PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpafc46e17-4b11-4cfb-bce0-bc55b59acd75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpafc46e17-4b11-4cfb-bce0-bc55b59acd75-415x250-IndiaHerald.jpgకాట‌సాని పార్టీలో సీనియ‌ర్ నేత‌.. ఇంకా చెప్పాలంటే రాజ‌కీయంగా కూడా ఆయ‌న ఎంతో సీనియ‌ర్‌. 1985లో తొలిసారి గెలిచిన ఆయన ... 1985, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పాణ్యం నియోజకవర్గంలో విజయం సాధించారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ క్యాండెట్ గా ఉన్న సిట్టింగ్ మంత్రి ఏరాసు ప్ర‌తాప్ రెడ్డిని మూడో స్థానంలోకి నెట్టేసి... రెండో స్థానంలో ఉన్నారు. ఆ ఎన్నిక‌ల్లో కాట‌సానికి ఏకంగా 60 వేల ఓట్లు వ‌చ్చాయంటే మాట‌లు కాదు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి జంప్ చేసిysrcp{#}KATASANI RAMBHUPAL REDDY;Nara Lokesh;Katasani Ram Bhupal Reddy;TDP;Party;YCP;Andhra Pradesh;Congress;Reddy;local language;MLA;Ministerమంత్రి ప‌ద‌వికి అడ్డొస్తాడ‌నే వైసీపీ ఎమ్మెల్యే టార్గెట్ ?మంత్రి ప‌ద‌వికి అడ్డొస్తాడ‌నే వైసీపీ ఎమ్మెల్యే టార్గెట్ ?ysrcp{#}KATASANI RAMBHUPAL REDDY;Nara Lokesh;Katasani Ram Bhupal Reddy;TDP;Party;YCP;Andhra Pradesh;Congress;Reddy;local language;MLA;MinisterMon, 21 Jun 2021 08:33:00 GMTక‌ర్నూలు జిల్లాలో టీడీపీ కార్య‌క‌ర్త‌లుగా ఉన్న ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి హ‌త్య‌లు ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. టీడీపీ యువ‌నేత నారా లోకేష్ సైతం పాణ్యం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి.. హ‌త్య‌కు గురైన కార్య‌క‌ర్త‌ల అంత‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. ఈ హ‌త్య‌ల వెన‌క స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కాట‌సాని రాం భూపాల్ రెడ్డి ఉన్నార‌ని టీడీపీ నేత‌ల నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ విమ‌ర్శ‌ల వెన‌క సొంత పార్టీ నేత‌లే ఉన్నారని.. ఆయ‌న్ను టార్గెట్ చేసేలా వైసీపీ వాళ్లే చ‌క్రం తిప్పుతున్నార‌ని కాట‌సాని అనుచ‌రులు కూడా సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

కాట‌సాని పార్టీలో సీనియ‌ర్ నేత‌.. ఇంకా చెప్పాలంటే రాజ‌కీయంగా కూడా ఆయ‌న ఎంతో సీనియ‌ర్‌. 1985లో తొలిసారి గెలిచిన ఆయన ... 1985, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పాణ్యం నియోజకవర్గంలో విజయం సాధించారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ క్యాండెట్ గా ఉన్న సిట్టింగ్ మంత్రి ఏరాసు ప్ర‌తాప్ రెడ్డిని మూడో స్థానంలోకి నెట్టేసి... రెండో స్థానంలో ఉన్నారు. ఆ ఎన్నిక‌ల్లో కాట‌సానికి ఏకంగా 60 వేల ఓట్లు వ‌చ్చాయంటే మాట‌లు కాదు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి జంప్ చేసిన ఆయ‌న ఏకంగా ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక ఇటీవ‌ల హ‌త్య‌కు గురైన ఇద్ద‌రు నేత‌లు గ‌తంలో కాట‌సాని అనుచ‌రులే. అయితే ఆయ‌న‌తో విబేధాలు రావ‌డంతో వారు టీడీపీలోకి వెళ్లి అక్క‌డ గ్రామ స్థాయి నేత‌లుగా ఉన్నారు. అయితే ఈ హ‌త్య‌ల‌కు కాట‌సానికి సంబంధం లేద‌ని కాట‌సాని అనుచ‌రులు చెపుతున్నారు. త్వ‌ర‌లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగుతుండ‌డంతో ఇప్పుడు కేబినెట్లో ఉన్న కీల‌క నేత‌ల్లో ఒక నేతే కాట‌సానిని ఇలా తెర వెన‌క ఉండి టార్గెట్ చేయిస్తున్నార‌న్న ప్ర‌చారం జిల్లాలో జోరుగా న‌డుస్తోంది. ఏదేమైనా వివాదాల‌కు దూరంగా ఉంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారో చూడాలి.

 



రాహుల్ తో బ్లేమ్ గేమ్.. అనేవారికి అర్హతలున్నాయా..?

వీళ్ల ప‌నుల‌తో జ‌గ‌న్ ఫ్యాన్స్‌కు మండిపోతోందిగా...!

కేబినెట్ రేసులో కాట‌సాని.. వైసీపీ వాళ్లే టార్గెట్ చేస్తున్నారా ?

కేసీఆర్ కేబినెట్లో ఛాన్స్‌ ఆ క‌మ్మ నేత‌కా.. ఈ రెడ్డి నేత‌కా ..!

మూత్రదానం చేయండి.. రైతులకు దేశాధ్యక్షుడి పిలుపు..

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు టీడీపీ-జనసేన కలిస్తే ఇబ్బందేనా?

విజ‌య‌సాయి కోసం జ‌గ‌న్ ఆయ‌న్ను బ‌లి చేస్తున్నారా ?

అక్కడ జనసేనకు బలం ఉంది...కానీ పవన్ లైట్ తీసుకున్నారా?

బుద్దా అలా...నాని ఇలా.. బెజవాడలో సైకిల్ సెట్ అయినట్లేనా...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>