PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/modi-supreme-courtc5fc401e-881e-48ad-ac7d-9c20bdc38336-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/modi-supreme-courtc5fc401e-881e-48ad-ac7d-9c20bdc38336-415x250-IndiaHerald.jpgకరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వం కరోనాతో చనిపోయిన వైద్య, పారిశుధ్య సిబ్బందికి భారీగా ఎక్స్ గ్రేషియా ఇస్తోంది. కరోనా వల్ల కుటుంబ సభ్యుల్నికోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు కూడా అండగా నిలబడుతోంది. కానీ కేంద్రం మాత్రం కరోనా బాధితులు, కరోనాతో చనిపోయినవారి కుటుంబ సభ్యులకు ఇంతరవకు ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు. ఈ దశలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు జరుగుతున్నాయి. కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు రూ.4లక్షలు ఎక్modi supreme court{#}prakruti;Andhra Pradesh;Government;Prime Minister;Coronavirusకరోనా పరిహారం.. చేతులెత్తేసిన కేంద్రం..కరోనా పరిహారం.. చేతులెత్తేసిన కేంద్రం..modi supreme court{#}prakruti;Andhra Pradesh;Government;Prime Minister;CoronavirusTue, 22 Jun 2021 07:55:08 GMTకరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వం కరోనాతో చనిపోయిన వైద్య, పారిశుధ్య సిబ్బందికి భారీగా ఎక్స్ గ్రేషియా ఇస్తోంది. కరోనా వల్ల కుటుంబ సభ్యుల్నికోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు కూడా అండగా నిలబడుతోంది. కానీ కేంద్రం మాత్రం కరోనా బాధితులు, కరోనాతో చనిపోయినవారి కుటుంబ సభ్యులకు ఇంతరవకు ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు. ఈ దశలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు జరుగుతున్నాయి. కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు రూ.4లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వడంపై కేంద్రం మరోసారి తన నిస్సహాయత వ్యక్తం చేసింది.

కరోనా పరిహారంపై కేంద్రం పలాయనవాదాన్ని అందుకుంది. ఇప్పటి వరకు కేవలం ప్రకృతి విపత్తుల్లో చనిపోయినవారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించిందని, కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నందున పరిహారం అందించడం సాధ్యపడదని చెప్పింది.  దీనిపై తాజాగా మరో వివరణ ఇచ్చుకుంది కేంద్రం. పరిహారం ఇవ్వడంలేదంటే, కేంద్రం వద్ద నిధులు లేవని ఒప్పుకున్నట్టు కాదని, పరిహారానికి కేటాయింపులు చేస్తే, వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పన, ఆహారం, ఇతర ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలకు నిధులు నిండుకుంటాయని చెప్పుకొచ్చింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం పరిహారం విషయంలో పునరాలోచించాలని సూచించింది. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న పరిహారం ప్యాకేజీలను కేంద్రం దృష్టికి తీసుకొస్తూ.. ఒకరికి సాయం చేసి, ఇంకొకరికి చేయకపోతే ఇబ్బందికర పరిణామాలుంటాయని చెప్పింది. పరిహారం విషయంలో రాష్ట్రాల్లో ఏకరూప విధానం అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని కోరింది. కరోనాతో చనిపోయినవారి డెత్ సర్టిఫికెట్ల మంజూరుపై కూడా దృష్టిపెట్టాలని సూచించింది. వీలైతే గతంలో ఇచ్చిన సర్టిఫికెట్లను సరిచేయాలని చెప్పింది.

ఓ దశలో కేంద్రంపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం చెల్లించకూడదని నిర్ణయం తీసేసుకున్నారా? అని ప్రశ్నించింది. ప్రధాని ఆధ్వర్యంలోని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ (ఎన్ఎండీఏ)లో తీర్మానం చేశారా అని అడిగింది.

అయితే కేంద్రం మాత్రం కోనా నష్టపరిహారంపై ఏమాత్రం సుముఖంగా లేదని తేలిపోయింది. టీకా పంపిణీకి బడ్జెట్ లో కేటాయింపులున్నా కూడా పెట్రోలు రేటు పెంపుకి, టీకా పంపిణీకి ముడిపెట్టి విమర్శలపాలయింది కేంద్రం. తాజాగా కరోనా పరిహారానికి, వైద్యరంగంలో మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధం ఉన్నట్టు మాట్లాడి మరోసారి విమర్శలపాలవుతోంది. ఓవైపు ఎక్కడికక్కడ రాష్ట్రాలు నష్టపరిహారం విషయంలో ఉదారంగా ఉన్నా, కేంద్రం మాత్రం స్థిరమైన నిర్ణయం తీసుకోలేదు.



నేతి బీరకాయకి జగన్ జాబ్ క్యాలెండర్ కి లింక్ ఏంటీ...?

మాట్లాడు పయ్యావుల... నీ పుణ్యం ఉంటది...?

గుడ్ న్యూస్.. సీజ్ అయిన వాహనాలను తీసుకెళ్లొచ్చు?

చైనాకు షాక్.. యోగి సక్సెస్?

ఆ సీఎం ను కూడా వదలని శ్రీరెడ్డి.. ఏం చేసిందంటే?

జగన్ తగ్గట్లేదు గా... వాళ్ళకి 18,750 అంట

నేడు దత్తత గ్రామానికి సీఎం.. !

ఆ దేశంలో థ‌ర్డ్ వేవ్ 5 ల‌క్ష‌ల మందిని చంపేసింది... ఇండియాకు వార్నింగ్..!

మహా లో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>