PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/rammohanc4d6532d-993f-40cd-aa2b-94f94d875589-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/rammohanc4d6532d-993f-40cd-aa2b-94f94d875589-415x250-IndiaHerald.jpgప్రత్యర్ధులు సైతం మెచ్చుకునే నేతలు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. అలా అరుదుగా ఉండే నాయకుల్లో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ సైతం ఉంటారు. దివంగత ఎర్రన్నాయుడు వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్…2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున శ్రీకాకుళం ఎంపీగా గెలిచారు.rammohan{#}Kinjarapu Yerran Naidu;Hanu Raghavapudi;central government;CBN;Jagan;Coronavirus;Telugu;Srikakulam;TDP;Partyరామ్మోహన్‌ది కూడా రెగ్యులర్ రాజకీయమేనా....!రామ్మోహన్‌ది కూడా రెగ్యులర్ రాజకీయమేనా....!rammohan{#}Kinjarapu Yerran Naidu;Hanu Raghavapudi;central government;CBN;Jagan;Coronavirus;Telugu;Srikakulam;TDP;PartyMon, 21 Jun 2021 15:30:00 GMTప్రత్యర్ధులు సైతం మెచ్చుకునే నేతలు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. అలా అరుదుగా ఉండే నాయకుల్లో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ సైతం ఉంటారు. దివంగత ఎర్రన్నాయుడు వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్…2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున శ్రీకాకుళం ఎంపీగా గెలిచారు.


ఇక ఎంపీగా రామ్మోహన్ మంచి పనితీరు కనబరుస్తున్నారు. లోక్‌సభలో సైతం రాష్ట్ర సమస్యలపై గట్టిగా గళం విప్పి, కేంద్ర పెద్దల మెప్పు సైతం పొందుతూ వస్తున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఈయనకు టీడీపీ కార్యకర్తల మద్ధతు భారీగా ఉంటుంది. అలాగే రామ్మోహన్‌ని ప్రత్యర్ధి పార్టీల్లో ఉన్న కొందరు కార్యకర్తలు అభిమానిస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అనర్గళంగా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడి అందరినీ మెప్పిస్తారు.


అసలు మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హిందీ, ఇంగ్లీష్ భాషల్లో లోక్‌సభలో మాట్లాడే నాయకులు చాలా తక్కువ. అలా తక్కువగా ఉన్న నాయకుల్లో రామ్మోహన్ కూడా ఉంటారు. అందుకే ఆయన్ని ప్రత్యర్ధి పార్టీ వాళ్ళు సైతం మెచ్చుకుంటారు. ఇలా ప్రత్యర్ధుల మెప్పు పొందే రామ్మోహన్ రాజకీయం పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది.


ఈయన కూడా రెగ్యులర్ రాజకీయమే చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి పలువురు టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై గుడ్డిగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు దగ్గర నుంచి ప్రతి నాయకుడు గుడ్డెద్దు చేలో పడ్డట్టుగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. అసలు ప్రజలకు ఏం కావాలి, జగన్‌ని ఏ కోణంలో ఇరుకున పెట్టాలనే వ్యూహాలు లేకుండా విమర్శలు చేసుకుంటూ వచ్చేస్తున్నారు.


ఇక అలాంటి నాయకులు మాదిరిగానే రామ్మోహన్ కూడా తయారయ్యారని తెలుస్తోంది. ఆయన కూడా జగన్ ప్రభుత్వంపై గుడ్డిగానే విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కరోనా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని, టీడీపీ వాళ్ళకు సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదని, ఏ-1, ఏ-2 బిరుదులు జగన్, విజయసాయిలకే సూట్ అవుతాయని విమర్శించారు. అంటే టీడీపీ నేతలు ఎప్పుడు చేసే విమర్శలనే రామ్మోహన్ కూడా చేస్తున్నారు. దీని బట్టి చూస్తే రామ్మోహన్ రెగ్యులర్ రాజకీయమే చేస్తున్నారని చెప్పొచ్చు.




మంత్రి ప‌ద‌విచ్చేది నేనా? విజ‌య‌సాయిరెడ్డా?

దిగొచ్చిన ప్రదీప్ మాదిరాజు... సారీ చెప్పాడుగా...?

నాడు వెక్కిరించిన ఆంధ్రోళ్లు నేడు ఈర్శ‌ప‌డుతున్నారు : హ‌రీష్ రావు

మా ఎన్నికల కోసం పావులు కదుపుతున్నా మంచు విష్ణు

ఈ 10 పనులు చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరం..

రేప‌టినుంచి బెంగ‌ళూరు బ‌స్సులు?

సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణ‌తో వైసీపీలో టీడీపీ బ్యాచ్ భేటీ.. ఏంటీ స‌స్పెన్స్‌..?

క‌రోనా మృతుల‌ కుంటుంబాలకు కేంద్రం షాక్.. !

ఫ్యాక్ష‌న్ వదిలి ప్ర‌శాంతంగా బ్ర‌తుకుతున్నామంటున్న వైసీపీ ఎమ్మెల్యే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>