LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/potato-halwad2ba83fd-430c-4cf0-8660-d49b7b3553dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/potato-halwad2ba83fd-430c-4cf0-8660-d49b7b3553dd-415x250-IndiaHerald.jpgహల్వా అంటే అందరూ ఇష్టపడతారు.. అయితే కూరగాయలతో ఎక్కువగా మనదేశంలో హల్వా చేసుకుంటారు. మరి కొంతమంది పిండి తో చేస్తారు. అయితే ఇప్పుడు బంగాళాదుంపతో అల్వా కూడా చేసుకుంటారట. చాలా రుచిగా ఉంటుందని అంటున్నారు. ఆ హల్వా ఎంత రుచిగా ఉంటుందో.. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం...potato halwa{#}Ghee;Gas Stoveబంగాళాదుంప హల్వాను ఎప్పుడైనా ఇలా చేశారా ?బంగాళాదుంప హల్వాను ఎప్పుడైనా ఇలా చేశారా ?potato halwa{#}Ghee;Gas StoveSun, 20 Jun 2021 19:00:00 GMTహల్వా అంటే అందరూ ఇష్టపడతారు.. అయితే కూరగాయలతో ఎక్కువగా మనదేశంలో హల్వా చేసుకుంటారు. మరి కొంతమంది పిండి తో చేస్తారు. అయితే ఇప్పుడు బంగాళాదుంపతో అల్వా కూడా చేసుకుంటారట. చాలా రుచిగా ఉంటుందని అంటున్నారు. ఆ హల్వా ఎంత రుచిగా ఉంటుందో.. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం...

కావలసిన పదార్థాలు :

బంగాళాదుంపలు : 4

మైదా పిండి : ఒక కప్పు

చిక్కని పాలు: ఒక కప్పు

నెయ్యి : అర కప్పు

చక్కెర పొడి: ఒకటిన్నర కప్పు,

జీడిపప్పు : కొన్ని

బాదం: 4

కిస్మిస్: 5

యాలకుల పొడి: అర స్పూన్

ఫుడ్ కలర్ : చిటికెడు అప్షనల్

తయారీ విధానం :

బంగాళా దుంప హల్వాను తయారు చేసుకోవడానికి ముందుగా బంగాళదుంపలను బాగా కడిగి వాటిపై ఉన్న తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి.  తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెన్ పెట్టి నెయ్యి వేసి వేడి అయ్యాకా డ్రై ఫ్రూట్స్ అన్నీ దోరగా వేయించుకొని పక్కన పెట్టాలి. అదే పాన్ లో మరో స్పూన్ నెయ్యి వేసి బంగాళాదుంప ముక్కలను వేసి దోరగా వేయించాలి. అందులో పాలు  వేసి బాగా ఉడికించాలి. అప్పుడు మంచి వాసన వస్తుంది. చిన్న మంట మీద మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. అవి ఉడికిన తర్వాత అందులో పంచదార వేసి బాగా కరిగించాలి. ఈ మిశ్రమం మొత్తం కింద అడుగు అంటకుండా బాగా కలుపుకోవాలి. అందులో మైదా కూడా వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. చక్కర మొత్తం కరిగిన తర్వాత ముద్దగా అయ్యేవరకు కలుపుతూ ఉండాలి.. అందులో మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ ను వేసుకోవచ్చు. ఇకపోతే అది బాగా వాసనా వచ్చేవరకు ఉంచాలి. తర్వాత ఆ మిశ్రమంలోకి ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ ను వేసుకొని, నెయ్యి వేసి బాగా కలపాలి. అంతే ఎంతో రుచికరమైన బంగాళా దుంప హల్వా రెడీ.. మిగితా హల్వా తో పోలిస్తే ఈ హల్వా కొత్తగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక ఆలస్యం ఎందుకు మీకు  నచ్చితే మీఋ కూడా ట్రై చెయ్యండి.  





పీతలతో ఇలా ట్రై చేసారా...?

పూరీ- ఈ కర్రీ కొంబో అదుర్స్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>