PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag7ff5365d-4aad-4c7e-8603-6a41163473e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag7ff5365d-4aad-4c7e-8603-6a41163473e6-415x250-IndiaHerald.jpgమంత్రి ప‌ద‌వులిచ్చేది నేనా? విజ‌య‌సాయిరెడ్డా? అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వ్యాఖ్యానించిన‌ట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతోంది. ఉత్త‌రాంధ్ర నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న అవంతి శ్రీ‌నివాస్ రాజ్య‌స భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డితో సన్నిహితంగా మెల‌గుతున్నారు. చాలాసార్లు ముఖ్య‌మంత్రిక‌న్నా విజ‌య‌సాయికే ఎక్కువ ప్రాతినిధ్యం ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి స‌మాచారం తెప్పించుకున్న త‌ర్వాతే జ‌గ‌న్ అలా వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది. ఇద్tag{#}Lokesh;Telugu Desam Party;Amarnath Cave Temple;Y. S. Rajasekhara Reddy;District;avanthi srinivas;MLA;Minister;Lokesh Kanagaraj;Father;Dookudu;Party;Vishakapatnamమంత్రి ప‌ద‌విచ్చేది నేనా? విజ‌య‌సాయిరెడ్డా?మంత్రి ప‌ద‌విచ్చేది నేనా? విజ‌య‌సాయిరెడ్డా?tag{#}Lokesh;Telugu Desam Party;Amarnath Cave Temple;Y. S. Rajasekhara Reddy;District;avanthi srinivas;MLA;Minister;Lokesh Kanagaraj;Father;Dookudu;Party;VishakapatnamMon, 21 Jun 2021 16:54:00 GMTమంత్రి ప‌ద‌వులిచ్చేది నేనా?  విజ‌య‌సాయిరెడ్డా? అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వ్యాఖ్యానించిన‌ట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతోంది. ఉత్త‌రాంధ్ర నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న అవంతి శ్రీ‌నివాస్ రాజ్య‌స భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డితో సన్నిహితంగా మెల‌గుతున్నారు. చాలాసార్లు ముఖ్య‌మంత్రిక‌న్నా విజ‌య‌సాయికే ఎక్కువ ప్రాతినిధ్యం ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి స‌మాచారం తెప్పించుకున్న త‌ర్వాతే జ‌గ‌న్ అలా వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది. ఇద్ద‌రి సాన్నిహిత్యంపై కొద్దిరోజుల నుంచి జ‌గ‌న్ అసంతృప్తిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త్వ‌ర‌లోనే అవంతి శ్రీ‌నివాస్ బ‌దులు ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్‌నాథ్‌కు స్థానం ద‌క్క‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న‌పేరు ఖాయ‌మైంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి.

గుడివాడ‌కే ఖాయం?
గుడివాడ అమ‌ర్‌నాథ్‌ విశాఖ న‌గ‌రానికి చెందిన‌వారే. ఆయ‌న‌, మంత్రి అవంతి ఇద్ద‌రూ కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే. అవంతి ప్ర‌కాశం జిల్లా నుంచి వెళ్లి అక్క‌డ స్థిర‌ప‌డ్డారు. అమ‌ర్‌నాథ్ స్థానికుల‌వ‌డంతోపాటు ఆయ‌న తండ్రి గురునాథ‌రావు మాజీ మంత్రి. త‌న‌కు అత్యంత విధేయుడిగా ఉన్న అమ‌ర్‌నాథ్‌కే మంత్రిప‌ద‌వి ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇప్ప‌టికే నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యం చూచాయ‌గా అర్థ‌మ‌వ‌డంతో మంత్రి అవంతి కూడా త‌న దూకుడు త‌గ్గించారు. చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడు లోకేష్ పై మండిప‌డే అవంతి విమ‌ర్శ‌ల‌ను ఆపేశారు. అలాగే గుడివాడ దీన్ని అవ‌కాశంగా మ‌ల‌చుకొని వారిద్ద‌రిపై విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.

మొద‌టివిడ‌తలోనే రావాల్సింది!
మొద‌టి విడ‌త‌లోనే అమ‌ర్‌నాథ్‌కు మంత్రిప‌ద‌వి ద‌క్కాల్సి ఉండ‌గా అవంతి కోసం సాయిరెడ్డి కోర‌డం, ఆయ‌న అదృష్టం క‌లిసివ‌చ్చి మంత్రి అయ్యారు. అయితే రెండోవిడ‌త అవంతి బ‌దులు అమ‌ర్‌నాథ్ ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాకుండా జ‌గ‌న్ కూడా అవంతి ప‌నితీరుపై, వ్య‌వ‌హార‌శైలిపై కొద్దికాలంగా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. న‌ర్మ‌గ‌ర్భంగా జ‌గ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు కూడా ఇదే విష‌యాన్ని తేట‌తెల్లం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి గెలుపొంద‌డ‌మే కాకుండా మంత్రిప‌ద‌వి కూడా చేప‌ట్టిన అవంతి శ్రీ‌నివాస్‌పై ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల నుంచే తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇంటిలిజెన్స్ ద్వారా నివేదిక తెప్పించుకున్న ముఖ్య‌మంత్రి అందుకు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.







విజ‌య్ కొత్త‌చిత్రం 'బీస్ట్‌'

కేశినేనికి టీడీపీలోనే కొత్త మొగుడు రెడీ ?

భార‌త‌దేశంలో టీకాలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఎప్పుడూ లేనివిధంగా 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశ‌వ్యాప్తంగా 47 ల‌క్ష‌ల‌మందికిపైగా టీకా ఇచ్చిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కేంద్రం సార్వ‌త్రిక టీకా పేరుతో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. తొలిరోజే ఇంత‌మందికి టీకాలివ్వ‌డం ఆనందదాయ‌క‌మ‌ని ప్ర‌భుత్వం వ్యాఖ్యానించింది.

భార‌త్ లో టీకాల మోత‌?

కోటి మాట: ఈ బృహున్నల రాజకీయ మేలనోయి రాజోరూ?

వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యం విద్యార్థులు ప్ర‌య‌త్నించారు. దీంతో అక్క‌డ కొద్దిసేపు ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. వ‌రంగ‌ల్‌లో మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రిని ప్రారంభించిన అనంత‌రం నూత‌న క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించ‌డానికి ముఖ్య‌మంత్రి బ‌య‌లుదేరారు. ఈ క్ర‌మంలోనే ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాలంటూ విద్యార్థులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌బోగా పోలీసులు భగ్నం చేశారు.

కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న 'కాక‌తీయ‌'?

వరంగల్ ను చూసి హైదరాబాదోళ్లు కుళ్లుకోవాలె : కేసీఆర్

తెలంగాణ‌లో లాక్ డౌన్ ఎత్తివేత‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న‌వారికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌దులిచ్చారు. ఆదాయం లేక ఇబ్బంది ప‌డుతున్న పేద‌ల‌ను దృష్టిలో ఉంచుకొని లాక్‌డౌన్ ఎత్తేశామ‌న్నారు. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు లాక్‌డౌన్ స‌డ‌లింపులిచ్చినా కొవిడ్ వ్యాప్తి జ‌ర‌గ‌లేద‌న్నారు. ఈ విష‌య‌మై వైద్యాధికారుల‌తో మాట్లాడామ‌ని, వైద్య‌రంగంలోని నిపుణులంద‌రితో చ‌ర్చించిన త‌ర్వాతే రాష్ట్ర ప్ర‌భుత్వం లాక్ డౌన్ ఎత్తేసింద‌న్నారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>