PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr7a70ccf8-4f91-4c5f-904f-b0ce6d1bcd70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr7a70ccf8-4f91-4c5f-904f-b0ce6d1bcd70-415x250-IndiaHerald.jpgఇదిలా ఉంటే ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నుంచి ఎవ‌రిని కొత్త‌గా కేబినెట్లోకి తీసుకుంటార‌న్న‌దే ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్ గా ఉంది. ఈ జిల్లా నుంచి ప్ర‌స్తుతం ఖ‌మ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్ కుమార్ మంత్రిగా ఉన్నారు. త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఏడింట్లో రెండు ఉమ్మ‌డి జిల్లాకు ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రెండు స్థానాల రేసులో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి. అలాగే మంత్రి వ‌ర్గం రేసులో కూడా ఉమ్మ‌డి ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటKCR{#}KCR;Kumaar;srinivas;Cabinet;Khammam;District;MLA;Minister;MPకేసీఆర్ కేబినెట్లో ఛాన్స్‌ ఆ క‌మ్మ నేత‌కా.. ఈ రెడ్డి నేత‌కా ..!కేసీఆర్ కేబినెట్లో ఛాన్స్‌ ఆ క‌మ్మ నేత‌కా.. ఈ రెడ్డి నేత‌కా ..!KCR{#}KCR;Kumaar;srinivas;Cabinet;Khammam;District;MLA;Minister;MPMon, 21 Jun 2021 08:12:00 GMTతెలంగాణ‌లో త్వ‌ర‌లోనే కేబినెట్లో మార్పులు, చేర్పులు ఉండ‌నున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు మంత్రిగా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్ ను కేసీఆర్ మంత్రి ప‌ద‌వి నుంచి భ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం.. ఆ త‌ర్వాత ఆయ‌న పార్టీని వీడి బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డం జ‌రిగాయి. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండున్న‌రేళ్లు అయ్యింది. మంత్రి వ‌ర్గంలో మార్పులు .. చేర్పులు ఉండ‌వ‌చ్చ‌నే అంటున్నారు. మ‌ల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌, స‌బితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ల‌ను ఉంచుతారా ? త‌ప్పిస్తారా ? అనే దానిపై టీఆర్ ఎస్ వ‌ర్గాల్లోనే పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నుంచి ఎవ‌రిని కొత్త‌గా కేబినెట్లోకి తీసుకుంటార‌న్న‌దే ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్ గా ఉంది. ఈ జిల్లా నుంచి ప్ర‌స్తుతం ఖ‌మ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్ కుమార్ మంత్రిగా ఉన్నారు. త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఏడింట్లో రెండు ఉమ్మ‌డి జిల్లాకు ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రెండు స్థానాల రేసులో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి. అలాగే మంత్రి వ‌ర్గం రేసులో కూడా ఉమ్మ‌డి ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి, తుమ్మల పేర్లు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

వీరిద్దరిలో ఒకరికి కచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇద్ద‌రూ కేబినెట్ రేసులో ఉన్నా కూడా తుమ్మ‌ల కంటే పొంగులేటికే ఎక్కువ ఛాన్సులు ఉంటాయ‌ని కొంద‌రు అంటున్నారు. పొంగులేటికి పెద్ద ఛాన్సులు ఇవ్వ‌లేదు. అందులోనూ గ‌త ఎంపీ ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న సిట్టింగ్ ఎంపీ సీటును కూడా త్యాగం చేశారు. పార్టీలో చేరిన‌ప్ప‌టి నుంచి చాలాసార్లు పొంగులేటికి పదవులు ఇస్తామని చెప్పి ఇవ్వేలేదు. ఆయ‌న‌కు జిల్లాలో బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. అందుకే పొంగులేటికే ఎక్కువ ఛాన్సులు ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు. పైగా జిల్లాలో క‌మ్మ కోటాలో పువ్వాడ ఉండ‌గా తుమ్మ‌ల‌కు ప‌ద‌వి వ‌చ్చే ఛాన్స్ లేదు.

 



మంత్రి ప‌ద‌వికి అడ్డొస్తాడ‌నే వైసీపీ ఎమ్మెల్యే టార్గెట్ ?

కేసీఆర్ కేబినెట్ రేసులో తుమ్మ‌ల‌, పొంగులేటి ?

నేడు వరంగల్, యాదాద్రికి సీఎం కేసీఆర్.. !

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు టీడీపీ-జనసేన కలిస్తే ఇబ్బందేనా?

విజ‌య‌సాయి కోసం జ‌గ‌న్ ఆయ‌న్ను బ‌లి చేస్తున్నారా ?

అక్కడ జనసేనకు బలం ఉంది...కానీ పవన్ లైట్ తీసుకున్నారా?

బుద్దా అలా...నాని ఇలా.. బెజవాడలో సైకిల్ సెట్ అయినట్లేనా...

వారసుడుని లైన్‌లోకి తీసుకోస్తున్న మండలి...సక్సెస్ అవుతారా?

అఖిల సైడ్ అయితే... జస్వంతికి ఛాన్స్ వస్తుందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>