PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagcd52690e-0fe5-41ec-b491-133257aadf23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagcd52690e-0fe5-41ec-b491-133257aadf23-415x250-IndiaHerald.jpg చిన్న‌త‌నం నుంచి మ‌నం ఒక మాట వింటూ పెరిగాం.. మాన‌సిక ప్ర‌శాంత‌త కావాలంటే యోగా చేయండి అని. అస‌లు మాన‌సిక ప్ర‌శాంతత కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఎవ‌రూ చెప్ప‌లేదు. అది రావ‌డం మ‌న జ‌న్మ‌హ‌క్కు అన్న‌ట్లు.. దాన్ని త‌గ్గించుకోవ‌డానికి యోగా చేయాలి అన్న‌ట్లుగా మ‌న మెదడుకు చిన్న‌ప్ప‌టి నుంచి త‌ర్ఫీదునిచ్చారు. అది కూడా అలాగే అల‌వాటు ప‌డిపోయింది. ఓహో.. యోగా చేయాలంటే.. ముందు మ‌నం మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను పోగొట్టుకోవాలి.. తిరిగి దాన్ని యోగాద్వారా ద‌క్కించుకోవాలి. యోగం మార్చుకోవ‌డానికి యాగాలు చేస్తాం.. అనేక ఇతtag{#}Yogaకోటి మాట : యోగం మార్చుకోండర్రా?కోటి మాట : యోగం మార్చుకోండర్రా?tag{#}YogaMon, 21 Jun 2021 12:10:00 GMTచిన్న‌త‌నం నుంచి మ‌నం ఒక మాట వింటూ పెరిగాం.. మాన‌సిక ప్ర‌శాంత‌త కావాలంటే యోగా చేయండి అని. అస‌లు మాన‌సిక ప్ర‌శాంతత కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఎవ‌రూ చెప్ప‌లేదు. అది రావ‌డం మ‌న జ‌న్మ‌హ‌క్కు అన్న‌ట్లు.. దాన్ని త‌గ్గించుకోవ‌డానికి యోగా చేయాలి అన్న‌ట్లుగా మ‌న మెదడుకు చిన్న‌ప్ప‌టి నుంచి త‌ర్ఫీదునిచ్చారు. అది కూడా అలాగే అల‌వాటు ప‌డిపోయింది. ఓహో.. యోగా చేయాలంటే.. ముందు మ‌నం మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను పోగొట్టుకోవాలి.. తిరిగి దాన్ని యోగాద్వారా ద‌క్కించుకోవాలి. యోగం మార్చుకోవ‌డానికి యాగాలు చేస్తాం.. అనేక ఇత‌ర ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తాం. అస‌లు చేయాల్సింది చేయం.. అదే మ‌న‌లోపాన్ని మ‌నం స‌రిదిద్దుకోం. అదే చేస్తే అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాలుండ‌వు.. స‌మ‌స్య‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు యోగా నేర్చుకోండంటూ చెప్పేవారూ ఉండరు.

ఉత్ప‌న్న‌మ‌వుతోన్న స‌మ‌స్య‌కు మూలం ఎక్క‌డ‌?
స‌మ‌స్య ఎక్క‌డి నుంచి ఉత్ప‌న్న‌మ‌వుతోంది?  దాన్ని మూలం ఏంటి? ప‌రిష్క‌రించాలంటే ఏం చేయాలి? అనే కోణంలో ఆలోచించ‌గ‌లిగితే మ‌నం యోగించిన‌ట్లే. యోగం కోసం యోగుల ద‌గ్గ‌ర‌కు ప‌రిగెత్తుతాంకానీ వారు చెప్పిన‌వి మాత్రం ఆచ‌రించం. ఎదుకంటే అవి క‌ష్టంగా ఉంటాయి కాబ‌ట్టి. వారి జీవ‌న విధానం ఎలా ఉంది? ఎన్ని క‌ష్టాల‌నైనా వారు ఎలా త‌ట్టుకోగ‌లిగారు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం మ‌న‌ద‌గ్గ‌రే ఉంటుంది. క‌ష్టం-సుఖం, న‌ష్టం-లాభం లాంటివాటిని ఒకేభావ‌న‌తో చూడ‌గ‌లిగితే చాలు. యోగులంటే అడ‌వుల్లో ఎక్క‌డో ముక్కుమూసుకొని త‌పస్సు చేసుకునేవారు కాదు.. మ‌న ఇంట్లోనే ఉంటారు.. మ‌న బంధువుల్లో ఉంటారు.. మ‌న స్నేహితుల్లో ఉంటారు.. మ‌న‌కు తెలిసిన‌వారిలో ఉంటారు.. అడుగ‌డునా అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతూ ప‌దిమందికి ఉపాధినిస్తూ.. వారితోపాటు మ‌రికొంత‌మందికి జీవ‌నాధారాన్ని క‌ల్పించ‌డానికి త‌మ జీవితంలో వారెంత త్యాగం చేశారు? ఎంత శ్ర‌మ‌ను ధార‌పోశారు? క‌ష్ట‌న‌ష్టాల‌ను ఎలా ఎదుర్కొన్నారు?  రెండింటినీ స‌మ‌భావ‌న‌తో ఎలా చూడ‌గ‌లిగారు? అనేవి అర్థం చేసుకొని పాటించ‌గ‌లిగితేచాలు.. యోగం ప‌రిగెత్తుకుంటూ వ‌స్తుంది.

