MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/corona-effect-on-tollywood9e747fa6-dbdc-40d1-b598-2e8004ae1b28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/corona-effect-on-tollywood9e747fa6-dbdc-40d1-b598-2e8004ae1b28-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా నష్టపోయిన పరిశ్రమల్లో సినీ పరిశ్రమకు వాటా కూడా భారీగానే ఉంది. గత ఏడాది నుండి దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని సినీ పరిశ్రమలపై ఈ మహమ్మారి ప్రభావం పడింది. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు క్లోజ్ అవ్వడం, షూటింగ్స్ ఆగిపోవడం, విడుదల అవ్వాల్సిన చిత్రాలు వాయిదా పడడం లాంటి కారణాలతో మూవీ ఇండస్ట్రీ తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. CORONA EFFECT ON TOLLYWOOD{#}2020;January;Anandam;Industry;Film Industry;Industries;bollywood;Telugu;Tollywood;Coronavirus;Telangana;Cinema;Andhra Pradeshకరోనా కారణంగా భారీగా నష్టపోయిన టాలీవుడ్ ?కరోనా కారణంగా భారీగా నష్టపోయిన టాలీవుడ్ ?CORONA EFFECT ON TOLLYWOOD{#}2020;January;Anandam;Industry;Film Industry;Industries;bollywood;Telugu;Tollywood;Coronavirus;Telangana;Cinema;Andhra PradeshSun, 20 Jun 2021 15:00:00 GMTకరోనా కారణంగా నష్టపోయిన పరిశ్రమల్లో సినీ పరిశ్రమకు వాటా కూడా భారీగానే ఉంది. గత ఏడాది నుండి దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని సినీ పరిశ్రమలపై ఈ మహమ్మారి ప్రభావం పడింది. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు క్లోజ్ అవ్వడం, షూటింగ్స్ ఆగిపోవడం, విడుదల అవ్వాల్సిన చిత్రాలు వాయిదా పడడం లాంటి కారణాలతో మూవీ ఇండస్ట్రీ తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. టాలీవుడ్ సినీ పరిశ్రమ సైతం ఇవే కష్టాలను ఎదుర్కోక తప్పలేదు. సినీ కార్మికుల దగ్గర నుండి బడా నిర్మాతల వరకు ఏదో విధంగా కరోనా వలన నష్టపోయిన వారే. 88 ఏళ్ల సినీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గత రెండేళ్ల నుండి సినీ పరిశ్రమ ఇటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.

కొందరు సినీ ప్రముఖులు సైతం ఈ వైరస్ బారినపడి తమ ప్రాణాలు కూడా కోల్పోవడం మరింత బాధాకరం. మరోవైపు ఇండస్ట్రీ ఏటా అందే ఆదాయం అందక పోగా నష్టాల ఊబిలో కూరుకు పోయింది. టాలీవుడ్‌లో ఏడాదికి సుమారు 200కు పైగా సినిమాలు రిలీజ్ అవుతూ సందడి చేస్తాయి. ప్రేక్షకులకు ఓ వైపు వినోదాన్ని పంచుతూనే ఆర్థికంగా పుంజుకుంటాయి. ముఖ్యంగా సమ్మర్ సీజన్ అయితే భారీ వసూళ్లకు పెట్టింది పేరు. కానీ రెండేళ్ల నుండి ఈ వైరస్ వలన పరిస్థితులు తారుమారై సినిమాలు ఆగిపోవడంతో నిర్మాతలు సైతం భారీగా నష్టపోయారు. మధ్యలో ఈ ఏడాది జనవరి నెలలో కాస్త వైరస్ వ్యాప్తి తగ్గడంతో మళ్లీ షూటింగ్ లకు, సినిమాల రిలీజ్ కు పర్మిషన్ ఇచ్చింది కేంద్రం. ఈ గ్యాప్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్రాలు రిలీజ్ అవగా,  మరికొన్ని సినిమాలు తిరిగి చిత్రీకరణలో బిజీ అయ్యాయి.

దాంతో  పరిశ్రమ పూర్వవైభవం పుంజుకోవడానికి ప్రయత్నించింది.  ఈ లోపే మళ్లీ సెకండ్ వేవ్  మొదలై ఆ ఆనందం ఎక్కువసేపు ఉండనివ్వలేదు, తిరిగి లాక్ డౌన్ తో ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఈ లెక్కన గత రెండేళ్ల నుండి తెలుగు చలన చిత్ర పరిశ్రమ  750 కోట్లు వరకు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు. 2020 సంవత్సరంలో 500 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 250 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతున్నాయి.  కరోనా ఉధృతి గణనీయంగా తగ్గుతుండటంతో తిరిగి  పరిశ్రమలకు తమ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించేందుకు ఒక్కొక్కటిగా పర్మిషన్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో థియేటర్లు కూడా ఓపెన్ చేయొచ్చు అని, ఆగిపోయిన షూటింగ్లు పునఃప్రారంభించ వచ్చని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఏపీ రాష్ట్రం కూడా ఈ దిశగా త్వరలో నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. అయితే రిలీజ్ కు రెడీ గా పలు క్రేజి ప్రాజెక్టులు ఒక్కొటిగా విడుదలై ఇప్పటి వరకు వచ్చిన నష్టాన్ని తమ విజయాలతో పూడుస్తాయెమో చూడాలి.


పాపం హిందీ సినిమాల్లో బాలయ్య అందుకే నటించలేదా.. ?

బోల్డ్ రోల్‌లో వ‌రుణ్ సందేశ్ సెట్ అవుతాడా..?

దళపతి విజయ్ పుట్టినరోజున అదిరిపోయే అప్‌డేట్..?

హుజూరాబాద్‌పై కేసీఆర్‌కు టెన్ష‌న్ .. ఇంటిలిజెన్స్ రిపోర్ట్ తేడా కొట్టేసిందా ?

కేసీఆర్ పర్యటన.. సొంత ఇలాకాలో ప్రారంభోత్సవాలు?

నితిన్ మాస్ట్రో కూడా ఓటిటి కేనా ?

సార్ నిర్ణ‌యం పై సార్లు ఆందోళ‌న‌.. !

ఒక్క హిట్ కోసం భారీ కసరత్తులు చేస్తున్న స్టార్ హీరోలు..

బాగా నవ్విస్తాడు.. నేర్పిస్తాడు.. కమల్‌పై శృతి పోస్ట్ వైరల్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>