MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/clap-boarda5063d13-4e8b-479c-8c5b-a9291f0fa8c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/clap-boarda5063d13-4e8b-479c-8c5b-a9291f0fa8c2-415x250-IndiaHerald.jpgసినిమా షూటింగ్ అంటే తెలియని వారికి ఎంతో విచిత్రమైన ఘటన సినిమా షూటింగ్. షూటింగ్ చూడాలని అందులో తమ అభిమాన హీరోలు ఎలా నటిస్తున్నారు అనేది చూసి తరించాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కలలుకంటూ ఉంటారు అందుకే ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది అంటే ఎంతో ఆసక్తిగా ఎగబడి మరీ చూస్తూ ఉంటారు జనాలు. అప్పటికే సినిమాల్లో చేసేవారికి ఈ తంతు పెద్దగా ఆసక్తి అనిపించకపోయినా సినిమాల్లోకి వచ్చే వారికి, రావాలనుకునే వారికి, సినిమాలు చూసేవారికి మాత్రం సినిమా షూటింగ్ అనేది ఎంతో గొప్ప విషయం. clap board{#}Audience;Manam;Director;Cinemaషూటింగ్ లో “క్లాప్ బోర్డ్” ఎందుకు కొడతారు.? దాని ప్రాముఖ్యత ఎంత ఉందో తెలుసా.. ?షూటింగ్ లో “క్లాప్ బోర్డ్” ఎందుకు కొడతారు.? దాని ప్రాముఖ్యత ఎంత ఉందో తెలుసా.. ?clap board{#}Audience;Manam;Director;CinemaSun, 20 Jun 2021 18:00:00 GMTసినిమా షూటింగ్ అంటే తెలియని వారికి ఎంతో విచిత్రమైన ఘటన సినిమా షూటింగ్. షూటింగ్ చూడాలని అందులో తమ అభిమాన హీరోలు ఎలా నటిస్తున్నారు అనేది చూసి తరించాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కలలుకంటూ ఉంటారు అందుకే ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది అంటే ఎంతో ఆసక్తిగా ఎగబడి మరీ చూస్తూ ఉంటారు జనాలు. అప్పటికే సినిమాల్లో చేసేవారికి ఈ తంతు పెద్దగా ఆసక్తి అనిపించకపోయినా సినిమాల్లోకి వచ్చే వారికి, రావాలనుకునే వారికి, సినిమాలు చూసేవారికి మాత్రం సినిమా షూటింగ్ అనేది ఎంతో గొప్ప విషయం.

తమ చుట్టుపక్కలలో సినిమా షూటింగ్ అయితే మా ఏరియాలో షూటింగ్ జరిగింది అని కొన్ని రోజుల వరకు చెప్పుకుంటారు. ఇందులో యాక్షన్, కట్  పదాలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.వాటిని కొన్ని సమయాల్లో అనుకరిస్తూ ఉంటాం కూడా.. వీటితో  పాటు వినిపించే మరొక సౌండ్ క్లాప్  సౌండ్. షూటింగ్ లేదా సీన్ మొదలుపెట్టేముందు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి క్లాప్ పట్టుకొని కోట్టడం మనం చూస్తూ ఉంటాం. అయితే అసలు క్లాప్ కొట్టడం ఎందుకో ఎవరికీ ఎక్కువగా తెలియదు.. దీని వల్ల ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా వాళ్లకు మాత్రమే తెలిసే ఈ క్లాప్ బోర్డును ఎందుకు ఉపయోగిస్తారంటే..

క్లాప్ బోర్డును క్లాపర్ బోర్డు అని కూడా అంటారు. ఈ క్లాపర్ బోర్డు ఎప్పటినుంచో ఉంది. సాధారణంగా అప్పట్లో సినిమాలు తీసేటప్పుడు వాడే కెమెరా సౌండ్ రికార్డ్ చేసేది కాదు. షూట్ చేయడానికి కెమెరా, సౌండ్ రికార్డు చేయడానికి ఇంకొక డివైజ్ ను వాడేవారు. ఇప్పటికి కూడా దాదాపు చాలాచోట్ల ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. అలాంటప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో సౌండ్  సింక్ చేయడానికి ఎడిటర్స్ ఇబ్బంది పడతాడు. క్లాప్ పద్ధతి ద్వారా ఎడిటర్ క్లాప్ టైమింగ్స్ ఫాలో అవుతు క్లాప్ కొట్టిన వెంటనే వచ్చే డైలాగ్ రికార్డు చేస్తారు కాబట్టి ఎడిటింగ్ లో సింకింగ్ ఈజీ అవుతుంది. క్లాప్ వాడడానికి ఇంకొక కారణం సెట్లో చాలా మంది ఉంటారు. క్లాప్ కొట్టిన వెంటనే అందరూ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని అర్థం చేసుకుని సైలెంట్ అయిపోతారు.



"మా" ఎలక్షన్స్ లో పోటీ చేయనున్న ప్రకాశ్‌రాజ్‌..!

రూట్ మార్చిన అనుపమ.. సోషల్ మీడియాలో రచ్చ..!

పవన్ ని మోసం చేయనున్న నిధి అగర్వాల్..?

బుడుగు: పిల్లల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలివే..!

రేపటి నుంచి షూటింగ్ ప్రారంభించనున్న రాజమౌళి..?

హిట్ కోసం ఇబ్బంది పడుతున్న ఫాథర్స్...?

సర్కారు కోసం మహేష్ అమెరికా కి ప్రయాణం

ఆడవాళ్ళతో ఒక్క గంట చాలు.. ఆర్జీవి షాకింగ్ ఇంటర్వ్యూ..!

బాలకృష్ణ.. గోపీచంద్.. యంగ్ హీరోయిన్ ఒప్పుకుంటుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>