SmaranaDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/anjalideavi61067928-5f8c-4543-8f53-d36b869d1a2c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/anjalideavi61067928-5f8c-4543-8f53-d36b869d1a2c-415x250-IndiaHerald.jpgసినిమాలలో నటించే పాత్రలలో కొంతమంది ప్రేక్షకులను మెప్పించడానికి నటిస్తే , మరికొంతమంది పాత్రలో లీనమైపోయి మరీ నిజజీవితంలో కూడా ఇలా ఉంటే ఎంత బాగుండు..అని అనిపించేలా నటిస్తూ ఉంటారు. ఇక అప్పట్లో అలాంటి వారిలో అంజలీదేవి కూడా ఒకరు. అంజలీదేవి గారు తల్లి ప్రేమను చల్లగా చూపించి, తల్లి ప్రేమ ఎక్కడున్నా ఒకేలా ఉంటుంది అని చాటిచెప్పిన గొప్ప నటి. బిడ్డ ఎలా ఉన్నా సరే తల్లి ప్రేమ ఎప్పటికీ తగ్గిపోదని కళ్ళకు కట్టినట్టు చూపించే నైజం ఆమెది. అయితే ఇప్పుడు ఆమె గురించి మరికొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తూరANJALIDEAVI{#}anjali;raja;seetha;Sangeetha;January;producer;Producer;venkaiah naidu;Manam;Lavakusa;Interview;prema;Love;NTR;Darsakudu;Akkineni Nagarjuna;Directorస్మరణ : తల్లి ప్రేమను చల్లగా చూపించిన అంజలీదేవి..స్మరణ : తల్లి ప్రేమను చల్లగా చూపించిన అంజలీదేవి..ANJALIDEAVI{#}anjali;raja;seetha;Sangeetha;January;producer;Producer;venkaiah naidu;Manam;Lavakusa;Interview;prema;Love;NTR;Darsakudu;Akkineni Nagarjuna;DirectorMon, 21 Jun 2021 07:00:00 GMT
సినిమాలలో నటించే పాత్రలలో కొంతమంది ప్రేక్షకులను మెప్పించడానికి నటిస్తే , మరికొంతమంది పాత్రలో లీనమైపోయి మరీ నిజజీవితంలో కూడా ఇలా ఉంటే ఎంత బాగుండు..అని అనిపించేలా నటిస్తూ ఉంటారు. ఇక  అప్పట్లో అలాంటి వారిలో అంజలీదేవి కూడా ఒకరు. అంజలీదేవి గారు తల్లి ప్రేమను చల్లగా చూపించి, తల్లి ప్రేమ ఎక్కడున్నా ఒకేలా ఉంటుంది అని చాటిచెప్పిన గొప్ప నటి. బిడ్డ ఎలా ఉన్నా సరే తల్లి ప్రేమ ఎప్పటికీ తగ్గిపోదని కళ్ళకు కట్టినట్టు చూపించే నైజం ఆమెది. అయితే ఇప్పుడు ఆమె గురించి మరికొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురంలో 1927 వ సంవత్సరం ఆగస్టు 24వ తేదీన జన్మించింది. ఈమె అసలు పేరు అంజనీకుమారి. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దర్శకుడు సి.పుల్లయ్య గారు ఈమెకు అంజలి దేవి గా పేరు మార్చారు.  ప్రముఖ సంగీత దర్శకుడు అయిన పి ఆదినారాయణ రావు గారి తో వివాహం జరిగింది. ఇక వీరికి ఇద్దరు కుమారులు కూడా.. ఇక 1950 నుండి 1975 సంవత్సరాల మధ్య కాలంలో ఈమె సినీ జీవితం సాగింది. ఈమె కేవలం నటి మాత్రమే కాదు నర్తకి అలాగే నిర్మాత కూడా. అంజలీదేవి తన నటనా జీవితాన్ని మొదట నాటకరంగం ద్వారా మొదలు పెట్టింది.

మొట్టమొదటిసారి 1936వ సంవత్సరంలో రాజా హరిశ్చంద్రలో అంజలి దేవి చిన్న పాత్రలో నటించింది. తర్వాత కష్టజీవిలో నటించింది. ఎన్టీఆర్ చిత్రం లవకుశ లో ఎన్టీఆర్ పక్కన సీత పాత్రలో అంజలీదేవి నటించి అందరినీ మెప్పించింది. ఈ పాత్ర అప్పట్లో గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేయడంతో పాటు, ఒకసారి అంజలీదేవి బయటకు వెళ్లినప్పుడు ఆమె నిజమైన సీతగా భావించి, ఎంతో మంది మహిళలు మోకరిల్లిన  సందర్భాలు కూడా ఉన్నాయని 1996లో ఒక వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ  ద్వారా ఆమె స్వయంగా తెలిపింది.

ఆ తర్వాత ఎన్నో పాత్రల్లో నటించి, రికార్డు సృష్టించింది. ఈమె సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2006వ సంవత్సరంలో రామినేని ఫౌండేషన్ యొక్క పురస్కారము అలాగే 2007లో  మాధవపెద్ది ప్రభావతి అవార్డును కూడా అందుకున్నారు.
ఇక నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేసిన ఈమె, దాదాపు 27 సినిమాలను తన సంస్థ ద్వారా నిర్మించడం విశేషం. ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడం తో పాటు రఘుపతి వెంకయ్య పురస్కారం కూడా అందుకున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ కూడా పొందారు.


ఇక చివరి సారిగా 2014 జనవరి 13వ తేదీన తన 86 సంవత్సరాల వయసులో చెన్నైలో మరణించింది అంజలీదేవి.





ఆ సినిమా తో ఎంట్రీ ఇవ్వనున్న సీనియర్ నటి..

పంపు బిల్లు కట్టలేదని మంచం జప్తు..!

ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారిన మహేష్ ఫోటో..

ఆచార్య‌లో ఆమె పాత్ర చ‌నిపోతుందా... !

థర్డ్ వేవ్ ముప్పు ఢిల్లీ, హైదరాబాద్ కేనా..?

భారీగా తగ్గిన ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర...

టీవీ :ఈ ఫోటోలో ఒక టాప్ సెలబ్రేటి ఉంది.. ఆమె ఎవరో తెలుసా ?

వారసుడుని లైన్‌లోకి తీసుకోస్తున్న మండలి...సక్సెస్ అవుతారా?

ఇలా చేస్తే చర్మం, జుట్టు సమస్యలు దూరం...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>