PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag0639c70d-f1ac-47c1-832c-ff8e0b2c81ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag0639c70d-f1ac-47c1-832c-ff8e0b2c81ed-415x250-IndiaHerald.jpgవైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య‌కేసులో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు త‌మ ద‌ర్యాప్తును 15 రోజులుగా త‌వ్వుతూనే ఉన్నారు. మూడు బృందాలుగా విడిపోయిన అధికారులు పులివెందుల‌, క‌డ‌ప‌లో ప‌లువురు అనుమానితుల‌ను వ‌ర‌స‌బెట్టి విచారిస్తున్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డితోపాటు ఇత‌ర వైసీపీ నేత‌ల‌ను గ‌తంలోనే విచారించారు. కొవిడ్ కార‌ణంగా తాత్కాలికంగా వాయిదా ప‌డిన ద‌ర్యాప్తును అధికారులు వేగ‌వంతం చేశారు. మూడు బృందాలుగా విడిపోయిన సీబీఐ అధికారులు క‌డ‌ప‌, పులివెందుల‌లో మ‌కాం వేసి అనుమానితుల నుంచి స‌మాచారం రాబ‌ట్టే ప‌నtag{#}CBI;MP;YCP;Father;central governmentఎలుక‌ను ప‌ట్ట‌డానికి సిద్ధ‌మైన‌ సీబీఐ?ఎలుక‌ను ప‌ట్ట‌డానికి సిద్ధ‌మైన‌ సీబీఐ?tag{#}CBI;MP;YCP;Father;central governmentMon, 21 Jun 2021 10:21:28 GMTవైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య‌కేసులో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు త‌మ ద‌ర్యాప్తును 15 రోజులుగా త‌వ్వుతూనే ఉన్నారు. మూడు బృందాలుగా విడిపోయిన అధికారులు పులివెందుల‌, క‌డ‌ప‌లో ప‌లువురు అనుమానితుల‌ను వ‌ర‌స‌బెట్టి విచారిస్తున్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డితోపాటు ఇత‌ర వైసీపీ నేత‌ల‌ను గ‌తంలోనే విచారించారు. కొవిడ్ కార‌ణంగా తాత్కాలికంగా వాయిదా ప‌డిన ద‌ర్యాప్తును అధికారులు వేగ‌వంతం చేశారు. మూడు బృందాలుగా విడిపోయిన సీబీఐ అధికారులు క‌డ‌ప‌, పులివెందుల‌లో మ‌కాం వేసి అనుమానితుల నుంచి స‌మాచారం రాబ‌ట్టే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. దీనికోసం ఎర్ర గంగిరెడ్డి నుంచి వివేకా డ్రైవ‌ర్‌తోపాటు ఇంట్లో ప‌నిచేసే ప‌నివారు.. బంధువులు.. ఇంటికి చుట్టుప‌క్క‌ల ఉండేవారు.. వివేకానంద‌రెడ్డి పొలం ప‌క్క‌న ఉండే మ‌రో పొలం యాజ‌మానిని కూడా వ‌ద‌ల‌కుండా విచార‌ణ‌కు పిలిపించారు.. ప్ర‌శ్న‌లు సంధించారు.

అవ‌స‌ర‌మైన స‌మాచారం వ‌చ్చిందా? అన‌వ‌స‌ర‌మైన స‌మాచారం వ‌చ్చిందా?
అంత‌వ‌ర‌కు బాగానేవుందికానీ అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని సీబీఐ సేక‌రించిందా?  లేదా? అనేది ఇప్పుడు అంద‌రినీ తొలిచేస్తున్న సందేహం. కొవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డిన కేసు వేగాన్ని పెంచాల‌ని నిశ్చ‌యించుకున్న సీబీఐ అందుకు అనుగుణంగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే ఇంత‌మందిని ప్ర‌శ్నిస్తున్న సీబీఐ తీగ లాగితే డొంక క‌దులుతుంద‌నే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ప్ర‌జ‌లంతా అనుకుంటున్నారు. వివేకానంద‌రెడ్డి కుటుంబ స‌భ్యులంతా త‌మ ప‌నులు మానుకొని సీబీఐకి స‌హ‌క‌రించేందుకు అంద‌రూ పులివెందుల‌లోనే మ‌కాం వేశారు. వివేకా కుమార్తె సునీత అభిప్రాయం ప్ర‌కారం కేసు విచార‌ణ న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంద‌ని, హంతుకుల‌ను ప‌ట్టుకునే దిశ‌గా ఉండ‌టంలేదంటున్నారు. అక్క‌డ ద‌ర్యాప్తు సాగ‌డ‌మ‌నేది అలాగే ఉంటోందంటున్నారు.

