HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health3c07c0b9-f75f-4c1c-9d9c-68ab33a95ceb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health3c07c0b9-f75f-4c1c-9d9c-68ab33a95ceb-415x250-IndiaHerald.jpgఉప్పులేని వంటకాన్ని మనం అస్సలు ఊహించలేము. మనం చేసే ప్రతి వంటలో ఉప్పు తప్పకుండా ఉండాల్సిందే. లేకపోతే ఆ వంటకి రుచే ఉండదు. అయితే, కొంతమంది మాత్రం చాలా ఎక్కువ ఉప్పును తినేస్తుంటారు. ఇక ఆహారం ఉప్పగా ఉంటేనే ఇష్టపడతారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాల ప్రకారం.. ఉప్పుని ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికే ముప్పేనట. ఉప్పు కనుక మోతాదు కనుక మించితే గుండె జబ్బులు, స్ట్రోక్స్ పెరుగుతాయని WHO తెలిపింది. కాబట్టి ఉప్పు వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఏటా సుమారు 25 లక్షల మంది ప్రాణాలను రక్షించవచ్చని తెలిపింది.అలhealth{#}salt;Sodium;Heart;Manamఉప్పు ఎక్కువ తింటున్నారా..? అయితే ఆరోగ్యానికి ముప్పే...!ఉప్పు ఎక్కువ తింటున్నారా..? అయితే ఆరోగ్యానికి ముప్పే...!health{#}salt;Sodium;Heart;ManamSun, 20 Jun 2021 00:00:00 GMTఉప్పులేని వంటకాన్ని మనం అస్సలు ఊహించలేము. మనం చేసే ప్రతి వంటలో ఉప్పు తప్పకుండా ఉండాల్సిందే. లేకపోతే ఆ వంటకి రుచే ఉండదు. అయితే, కొంతమంది మాత్రం చాలా ఎక్కువ ఉప్పును తినేస్తుంటారు. ఇక ఆహారం ఉప్పగా ఉంటేనే ఇష్టపడతారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాల ప్రకారం.. ఉప్పుని ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికే ముప్పేనట. ఉప్పు కనుక మోతాదు కనుక మించితే గుండె జబ్బులు, స్ట్రోక్స్ పెరుగుతాయని WHO తెలిపింది. కాబట్టి ఉప్పు వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఏటా సుమారు 25 లక్షల మంది ప్రాణాలను రక్షించవచ్చని తెలిపింది.అలాగే శరీరానికి సోడియం అందాల్సిందే. కానీ, రోజూ తీసుకొనే ఉప్పులో మోతాదు కొంచెం ఎక్కువైనా  ప్రమాదమే. అయితే, చాలామందికి రోజుకు ఎంత ఉప్పు తింటే మంచిది? ఎంత ఉప్పు తింటే ప్రమాదకరమనే విషయం తెలియదు. ఇక ఈ నేపథ్యంలో WHO తాజాగా రోజూ ఎంత ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదో వెల్లడించడం జరిగింది.

ఇక WHO సూచనల ప్రకారం ఒక మనిషి రోజుకు 5 గ్రాముల ఉప్పును మాత్రమే తీసుకోవాలి. ఇక అంతకంటే మించితే గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, కిడ్నీ సమస్యలు ఏర్పడటం ఖాయం. ఏటా ఉప్పును అతిగా వాడటం వల్ల కలుగుతున్న గుండె జబ్బులు, స్ట్రోక్స్ వల్ల సంవత్సరానికి సుమారు 30 లక్షల మంది చనిపోతున్నారు.అందుకే ఉప్పు మోతాదుని తగ్గించడం ద్వారా ఏటా సుమారు 25 లక్షల మంది జీవితాలను కాపాడవచ్చని సంస్థ భావిస్తోంది. ఇక 2025 నాటికి ప్రపంచంలో సోడియం సాల్ట్ వాడకాన్ని 30 శాతానికైనా తగ్గించాలనే లక్ష్యం పెట్టుకుంది.ఇక ప్రాసెస్డ్ ఫుడ్‌ను అతిగా తీసుకోవడం వల్లే శరీరంలోకి ఉప్పు అధికంగా చేరుతోందని తెలిపింది. అయితే, దేశాలవారీగా చూసుకున్నట్లయితే ఈ ఆహారంలో ఉప్పు మోతాదుల్లో చాలా తేడాలు ఉన్నాయని తెలిపింది.ఇక ఈ నేపథ్యంలో తాజాగా నిర్దేశించిన పరిమాణంలోనే ఉప్పు వినియోగం ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపడం జరిగింది.వంటలు రుచి తక్కువైనా పర్లేదు కాని ఉప్పు మాత్రం కొంచెం తగ్గించుకొని తింటే మంచిదని తెలిపింది.కాబట్టి ఉప్పు ఎక్కువగా తినేవారు ఖచ్చితంగా జాగ్రత్తగా వాడాలి. లేకుంటే ఆరోగ్యానికి ముప్పే.





కరోనా మహమ్మారి ప్రమాదం పొంచి ఉందన్న ఎయిమ్స్ చీఫ్...

హీరో అల్లు అర్జున్ ఎన్ని కోట్ల కట్నం పుచ్చుకున్నారో తెలుసా.. ?

పాదరక్షల గురించి 3 ఆసక్తికర విషయాలు..!

పెళ్లయ్యాక హ్యాపీ డేస్ అప్పు ఎలా మారిపోయిందో చూడండి

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చిరు... వీడియో వైరల్...!

సమాచార హక్కు చట్టంలో ఏఏ సెక్షన్స్ ఉంటాయో మీకు తెలుసా..!

త్రివిక్రమ్ బాటలోనే కొరటాల శివ కూడా..!!

పూరీ- ఈ కర్రీ కొంబో అదుర్స్..!

మిల్కా సింగ్ మృతి.. బాబు ఏమన్నారంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>