PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/north-korea2fe9b056-bb0b-44ac-95b4-51fe41d64317-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/north-korea2fe9b056-bb0b-44ac-95b4-51fe41d64317-415x250-IndiaHerald.jpgఅన్ని దానాల్లో కెల్లా గొప్ప దానం ఏంటంటే.. రకరకాల సమాధానాలు వినిపిస్తుంటాయి. ఈమధ్య కరోనా కాలంలో రక్తదానం, ప్లాస్మాదానం అనేవి ప్రముఖంగా వినిపించాయి. కానీ ఇప్పుడు ఉత్తర కొరియాలో మాత్రం మూత్రదానం అనేది బాగా ఫేమస్ అవుతోంది. అవును, స్వయానా ఆ దేశాధ్యక్షుడే మూత్రదానం చేయాలంటూ రైతులకు పిలుపునిచ్చాడు. ఇంతకీ ఉత్తర కొరియాకి మూత్రదానం అవసరం ఏమొచ్చింది? అసలా మూత్రంతో అధ్యక్షుడు కిమ్ ఏంచేయబోతున్నారు? north korea{#}Korea; South;local language;Coffee;Coronavirusమూత్రదానం చేయండి.. రైతులకు దేశాధ్యక్షుడి పిలుపు..మూత్రదానం చేయండి.. రైతులకు దేశాధ్యక్షుడి పిలుపు..north korea{#}Korea; South;local language;Coffee;CoronavirusMon, 21 Jun 2021 08:00:00 GMTఅన్ని దానాల్లో కెల్లా గొప్ప దానం ఏంటంటే.. రకరకాల సమాధానాలు వినిపిస్తుంటాయి. ఈమధ్య కరోనా కాలంలో రక్తదానం, ప్లాస్మాదానం అనేవి ప్రముఖంగా వినిపించాయి. కానీ ఇప్పుడు ఉత్తర కొరియాలో మాత్రం మూత్రదానం అనేది బాగా ఫేమస్ అవుతోంది. అవును, స్వయానా ఆ దేశాధ్యక్షుడే మూత్రదానం చేయాలంటూ రైతులకు పిలుపునిచ్చాడు. ఇంతకీ ఉత్తర కొరియాకి మూత్రదానం అవసరం ఏమొచ్చింది? అసలా మూత్రంతో అధ్యక్షుడు కిమ్ ఏంచేయబోతున్నారు?

 కరోనా కష్టకాలం మొదలైన తర్వాత ఉత్తర కొరియా తలుపులు మూసేసుకుంది. ఇతర దేశాలతో సంబంధాలు పూర్తిగా తెంచేసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకే అధ్యక్షుడు కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనివల్ల కరోనా కట్టడి సాధ్యమైంది కానీ, దేశంలో ఆర్థిక సంక్షోభం మొదలైంది. ఇతర దేశాల దిగుమతులు ఆగిపోయాయి. రేట్లు అమాతం పెరిగిపోయాయి.

ఉత్తర కొరియా ప్రధానంగా ఆహార ఉత్పత్తులు, ఎరువులు, ఇంధన ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటుంది. ప్రతి ఏటా ఈ దిగుమతుల విలువ 250 కోట్ల డాలర్లుగా ఉంటుంది. అయితే కరోనా వచ్చిన తర్వాత దిగుమతుల విలువ 50కోట్ల డాలర్లకు పడిపోయింది. దీంతో దేశీయంగా అన్నిటికీ కరువొచ్చింది. రేట్లు అమాంతంగా పెరిగిపోయాయి. కిలో అరటి పండ్లు 3వేల రూపాయలు, టీ పొడి ప్యాకెట్ 5వేల రూపాయలు, కాఫీ పొడి 7వేల రూపాయలు. ఇదీ మచ్చుకు ఉత్తర కొరియాలో కొన్ని ఆహార పదార్థాల రేట్లు.



అరటిపండ్లు, టీపొడి లేకపోయినా పెద్దగా నష్టంలేదు కానీ, దేశంలో ఆహార ధాన్యాలకు అవసరమైన ఎరువులు లేకపోతేనే మరింత కష్టం. యూరియా దిగుమతి పూర్తిగా నిలిచిపోవడంతో ఇప్పుడు దేశీయంగా యూరియా తయారు చేసేందుకు ఉత్తర కొరియా సన్నాహాలు చేసుకుంటోంది. దీనికి సంబంధించి అధ్యక్షుడు కిమ్ ఓ వింత ప్రకటన చేశారని స్థానిక వర్గాలంటున్నాయి. రైతులంతా యూరియా తయారీకోసం తమ మూత్రాన్ని ఇవ్వాలని కిమ్ ఆదేశించాడట. రోజుకి 2లీటర్ల మూత్రదానం చేయాలని చెప్పారట. ఇదే ఇప్పుడు ఉత్తర కొరియాలో హాట్ టాపిక్ గా మారింది.



మంత్రి ప‌ద‌వికి అడ్డొస్తాడ‌నే వైసీపీ ఎమ్మెల్యే టార్గెట్ ?

ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారిన మహేష్ ఫోటో..

అన్ని దానాల్లో కెల్లా గొప్ప దానం ఏంటంటే.. రకరకాల సమాధానాలు వినిపిస్తుంటాయి. ఈమధ్య కరోనా కాలంలో రక్తదానం, ప్లాస్మాదానం అనేవి ప్రముఖంగా వినిపించాయి. కానీ ఇప్పుడు ఉత్తర కొరియాలో మాత్రం మూత్రదానం అనేది బాగా ఫేమస్ అవుతోంది. అవును, స్వయానా ఆ దేశాధ్యక్షుడే మూత్రదానం చేయాలంటూ రైతులకు పిలుపునిచ్చాడు. యూరియాను స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు రైతులంతా తమ యూరిన్ దానం చేయాలని పిలుపునిచ్చారు.

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వెండి ధర ఇలా .. !

థర్డ్ వేవ్ ముప్పు ఢిల్లీ, హైదరాబాద్ కేనా..?

చెల్లి కోరికను కాజల్ తీరుస్తుందా..!!

బుద్దా అలా...నాని ఇలా.. బెజవాడలో సైకిల్ సెట్ అయినట్లేనా...

ఏపీలో భారీగా తగ్గిన కేసులు.. ఎన్నంటే...

ఆసుపత్రిలో దారుణం.. నిండు గర్భిణీపై అత్యాచారయత్నం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>