MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcpa92e9f0a-7e4d-477b-be82-f978061ed52d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcpa92e9f0a-7e4d-477b-be82-f978061ed52d-415x250-IndiaHerald.jpgగత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి టీడీపీకి డ్యామేజ్ జరిగి, వైసీపీ గెలిచిన నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అలా జనసేన ఓట్లు చీల్చడం వల్ల వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో తూర్పు గోదావరి పి.గన్నవరం నియోజకవర్గం ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి కొండేటి చిట్టిబాబు పోటీ చేశారు. అటు టీడీపీ నుంచి నేలపూడి స్టాలిన్ బాబు, జనసేన నుంచి పాముల రాజేశ్వరి దేవి పోటీ చేశారు.ysrcp{#}udhayanidhi stalin;Janasena;East;MLA;TDP;YCP;Stalin;Cheque;Governmentహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు టీడీపీ-జనసేన కలిస్తే ఇబ్బందేనా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు టీడీపీ-జనసేన కలిస్తే ఇబ్బందేనా?ysrcp{#}udhayanidhi stalin;Janasena;East;MLA;TDP;YCP;Stalin;Cheque;GovernmentMon, 21 Jun 2021 05:00:00 GMTగత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి టీడీపీకి డ్యామేజ్ జరిగి, వైసీపీ గెలిచిన నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అలా జనసేన ఓట్లు చీల్చడం వల్ల వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో తూర్పు గోదావరి పి.గన్నవరం నియోజకవర్గం ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి కొండేటి చిట్టిబాబు పోటీ చేశారు. అటు టీడీపీ నుంచి నేలపూడి స్టాలిన్ బాబు, జనసేన నుంచి పాముల రాజేశ్వరి దేవి పోటీ చేశారు.


ఇక ఇక్కడ జనసేన దాదాపు 36 వేల ఓట్లు తెచ్చుకుంది. అటు టీడీపీకి 45 వేల ఓట్లు పడ్డాయి. ఇక వైసీపీ దాదాపు 22 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఒకవేళ టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీకి చెక్ పడేది. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన చిట్టిబాబు మంచి పనితీరు ముందుకెళుతున్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారు. ప్రభుత్వ పథకాలు చక్కగా అమలవుతున్నాయి. అటు కొత్తగా రోడ్ల నిర్మాణం జరుగుతుంది.


అలాగే ఎప్పటినుంచో లంక గ్రామాల ప్రజలకు తీరని కలగా ఉన్న, ఊడిమూడిలంక వద్ద వశిష్ట నదీ పాయపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి, అందులో ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతుంది. అలాగే నాడు-నేడు ద్వారా నియోజకవర్గంలో ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్స్ రూపు రేఖలు మారాయి.


అయితే నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి. గోదావరికి వరద వస్తే లంక గ్రామాలకు ముంపు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అటు నియోజకవర్గంలో రైతుల పంటలకు గిట్టుబాట ధర దక్కేలా చేయడంలో ఎమ్మెల్యే కాస్త విఫలమవుతున్నారు. ఇక రాజకీయంగా చూసుకుంటే చిట్టిబాబు మాత్రం బలంగానే ఉన్నారు. కానీ టీడీపీ-జనసేనలు విడివిడిగా ఉన్నంత కాలం చిట్టిబాబుకు ఇబ్బంది లేదు. ఒకవేళ ఆ రెండు పార్టీలు కలిస్తే ఎమ్మెల్యే చిట్టిబాబుకు చెక్ పడే అవకాశాలున్నాయి.




కేబినెట్ రేసులో కాట‌సాని.. వైసీపీ వాళ్లే టార్గెట్ చేస్తున్నారా ?

మంత్రి ప‌ద‌వికి అడ్డొస్తాడ‌నే వైసీపీ ఎమ్మెల్యే టార్గెట్ ?

కేసీఆర్ కేబినెట్లో ఛాన్స్‌ ఆ క‌మ్మ నేత‌కా.. ఈ రెడ్డి నేత‌కా ..!

విజ‌య‌సాయి కోసం జ‌గ‌న్ ఆయ‌న్ను బ‌లి చేస్తున్నారా ?

అక్కడ జనసేనకు బలం ఉంది...కానీ పవన్ లైట్ తీసుకున్నారా?

బుద్దా అలా...నాని ఇలా.. బెజవాడలో సైకిల్ సెట్ అయినట్లేనా...

వారసుడుని లైన్‌లోకి తీసుకోస్తున్న మండలి...సక్సెస్ అవుతారా?

ఇలా చేస్తే చర్మం, జుట్టు సమస్యలు దూరం...

అఖిల సైడ్ అయితే... జస్వంతికి ఛాన్స్ వస్తుందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>