ ఇండియా హీరోగా ఎదగడానికి ప్లాన్ చేయబోతున్నాడని తెలుస్తోంది. సూర్య ప్లాన్ అయితే బాగానే ఉంది కానీ దక్షిణాదిన ఆదరించినట్లు ఉత్తరాది ప్రేక్షకులు అందరి హీరోలను ఆదరించరు. సినిమా ఫలితం ఏమాత్రం తేడా వచ్చినా పట్టించుకోరు. ఈ నేపథ్యంలో సూర్య బాలీవుడ్ లో సత్తా చాటాలని టాప్ డైరెక్టర్ ను పట్టాల్సిందే. 



ఆ బిడ్డ నిజం కాదంటున్న అవికాగోర్..

రోహిత్ క్యాచ్... పుజారా మైండ్ బ్లాక్...?

విలియమ్సన్ మామూలు మొండోడు కాదు గురూ...?

ఆర్ఆర్ఆర్: స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్..!

టాలీవుడ్ ని కరోనా కరుణించినట్టేనా..?

ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. ఐదు రోజులు మాత్రమే గడువు ..

టెన్షన్ లో టాలీవుడ్.. కరుణిస్తారా?

మొన్న రుద్రవీణ, నిన్న ఠాగూర్, నేడు ఆచార్య..!!

ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం థియేటర్ల ఓపెనింగ్ కి ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో సినీ పెద్దలు థియేటర్ల ఓపెనింగ్ గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో భేటీ అయి.. దీనిపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>