TechnologyMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bicycle-9d98db60-a40c-4fad-92c8-9695637ea973-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bicycle-9d98db60-a40c-4fad-92c8-9695637ea973-415x250-IndiaHerald.jpgసెల్ఫ్ డ్రైవింగ్ సైకిల్ వచ్చేస్తోంది..! పూర్వకాలంలో సైకిల్ ఉంటేనే ఎంతో గొప్పగా చూసేవారు. అలాంటి సైకిల్ మార్పులు చెందుతూ మరో కొత్త రికార్డు సృష్టించడానికి సెల్ఫ్ డ్రైవింగ్ సైకిల్ గా ముందుకు వస్తుంది. ప్రతి ఒక్కరూ చిన్నతనంలో సైకిల్ నేర్చుకునే ప్రక్రియలో ఎన్నోసార్లు కింద పడిపోయి ఉంటారు. ఎన్నో గాయాలయ్యే ఉంటాయి. అయితే ఎంత గాయపడ్డ సైకిల్ సవారీ మాత్రం ఆపలేదు. అలా సైకిల్ నేర్చుకుంటూ కింద పడిపోయిన చైనా కుర్రాడు అలా పడిపోకుండా ఉండాలని సెల్ఫ్ బ్యాలెన్స్ సైకిల్ తయారు చేశాడు. చైనాకు చెందిన ఎలక్Bicycle {#}engineer;Kurradu;Cycle;job;House;Yevaru;Manamసెల్ఫ్ డ్రైవింగ్ సైకిల్ వచ్చేస్తోంది..!సెల్ఫ్ డ్రైవింగ్ సైకిల్ వచ్చేస్తోంది..!Bicycle {#}engineer;Kurradu;Cycle;job;House;Yevaru;ManamMon, 21 Jun 2021 09:05:00 GMTసెల్ఫ్ డ్రైవింగ్ సైకిల్ వచ్చేస్తోంది..!

 పూర్వకాలంలో  సైకిల్ ఉంటేనే   ఎంతో గొప్పగా చూసేవారు. అలాంటి సైకిల్ మార్పులు చెందుతూ  మరో కొత్త రికార్డు సృష్టించడానికి  సెల్ఫ్ డ్రైవింగ్ సైకిల్ గా ముందుకు వస్తుంది.  ప్రతి ఒక్కరూ చిన్నతనంలో  సైకిల్ నేర్చుకునే ప్రక్రియలో ఎన్నోసార్లు కింద పడిపోయి ఉంటారు. ఎన్నో గాయాలయ్యే ఉంటాయి. అయితే  ఎంత గాయపడ్డ సైకిల్ సవారీ మాత్రం ఆపలేదు. అలా సైకిల్ నేర్చుకుంటూ కింద పడిపోయిన చైనా కుర్రాడు  అలా పడిపోకుండా ఉండాలని సెల్ఫ్ బ్యాలెన్స్ సైకిల్ తయారు చేశాడు.

 చైనాకు చెందిన  ఎలక్ట్రానిక్ ఇంజనీర్  జి హోమ్ జూన్ సైకిల్ తొక్కడం నేర్చుకునే ఈ సమయంలో  దాని నుంచి పడిపోయి గాయాలపాలయ్యాడు. దీంతో తనలా ఎవరు పడి పోకూడదని కొత్త ఆలోచనతో సెల్ఫ్ డ్రైవింగ్ బ్యాలెన్సింగ్ సైకిల్ ని తయారు చేయాలని  అనుకున్నాడు. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే వారంతపు రోజుల్లో  సైకిల్ తయారు చేయడం మొదలు పెట్టాడు. చిన్న చిన్న కదలికలను సైతం పర్యవేక్షిస్తూ ఎదురుగా ఏది వచ్చినా వాటిని తప్పుకొని వెళ్లేలా అధునాతన యాక్సిలేరోమీటర్లు, గైరోస్కోప్ లు, ఉపయోగించి  సైకిల్ తయారు చేశాడు.

 కేవలం నాలుగు నెలల్లోనే తయారుచేసిన సైకిల్ ను రైడ్ చేస్తే మాత్రం కింద పడి పోకుండా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అయితే  సైకిల్ స్టాండ్ వేసిన స్థిరంగా ఉంటూ, మూవ్ అవుతున్న సమయంలోను బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాకుండా  ఆర్జిబీ డెప్త్ సెన్సింగ్ కెమెరా, సెన్సార్ తో  ముందు వచ్చే అడ్డంకులను గుర్తిస్తుంది.  దీనితోపాటు సైకిల్ దానంతట అదే ముందుకు సాగుతుంది. కానీ ప్రస్తుత సమాజంలో మనిషి కొత్త కొత్త వస్తువులను తయారు చేస్తూ, కనీసం శరీరానికి భారం కాకుండా చూసుకుంటున్నాడు. విలాసవంతమైన కార్లు, విమానాలు లాంటివి ఉపయోగిస్తూ, కనీసం శరీరానికి చెమట పుట్టకుండా చేస్తున్నాడు. మనం ఉపయోగించే సాధనలలో సైకిల్ మాత్రమే  వ్యాయామ సాధనంగా ఉపయోగపడేది. దీన్ని కూడా ఇలా చేస్తే మానవుడు రానున్న కాలంలో అనేక రోగాల బారినపడే అవకాశం ఉంది.



రాహుల్ తో బ్లేమ్ గేమ్.. అనేవారికి అర్హతలున్నాయా..?

మమ్మీ హీరో.. డమ్మీ హీరో అయ్యాడే..

పంపు బిల్లు కట్టలేదని మంచం జప్తు..!

ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారిన మహేష్ ఫోటో..

థర్డ్ వేవ్ ముప్పు ఢిల్లీ, హైదరాబాద్ కేనా..?

స్మరణ : తల్లి ప్రేమను చల్లగా చూపించిన అంజలీదేవి..

భారీగా తగ్గిన ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర...

బుద్దా అలా...నాని ఇలా.. బెజవాడలో సైకిల్ సెట్ అయినట్లేనా...

టీవీ :ఈ ఫోటోలో ఒక టాప్ సెలబ్రేటి ఉంది.. ఆమె ఎవరో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>