BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag06efc40d-225b-404c-b122-92b9adc0155e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag06efc40d-225b-404c-b122-92b9adc0155e-415x250-IndiaHerald.jpg తెలంగాణ‌లో లాక్ డౌన్ ఎత్తివేత‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న‌వారికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌దులిచ్చారు. ఆదాయం లేక ఇబ్బంది ప‌డుతున్న పేద‌ల‌ను దృష్టిలో ఉంచుకొని లాక్‌డౌన్ ఎత్తేశామ‌న్నారు. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు లాక్‌డౌన్ స‌డ‌లింపులిచ్చినా కొవిడ్ వ్యాప్తి జ‌ర‌గ‌లేద‌న్నారు. ఈ విష‌య‌మై వైద్యాధికారుల‌తో మాట్లాడామ‌ని, వైద్య‌రంగంలోని నిపుణులంద‌రితో చ‌ర్చించిన త‌ర్వాతే రాష్ట్ర ప్ర‌భుత్వం లాక్ డౌన్ ఎత్తేసింద‌న్నారు. అయినా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, క‌రోనా నియంత్ర‌ణ‌పై, రాష్ట్ర ప్రజ‌ల‌పై వారికే బాధ్య‌త ఉన్న‌tag{#}KCR;Eveningవిమ‌ర్శించేవారి జ్ఞానానికే వ‌దిలేస్తున్నా!!విమ‌ర్శించేవారి జ్ఞానానికే వ‌దిలేస్తున్నా!!tag{#}KCR;EveningMon, 21 Jun 2021 17:10:11 GMT
తెలంగాణ‌లో లాక్ డౌన్ ఎత్తివేత‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న‌వారికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌దులిచ్చారు. ఆదాయం లేక ఇబ్బంది ప‌డుతున్న పేద‌ల‌ను దృష్టిలో ఉంచుకొని లాక్‌డౌన్ ఎత్తేశామ‌న్నారు. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు లాక్‌డౌన్ స‌డ‌లింపులిచ్చినా కొవిడ్ వ్యాప్తి జ‌ర‌గ‌లేద‌న్నారు. ఈ విష‌య‌మై వైద్యాధికారుల‌తో మాట్లాడామ‌ని, వైద్య‌రంగంలోని నిపుణులంద‌రితో చ‌ర్చించిన త‌ర్వాతే రాష్ట్ర ప్ర‌భుత్వం లాక్ డౌన్ ఎత్తేసింద‌న్నారు. అయినా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, క‌రోనా నియంత్ర‌ణ‌పై, రాష్ట్ర ప్రజ‌ల‌పై వారికే బాధ్య‌త ఉన్న‌ట్లు మాట్లాడుతున్నార‌ని, విమ‌ర్శించేవారి జ్ఞానానికే వాటిని వ‌దిలేస్తున్నాన‌న్నారు. వ‌రంగ‌ల్‌లో క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ప్రారంభం సంద‌ర్భంగా కేసీఆర్ విమ‌ర్శ‌కుల‌పై మండిప‌డ్డారు. ఒక బాధ్య‌తాయుత‌మైన స్థానంలో ఉన్న వ్య‌క్తి బాధ్య‌త లేకుండా ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ప్ర‌శ్నించారు. క‌రోనా ఇప్పుడు రాద‌ని, వ‌స్తే అక్టోబ‌రులోనేన‌ని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేత‌, జులై ఒక‌టోతేదీ నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.





ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడి న‌టిస్తున్న 65వ చిత్రం బీస్ట్‌. రేపు విజ‌య్ జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న స‌న్‌పిక్చ‌ర్స్ ఫ‌స్ట్ లుక్‌, మొద‌టి పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. విజ‌య్ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్లుగా నిలిచిన విజిల్‌, మాస్ట‌ర్ చిత్రాలు కూడా ఆంగ్ల టైటిల్స్ తోనే వ‌చ్చాయి. ఆ సెంటిమెంట్‌నే కొన‌సాగిస్తూ ఈ చిత్రానికి కూడా బీస్ట్ అని పేరుపెట్టిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

విజ‌య్ కొత్త‌చిత్రం 'బీస్ట్‌'

భార‌త‌దేశంలో టీకాలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఎప్పుడూ లేనివిధంగా 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశ‌వ్యాప్తంగా 47 ల‌క్ష‌ల‌మందికిపైగా టీకా ఇచ్చిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కేంద్రం సార్వ‌త్రిక టీకా పేరుతో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. తొలిరోజే ఇంత‌మందికి టీకాలివ్వ‌డం ఆనందదాయ‌క‌మ‌ని ప్ర‌భుత్వం వ్యాఖ్యానించింది.

భార‌త్ లో టీకాల మోత‌?

వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యం విద్యార్థులు ప్ర‌య‌త్నించారు. దీంతో అక్క‌డ కొద్దిసేపు ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. వ‌రంగ‌ల్‌లో మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రిని ప్రారంభించిన అనంత‌రం నూత‌న క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించ‌డానికి ముఖ్య‌మంత్రి బ‌య‌లుదేరారు. ఈ క్ర‌మంలోనే ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాలంటూ విద్యార్థులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌బోగా పోలీసులు భగ్నం చేశారు.

కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న 'కాక‌తీయ‌'?

వరంగల్ ను చూసి హైదరాబాదోళ్లు కుళ్లుకోవాలె : కేసీఆర్

తెలంగాణ‌లో లాక్ డౌన్ ఎత్తివేత‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న‌వారికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌దులిచ్చారు. ఆదాయం లేక ఇబ్బంది ప‌డుతున్న పేద‌ల‌ను దృష్టిలో ఉంచుకొని లాక్‌డౌన్ ఎత్తేశామ‌న్నారు. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు లాక్‌డౌన్ స‌డ‌లింపులిచ్చినా కొవిడ్ వ్యాప్తి జ‌ర‌గ‌లేద‌న్నారు. ఈ విష‌య‌మై వైద్యాధికారుల‌తో మాట్లాడామ‌ని, వైద్య‌రంగంలోని నిపుణులంద‌రితో చ‌ర్చించిన త‌ర్వాతే రాష్ట్ర ప్ర‌భుత్వం లాక్ డౌన్ ఎత్తేసింద‌న్నారు.

మంత్రి ప‌ద‌వులిచ్చేది నేనా? విజ‌య‌సాయిరెడ్డా? అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వ్యాఖ్యానించిన‌ట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతోంది. ఉత్త‌రాంధ్ర నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న అవంతి శ్రీ‌నివాస్ రాజ్య‌స భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డితో సన్నిహితంగా మెల‌గుతున్నారు. చాలాసార్లు ముఖ్య‌మంత్రిక‌న్నా విజ‌య‌సాయికే ఎక్కువ ప్రాతినిధ్యం ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>