CrimeN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-b5943692-8524-4025-b421-e1aa5f72b2ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-b5943692-8524-4025-b421-e1aa5f72b2ec-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో పరువు హత్య కేసులు ఎక్కడో ఒక్కచోట జరుగుతూనే ఉన్నాయి. కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించదంటే చాలు కన్నకూతురిని కూడా చంపడానికి వెనుకాడటం లేదు. తాజాగా అదే కోణంలో ఓ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మైసూరు జిల్లా పెరియపట్నకు చెందిన జయరామ్ అనే రైతుకి గాయత్రి అనే కూతురు ఉంది.murder {#}Murder.;Gayathri;Raghavendra;police;June;Father;marriage;District;prema;Loveపొలానికి వెళ్లిన కూతురు.. తిరిగి రాలేదు.. చివరకి..?పొలానికి వెళ్లిన కూతురు.. తిరిగి రాలేదు.. చివరకి..?murder {#}Murder.;Gayathri;Raghavendra;police;June;Father;marriage;District;prema;LoveMon, 21 Jun 2021 21:55:05 GMTనేటి సమాజంలో పరువు హత్య కేసులు ఎక్కడో ఒక్కచోట జరుగుతూనే ఉన్నాయి. కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించదంటే చాలు కన్నకూతురిని కూడా చంపడానికి వెనుకాడటం లేదు. తాజాగా అదే కోణంలో ఓ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మైసూరు జిల్లా పెరియపట్నకు చెందిన జయరామ్ అనే రైతుకి గాయత్రి అనే కూతురు ఉంది. గాయత్రి ఓ స్టోర్‌లో పని చేస్తుంది. అదే సమయంలో గాయత్రికి రాఘవేంద్ర అనే యువకుడితో పరిచయమైంది. వీరిద్దరి పరిచయం కాస్త స్నేహంగా మారి ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే ఇద్దరు ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

అయితే గాయిత్రి తన ప్రేమ విషయాన్ని తండ్రి జయరామ్‌కు చెప్పింది. ఇక అబ్బాయి ఎవరో.. ఏంటో తెలుసుకున్న జయరామ్.. ఆ అబ్బాయిది మన కులం కాదని.. మనకంటే తక్కువ కులం అని.. రాఘవేంద్రను మర్చిపోవాలని కూతురి గాయత్రికి చెప్పాడు. ఇక తండ్రి మాటకు ఆమె అంగీకరించలేదు. అయితే ఈ విషయంలో తండ్రీకూతురి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగినట్లు సమాచారం.

గాయిత్రిని ఎంత మందలించినా రాఘవేంద్రతో మాట్లాడుతుందని భావించిన జయరామ్‌ పొలానికి వెళుతున్నానని చెప్పారు. తండ్రి మధ్యాహ్నం భోజనం తీసుకుని రావాలని కూతురికి చెప్పి జూన్ 18న పొలానికి వెళ్ళింది. అదే సమయంలో మళ్లీ ఇద్దరి మధ్య రాఘవేంద్ర గురించి వాగ్వాదం జరిగింది. రాఘవేంద్రను మర్చిపోలేనని కూతురు చెప్పడంతో తీవ్ర కోపోద్రేకంతో జయరామ్ కన్నకూతురిపై గొడ్డలితో దాడి చేశారు. గాయిత్రి మెడపై నరకడంతో గాయమై రక్తం కారుతూ ఉన్న భయంతో పరుగులు తీసింది. ఇక ఆమెను వెంబడించి గొడ్డలితో జయరామ్ నరికి చంపారు.

జయరామ్‌ అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. అయితే కులం తక్కువ వ్యక్తిని ప్రేమించినందుకు తన కూతురిని నరికి చంపానని తెలిపాడు. గాయిత్రి మృతదేహం పొలంలోనే ఉందని చెప్పారు. పోలీసులు జయరామ్‌ను వెంటబెట్టుకుని పొలం దగ్గరికి తీసుకెళ్లాడు. అయితే రక్తపు మడుగులో.. మెడపై తీవ్ర గాయమై గాయత్రి మృతి చెందింది. పోస్టుమార్టు నిమిత్తం మృతదేహన్నీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు జయరామ్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



మరో వ్యక్తితో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిన తల్లి.. చివరికి

తెలుగు సినీ ఇండస్ట్రీలో తల్లీకూతుళ్లు వీళ్లే..

ట్రోల్ చేసిన నెటిజన్స్ చేతనే ప్రశంసలు పొందుతున్న బెల్లం బాబు....

టాలీవుడ్ హీరోయిన్ల యోగా ఫోజులు ఎలా ఉన్నాయో చూడండి ?

పవర్ స్టార్ అంటే ప్రాణం : సంజన..

ఈ స్టార్ హీరో సీరియల్ నటుడిగా కూడా చేశారని తెలుసా?

న్యూస్ రీడర్ గా రమా రాజమౌళి..!!

కేశినేనికి టీడీపీలోనే కొత్త మొగుడు రెడీ ?

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు.. పూర్తి వివరాలివే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>