MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/megastarf31a70ec-57d2-477f-882d-cb57bc297e9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/megastarf31a70ec-57d2-477f-882d-cb57bc297e9a-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవిది 150కి పైగా సినిమాల అనుభవం. నాలుగు దశాబ్దల పైబడిన సినీ ప్రయాణం. చిరంజీవి ఇప్పటికీ నాటౌట్ అంటూ నటిస్తూనే ఉన్నారు. ఆయన వచ్చాక తెలుగు సినిమా నడక ఒక‌ పరుగుగా మారింది. ఇక కలెక్షన్లలో కూడా కొత్త అర్ధాలు చెప్పారు, కొత్త అంచులకు తెలుగు సినిమాను మెగాస్టార్ తీసుకెళ్ళారు. megastar{#}Chiranjeeviమెగాస్టార్ బ్లాక్ బస్టర్ టైటిల్స్ అలా... ?మెగాస్టార్ బ్లాక్ బస్టర్ టైటిల్స్ అలా... ?megastar{#}ChiranjeeviTue, 22 Jun 2021 20:00:00 GMTమెగాస్టార్ చిరంజీవిది 150కి పైగా సినిమాల అనుభవం. నాలుగు దశాబ్దల పైబడిన సినీ ప్రయాణం. చిరంజీవి ఇప్పటికీ నాటౌట్ అంటూ నటిస్తూనే ఉన్నారు. ఆయన వచ్చాక తెలుగు సినిమా నడక ఒక‌ పరుగుగా మారింది. ఇక కలెక్షన్లలో కూడా కొత్త అర్ధాలు చెప్పారు, కొత్త అంచులకు తెలుగు సినిమాను మెగాస్టార్ తీసుకెళ్ళారు.

చిరంజీవి ఇప్పటికి 152 సినిమాలు నటించారు. వాటిలో బ్లాక్ బస్టర్లు ఎన్నో ఉన్నాయి. అదే విధంగా సూపర్ హిట్లూ ఉన్నాయి. ఆ సినిమాలు ఇప్పటికీ టీవీలలో వస్తే వాటిని చూడని వారు ఉండరు. చిరంజీవి హార్డ్ కోర్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ జనాలకు కూడా ఆయన చేసిన చాలా సినిమాల టైటిల్స్ ఇప్పటికీ గుర్తే. అటువంటి టైటిల్స్ ఇపుడు వేరే సినిమాలకు పెట్టేస్తున్నారు. చిరంజీవి సినిమా అంటేనే  మెగా అంటారు. అలాగే ఆయన టైటిల్స్ కి కూడా బరువూ పరువూ ఉన్నాయి. అయితే వేరే హీరోలు ఆ సినిమాలు చేస్తే మ్యాచ్ కాకపోతే కమర్షియల్ ఫార్ములా బెడిసికొట్టడం ఖాయమని అనేక ఉదాహరణకు చాటి చెప్పాయి.

నాచురల్ స్టార్ నాని గ్యాన్ లీడర్ టైటిల్ తో సినిమా తీస్తే సోసో గా ఆడింది. అది మెగాస్టార్ బ్లాక్ బస్టర్ హిట్. ఇక ఆయన మేనల్లుడు అల్లువారి అబ్బాయి శ్రీరస్తు శుభమస్తు మూవీ చేస్తే ఫట్ మంది. ఈ సినిమా 80లలో చిరంజీవి చేస్తే ఫ్యామిలీ మూవీగా సక్సెస్ అయింది. ఇక మగధీరుడు మూవీ చిరంజీవి చేస్తే తనయుడు రామ్ చరణ్ మగధీరగా బ్లాక్ బస్టర్ కొట్టాడు. చిరంజీవి రాక్షసుడు మూవీ టైటిల్ తో బెల్లంకొండ  శ్రీనివాస్ సినిమా చేసి హిట్ కొట్టారు. మెగాస్టార్  ని స్టార్ హీరోగా మార్చిన ఖైదీ మూవీ టైటిల్ ని కార్తీ తెలుగులో తన  డబ్బింగ్  సినిమాకు పెట్టేసుకుని  సక్సెస్ కొట్టాడు. ఇక లేటెస్ట్ గా రాజా విక్రమార్క టైటిల్ ని కూడా ఒక సినిమాకు వాడేస్తున్నారు. అలాగే ఆది సాయికుమార్ చిరంజీవి ఒకనాటి సూపర్ హిట్ మూవీ టైటిల్ కిరాతకుడు ని వాడుకుంటున్నారు. ఆది కొత్త సినిమాకు కిరాతక అన్న టైటిల్ పెడుతున్నారు. మెగా టైటిల్స్ ఇదే వరసలో మరెన్ని వాడేస్తారో చూడాలి.







'మా'లో మలుపులు.. అనూహ్యంగా మారిన లెక్కలు!

గిరిబాబు చిన్న కొడుకు అందుకే సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడా..?

టెన్షన్ లో టాలీవుడ్.. కరుణిస్తారా?

మొన్న రుద్రవీణ, నిన్న ఠాగూర్, నేడు ఆచార్య..!!

'చరణ్' విషయంలో అప్సెట్ అయిన రాజమౌళి.. ఎందుకో తెలుసా..?

బ్రేకింగ్: ఏపీ అధికారులకు జైలు శిక్ష క్యాన్సిల్...?

సంగీత గురించి ఎవరికీ తెలియని నిజాలు..

మెగాస్టార్‌ను దారుణంగా ఆటాడుకుంటోన్న జ‌న‌సైనికులు... !

Breaking : ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>