మ‌న‌మెలా ఉన్నాం.. వారెలా ఉన్నారు?
ప్ర‌పంచానికి భార‌త‌దేశం ఇచ్చిన కానుక యోగా అని నిస్సందేహంగా చెప్ప‌వ‌చ్చు. ఒక్క యోగా చేస్తేనే ఇన్ని లాభాలున్న‌ప్ప‌డు భార‌తదేశంలో ఇంకా ఇలాంటివి ఎన్నిర‌కాలున్నాయో అనే ఆలోచ‌న విశ్వ‌మంతా క‌లుగుతోంది. మ‌న‌లో మాత్రం క‌ల‌గ‌డంలేదు. పెర‌టిచెట్టు వైద్యానికి ప‌నికిరాదు.. అన్న సామెత‌ను గుర్తుచేస్తూ మ‌న‌మేమో అర్థ‌రాత్రి వ‌ర‌కు మేల్కొంటూ.. వాటికి పాశ్చాత్య దేశాల‌కు చెందిన అల‌వాట్లు అని పెట్టుకొని ముసిరిపోతున్నాం. మ‌న‌క‌న్నా సాంకేతికంగా 30 నుంచి 40 సంవ‌త్స‌రాలు ముందున్నాయ‌నే ఆ పాశ్చాత్య దేశాలు మ‌న ఆహార‌పు అల‌వాట్లు పాటిస్తున్నాయి. స‌మ‌యానికి భోజ‌నం చేయ‌డం, ఎప్ప‌టిక‌ప్పుడు చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవ‌డం, తొంద‌ర‌గా నిద్రించ‌డం, తెల్ల‌వారుజామునే లేవ‌డం.. వ్యాయామాలు, యోగా లాంటివ‌న్నీ చేసుకుంటూ శారీర‌కంగా, మాన‌సికంగా ఆరోగ్యంతో ఉన్నారు. మ‌న పూర్వీకులందించిన‌వాటిని విస్మ‌రించి పొరుగింటి పుల్ల‌కూర రుచి అనుకుంటూ అన‌వ‌స‌ర‌మైన డాంబికాల‌వెంట ప‌రిగెడితే ఎలా ఉంటుందో నెమ్మ‌ది నెమ్మ‌దిగా అవ‌గ‌త‌మ‌వుతోంది. నిజ‌మైన యోగం కావాలంటే ఏంచేయాలో ఇప్ప‌టికే ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఇక‌నుంచైనా ఆ దిశ‌గానే ప్ర‌యాణం చేద్దాం..!!







యోగా డే: అక్కడ ఆసనాలు వద్దురా బాబు!

చిన్న‌త‌నం నుంచి మ‌నం ఒక మాట వింటూ పెరిగాం.. మాన‌సిక ప్ర‌శాంత‌త కావాలంటే యోగా చేయండి అని. అస‌లు మాన‌సిక ప్ర‌శాంతత కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఎవ‌రూ చెప్ప‌లేదు. అది రావ‌డం మ‌న జ‌న్మ‌హ‌క్కు అన్న‌ట్లు.. దాన్ని త‌గ్గించుకోవ‌డానికి యోగా చేయాలి అన్న‌ట్లుగా మ‌న మెదడుకు చిన్న‌ప్ప‌టి నుంచి త‌ర్ఫీదునిచ్చారు. అది కూడా అలాగే అల‌వాటు ప‌డిపోయింది.

టెన్షన్ తగ్గాలంటే ఇలా చేయండి..?

గర్భిణీలు యోగా చేయడం వల్ల కలిగే లాభాలెన్నో ..

వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య‌కేసులో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు త‌మ ద‌ర్యాప్తును 15 రోజులుగా త‌వ్వుతూనే ఉన్నారు. మూడు బృందాలుగా విడిపోయిన అధికారులు పులివెందుల‌, క‌డ‌ప‌లో ప‌లువురు అనుమానితుల‌ను వ‌ర‌స‌బెట్టి విచారిస్తున్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డితోపాటు ఇత‌ర వైసీపీ నేత‌ల‌ను గ‌తంలోనే విచారించారు. కొవిడ్ కార‌ణంగా తాత్కాలికంగా వాయిదా ప‌డిన ద‌ర్యాప్తును అధికారులు వేగ‌వంతం చేశారు.

ఎలుక‌ను ప‌ట్ట‌డానికి సిద్ధ‌మైన‌ సీబీఐ?

ఒకే రోజు నాలుగు విశేషాలు.. ఏమేమంటే?

యోగాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

యోగా కోసం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి : మోది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>