MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-6d552790-732b-4907-a15f-7233a32f80f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-6d552790-732b-4907-a15f-7233a32f80f5-415x250-IndiaHerald.jpgమొదటిది ఎపుడూ ముద్దు. ఫస్ట్ ఎపుడూ తీపి గురుతు. మొదటి విజయం అంటే అది మంచి అనుభవం. ఇక కళాకారులకు విజయం అన్నదే ఊపిరిని ఇస్తుంది. తాము ఎంత కష్టపడినా ఫలితం అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. మరి వారు ఆదరించి ఇచ్చే సక్సెస్ ఎపుడూ ఆర్టిస్టుల మందిలో పదిలంగానే ఉంటుంది. akhil {#}Naga Chaitanyaఫస్ట్ హిట్ కోసం ఎంత కష్టం... ?ఫస్ట్ హిట్ కోసం ఎంత కష్టం... ?akhil {#}Naga ChaitanyaSun, 20 Jun 2021 19:01:40 GMTమొదటిది ఎపుడూ ముద్దు. ఫస్ట్ ఎపుడూ తీపి గురుతు. మొదటి విజయం అంటే అది మంచి అనుభవం. ఇక కళాకారులకు విజయం అన్నదే ఊపిరిని ఇస్తుంది. తాము ఎంత కష్టపడినా ఫలితం అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. మరి వారు ఆదరించి ఇచ్చే సక్సెస్ ఎపుడూ ఆర్టిస్టుల మందిలో పదిలంగానే ఉంటుంది.

ఇదంతా ఎందుకంటే మన టాలీవుడ్ హీరోలు చాలా మందికి తొలి రుచి ఎంతో విలువైనది అని చెప్పడానికి. చాలా మంది హీరోలు అతి పెద్ద బ్యాక్ గ్రౌండ్ తోనే టాలీవుడ్ లో అడుగుపెట్టారు. అయితే వారు వస్తూనే మంచి బ్యానర్, మంచి డైరెక్టర్, మంచి కాస్టింగ్ ఇలా అన్నీ సెట్ చేసుకుని బరిలోకి దిగినా హిట్ మాత్రం పలకరించలేదు. ఆ ఒక్క హిట్ కోసం వారు చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. దీనికి ఎవరూ అతీతులు కాదు.

నందమూరి బాలక్రిష్ణ సోలో హీరోగా ఫస్ట్ చేసిన మూవీ సాహసమే జీవితం ఫ్లాప్ అయింది. అదే వరసలో డిస్కో కింగ్ వంటి సినిమాలు వరసగా  ఫ్లాప్స్  కాగా బాలయ్యకి ఫస్ట్ హిట్ దక్కింది మంగమ్మ గారి మనవడుతోనే. అది ఏకంగా బ్లాక్ బస్టర్ అయింది. ఇక మరో నట వారసుడు అక్కినేని నాగార్జున చేసిన ఫస్ట్ మూవీ విక్రమ్ కూడా పెద్దగా ఆడలేదు. ఆ తరువాత కొన్ని సినిమాల తరువాత నాగార్జునకు సాలిడ్ హిట్  శివ మూవీతో దక్కింది. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. దాంతో తొలి ప్రేమ వరకూ వెయిట్ చేసి మరీ సూపర్ హిట్ అందుకున్నాడు పవన్.

ఇక నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య ఫస్ట్ మూవీ జోష్ పెద్దగా ఆడలేదు. ఆ తరువాత కొంతకాలానికి సమంతతో కలసి నటించిన ఏం మాయ చేసావేతో అద్భుతమైన హిట్ అందుకున్నాడు. ఇక వరుణ్ తేజ్ కి ఫిదా తోనే హిట్ వచ్చింది. రామ్ చరణ్ కి మగ‌ధీర తో బంపర్ హిట్ పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జాబితా ఉంది. ఇక అఖిల్ తొలి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అన్నీ కరెక్ట్ గా ఉంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచి అఖిల్ కి తొలి రుచిని అందిస్తుందని అంతా ఆశిస్తున్నారు.









హిట్ కోసం ఇబ్బంది పడుతున్న ఫాథర్స్...?

కొడుకు చైతన్యతో నాగార్జున అనుబంధం..

కొడుకు చైతన్యతో నాగార్జున అనుబంధం.. పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరీలో చూడండి.

కొడుకుల కెరీర్ ను తీర్చి దిద్దుతూ.. వారిపై ప్రేమను చూపిస్తున్న అసలు సిసలైన తండ్రి..!!

వారం గ్యాప్ లో బరిలోకి దిగనున్న అక్కినేని బ్రదర్స్ .... ??

సాయి పల్లవి తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>