సీబీఐకి కొత్త చీఫ్ వ‌చ్చార‌నే ఆశ‌
సీబీఐకి కొత్త డైరెక్ట‌ర్ నియ‌మితుల‌య్యారు. దీంతో ఆ సంస్థ ప‌నితీరు మారుతుంద‌ని, విచార‌ణ‌లో త‌న తండ్రి హంత‌కులు బ‌య‌ట‌కు వ‌స్తార‌నే ఆశ‌లో సునీత ఉన్నారు. కానీ సీబీఐ బృందం ద‌ర్యాప్తు చూసిన‌వారు మాత్రం పెద‌వి విరుస్తున్నారు. నిందితులు బ‌య‌ట‌కు వ‌స్తార‌నే ఆశ క‌న‌ప‌డ‌టంలేద‌ని వివేకా కుటుంబ స‌భ్యులే వ్యాఖ్యానిస్తున్నారు. అస‌లు హ‌త్య జ‌రిగిన‌రోజు ఏం జ‌రిగింది?  హ‌త్య‌ను గుండెపోటు అని ఎవ‌రు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చారు? ఆరోజు ఇంటిలో ఎవ‌రెవ‌రు ఉన్నారు? అంత‌కుముందురోజు వివేకా ఎవ‌రెవ‌రిని క‌లిశారు? హ‌త్య జ‌రిగిన ప్ర‌దేశానికి ముందుగా వెళ్లిన‌వారెవ‌రు?  సాక్ష్యాలు మాయం చేసిందెవ‌రు? అనే కోణం కాకుండా డ్రైవ‌ర్లు, ప‌నివారు, ప‌క్క‌పొలం వారంటూ ఎన్నిరోజులు విచార‌ణ జ‌రిగినా ఉప‌యోగ‌మేంట‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.






వైసీపీ ప్రజాప్రతినిధులకు షాక్!

జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఆ క్యాస్ట్ స్ట్రాంగ్ వార్నింగ్‌... !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఇద్ద‌రూ క‌లిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌నేది రాజ‌కీయ విశ్లేష‌కులు, సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ల అభిప్రాయంగా ఉంది. వీరిద్ద‌రూ మొద‌టి నుంచి ఏకాభిప్రాయంతోనే ప‌నిచేస్తున్నారు. ఎక్కువ‌గా కేసీఆర్ మాటే చెల్ల‌బాటవుతోంద‌నేది అంద‌రికీ తెలిసిందే.

ప్ర‌జ‌ల‌తో జ‌గ‌న్‌, కేసీఆర్‌. "జ‌ల‌కాలాట‌లు"?

యోగా గురించి కేంద్రం ఇలా, బీజేపీ అలా!

రాహుల్ తో బ్లేమ్ గేమ్.. అనేవారికి అర్హతలున్నాయా..?

మమ్మీ హీరో.. డమ్మీ హీరో అయ్యాడే..

టాలీవుడ్ కు రష్మికని ప్రోత్సహించిన వ్యక్తి ఎవరో తెలుసా..?

మంత్రి ప‌ద‌వికి అడ్డొస్తాడ‌నే వైసీపీ ఎమ్మెల్యే టార్గెట్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>