LifeStyleChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/yoga-walking84416a94-40d0-450f-ba4f-4ed2e7da1585-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/yoga-walking84416a94-40d0-450f-ba4f-4ed2e7da1585-415x250-IndiaHerald.jpg గత కొన్ని దశాబ్దాలుగా, యోగా యొక్క ప్రాబల్యం పెరుగుతోంది. వైద్య నిపుణులు మరియు సెలబ్రిటీలు కూడా యోగా యొక్క వివిధ ప్రయోజనాల కారణంగా క్రమం తప్పకుండా యోగా చేయాలని సిఫార్సు చేస్తున్నారు. కొందరు యోగాను కేవలం ఒక ప్రబలమైన ఫ్యాషన్‌గా భావిస్తారు మరికొందరు దానిని ఆధ్యాత్మికతతో ముడిపెడతారు. మరి కొందరు ఇదో రకమైన వ్యాయామం అని అంటూ ఉంటారు. అయితే యోగా అంటే ఏమిటో నిజంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. యోగా అనేది ఒక మతం కాదు, ఇది ఆరోగ్యకరమైన శరీరం కోసం ఆరోగ్యకరమైన మనస్సును లక్ష్యంగా చేసుకునే జీవన విధానం. భారతదేinternational yoga day{#}India;Yoga;Heartయోగాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?యోగాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?international yoga day{#}India;Yoga;HeartMon, 21 Jun 2021 10:01:00 GMT


గత కొన్ని దశాబ్దాలుగా, యోగా యొక్క ప్రాబల్యం పెరుగుతోంది. వైద్య నిపుణులు మరియు సెలబ్రిటీలు కూడా యోగా యొక్క వివిధ ప్రయోజనాల కారణంగా క్రమం తప్పకుండా యోగా చేయాలని సిఫార్సు చేస్తున్నారు. కొందరు యోగాను కేవలం ఒక ప్రబలమైన ఫ్యాషన్‌గా భావిస్తారు మరికొందరు దానిని ఆధ్యాత్మికతతో ముడిపెడతారు. మరి కొందరు ఇదో రకమైన వ్యాయామం అని అంటూ ఉంటారు. అయితే యోగా అంటే ఏమిటో నిజంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. 


యోగా అనేది ఒక మతం కాదు, ఇది ఆరోగ్యకరమైన శరీరం కోసం ఆరోగ్యకరమైన మనస్సును లక్ష్యంగా చేసుకునే జీవన విధానం. భారతదేశం ఆయుర్వేదంలో పేర్కొన్న విధంగా శారీరక మానసిక సమతుల్యతను పెంపొందించడానికి యోగా సహాయపడుతుంది. ఏరోబిక్స్ వంటి ఇతర రకాల వ్యాయామం శారీరక క్షేమానికి మాత్రమే పని చేస్తాయి. అలాగే ఈ వ్యాయామాలకు మానసిక, శరీరాలకు సంబంధించి చాలా తక్కువ సంబంధం ఉంది. యోగా అంటే శరీరాన్ని వంచడం లేదా మెలితిప్పడం మరియు శ్వాసను అదుపులో పెట్టడం మాత్రమే కాదు. ఒక ప్రశాంతమైన స్థితికి తీసుకురావడానికి ఇది ఉపయోగ పడుతుంది.  


యోగా యొక్క కొన్ని ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి: మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, మెదడు మీద తక్కువ ఒత్తిడి పడేలా చేస్తుంది, జన్యు వ్యక్తీకరణను మారుస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, ఊపిరి తిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఆందోళనను తొలగిస్తుంది, దీర్ఘకాలిక వెన్నునొప్పి నుండి ఉపశమనం, మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది, రక్తంలో సమతుల్య భావాన్ని మెరుగుపరుస్తుంది, ఎముకలు బలమైనవిగా తయారయ్యేలా చేస్తుంది, బరువు ఆరోగ్యకరమైన విధంగా ఉండేలా చేస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలా యోగా మీ జీవితాన్ని మారుస్తుంది. అంతే కాక మీరు ఎప్పుడూ ఊహించలేని విధంగా మీ పరిధులను విస్తృతం చేస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రయత్నించడం వలనే మీకు అర్ధం అవుతుంది.




ఏపీ రాజ‌ధానికి ఆ ఇద్ద‌రే అస‌లు సిస‌లు విల‌న్లా ?

యోగా కోసం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి : మోది

యోగా గురించి కేంద్రం ఇలా, బీజేపీ అలా!

యోగా గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే..

మరోసారి నితిన్ సరసన రష్మిక నటించనున్నారా..??

పవన్ ను మోసం చేయబోతున్న నిధి అగర్వాల్ !

ఈ రెండు సినిమాలతో 'నిధి' దశ తిరుగుతుందా..?

కారోనాతో పోరాడే శక్తిని యోగా ఇస్తుంది : మోడీ

థర్డ్ వేవ్ ముప్పు ఢిల్లీ, హైదరాబాద్ కేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>