PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpc486f37c-b2fb-4447-a8ee-e75cbc7c522e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpc486f37c-b2fb-4447-a8ee-e75cbc7c522e-415x250-IndiaHerald.jpgగత కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా విజయవాడ టీడీపీలో అంతర్గత విభేదాలు పెద్ద ఎత్తున బయటపడిన విషయం తెలిసిందే. ఎంపీ కేశినేని కుమార్తె శ్వేత విజయవాడ మేయర్ అభ్యర్ధిగా రంగంలోకి దిగడంతో అసలు రచ్చ మొదలైంది. శ్వేతని బుద్దా వెంకన్న, బోండా ఉమా వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే నాని సైతం బుద్దా-బోండాలు టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ఎవరు సపోర్ట్ చేసినా, చేయకపోయినా విజయవాడలో టీడీపీని గెలిపించుకుంటానని ఛాలెంజ్ చేశారు.tdp{#}CBN;Nani;swetha;Telugu Desam Party;Bonda;Vijayawada;MP;Kesineni Nani;MLA;Cycle;TDP;News;Buddha Venkanna;Yevaru;Raccha;Coronavirusబుద్దా అలా...నాని ఇలా.. బెజవాడలో సైకిల్ సెట్ అయినట్లేనా...బుద్దా అలా...నాని ఇలా.. బెజవాడలో సైకిల్ సెట్ అయినట్లేనా...tdp{#}CBN;Nani;swetha;Telugu Desam Party;Bonda;Vijayawada;MP;Kesineni Nani;MLA;Cycle;TDP;News;Buddha Venkanna;Yevaru;Raccha;CoronavirusMon, 21 Jun 2021 02:00:00 GMTగత కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా విజయవాడ టీడీపీలో అంతర్గత విభేదాలు పెద్ద ఎత్తున బయటపడిన విషయం తెలిసిందే. ఎంపీ కేశినేని కుమార్తె శ్వేత విజయవాడ మేయర్ అభ్యర్ధిగా రంగంలోకి దిగడంతో అసలు రచ్చ మొదలైంది. శ్వేతని బుద్దా వెంకన్న, బోండా ఉమా వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే నాని సైతం బుద్దా-బోండాలు టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ఎవరు సపోర్ట్ చేసినా, చేయకపోయినా విజయవాడలో టీడీపీని గెలిపించుకుంటానని ఛాలెంజ్ చేశారు.


అటు బుద్దా-బోండాలు సైతం నానిపై విరుచుకుపడ్డారు. దీంతో చంద్రబాబు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అలాగే శ్వేత, బోండా-బుద్దాలని కలిసి వారి మద్ధతు తీసుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. విజయవాడ కార్పొరేషన్‌లో టీడీపీ ఘోరంగా ఓడింది. ఈ ఎన్నికలయ్యాక అందరూ సైలెంట్ అయ్యారు. ఏదో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఒక్కరే పార్టీలో యాక్టివ్‌గా తిరిగారు. నాని, బుద్దా, బోండాలు సైలెంట్ అయిపోయారు.


ఇలా చాలారోజుల పాటు సైలెంట్‌గా ఉన్న బెజవాడ నాయకులు, మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఇటివలే బుద్దా ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది. ఇక ఎమ్మెల్సీ లేకపోయిన టీడీపీకి నిజమైన కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు. అలాగే టీడీపీలో తనకు ఎవరితోనూ గొడవలు లేవని, కేశినేనితో విభేదాలు లేవని, అందరినీ సమన్వయం చేసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్తామని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు.


ఇదే సమయంలో బెజవాడలో బోండా ఉమా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. అలాగే కేశినేని నాని సైతం మళ్ళీ బెజవాడ పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించారు. విజయవాడలో కరోనా బాధితులకు సాయం చేశారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నా, తెలుగుదేశం ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుందని అన్నారు. వైసీపీని గెలిపిస్తే పన్నులు పెంచి ప్రజలని ఇబ్బంది పెడుతుందని, అయినా సరే ప్రజల తరుపున పోరాడతామని చెబుతున్నారు. ఇలా కేశినేని, బుద్దా, బోండాలు మళ్ళీ బెజవాడ పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యారు. మొత్తానికైతే బెజవాడలో సైకిల్ కాస్త సెట్ అయినట్లే కనిపిస్తోంది.




టీవీ :ఈ ఫోటోలో ఒక టాప్ సెలబ్రేటి ఉంది.. ఆమె ఎవరో తెలుసా ?

వారసుడుని లైన్‌లోకి తీసుకోస్తున్న మండలి...సక్సెస్ అవుతారా?

అఖిల సైడ్ అయితే... జస్వంతికి ఛాన్స్ వస్తుందా?

టీపీసీసీ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. రేపే ప్రకటన.. ?

ఏపీలో భారీగా తగ్గిన కేసులు.. ఎన్నంటే...

వైసీపీలో ఆ కుర్ర ఎంపీని ఆడేసుకుంటున్నారుగా...!

ఆసుపత్రిలో దారుణం.. నిండు గర్భిణీపై అత్యాచారయత్నం..

గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి టీడీపీకి డ్యామేజ్ జరిగి, వైసీపీ గెలిచిన నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అలా జనసేన ఓట్లు చీల్చడం వల్ల వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో తూర్పు గోదావరి పి.గన్నవరం నియోజకవర్గం ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి కొండేటి చిట్టిబాబు పోటీ చేశారు. అటు టీడీపీ నుంచి నేలపూడి స్టాలిన్ బాబు, జనసేన నుంచి పాముల రాజేశ్వరి దేవి పోటీ చేశారు.

గత కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా విజయవాడ టీడీపీలో అంతర్గత విభేదాలు పెద్ద ఎత్తున బయటపడిన విషయం తెలిసిందే. ఎంపీ కేశినేని కుమార్తె శ్వేత విజయవాడ మేయర్ అభ్యర్ధిగా రంగంలోకి దిగడంతో అసలు రచ్చ మొదలైంది. శ్వేతని బుద్దా వెంకన్న, బోండా ఉమా వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే నాని సైతం బుద్దా-బోండాలు టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ఎవరు సపోర్ట్ చేసినా, చేయకపోయినా విజయవాడలో టీడీపీని గెలిపించుకుంటానని ఛాలెంజ్ చేశారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>