PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down-unlocked-for-how-many-problems-fased-caronaed1ccb69-f7d5-4913-ad20-0c3d8ce33277-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down-unlocked-for-how-many-problems-fased-caronaed1ccb69-f7d5-4913-ad20-0c3d8ce33277-415x250-IndiaHerald.jpgలాక్డౌన్ ఎత్తివేతతో థర్డ్ వేవ్ ప్రమాదం రాబోతుందా..? సీఎం కేసీఆర్ తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేశారు. ఈ ఎత్తివేత ప్రజలకు మేలు చేస్తుందా..? థర్డ్ వేవ్ కరోనాకు ఆజ్యం పోస్తుందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే రాష్ట్రంలో సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గక ముందే, ఈ లాక్డౌన్ ఎత్తివేత నిర్ణయం ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ మొదలై చిన్నపిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోందని మనం వింటూనే ఉన్నాం. అయితే ఈ థర్డ్ వCarona effect {#}Spyder;central government;Manam;School;Coronavirus;CM;Government;Telanganaలాక్డౌన్ ఎత్తివేతతో థర్డ్ వేవ్ ప్రమాదం రాబోతుందా..?లాక్డౌన్ ఎత్తివేతతో థర్డ్ వేవ్ ప్రమాదం రాబోతుందా..?Carona effect {#}Spyder;central government;Manam;School;Coronavirus;CM;Government;TelanganaSun, 20 Jun 2021 08:40:00 GMTలాక్డౌన్ ఎత్తివేతతో థర్డ్ వేవ్ ప్రమాదం రాబోతుందా..?

 సీఎం కేసీఆర్ తెలంగాణలో లాక్డౌన్  ఎత్తివేశారు.  ఈ ఎత్తివేత  ప్రజలకు మేలు చేస్తుందా..?  థర్డ్ వేవ్ కరోనాకు ఆజ్యం పోస్తుందా అనే అనుమానాలు ప్రజల్లో  వ్యక్తమవుతున్నాయి.  అయితే  రాష్ట్రంలో సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గక ముందే, ఈ లాక్డౌన్ ఎత్తివేత నిర్ణయం ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ మొదలై చిన్నపిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోందని మనం వింటూనే ఉన్నాం. అయితే ఈ థర్డ్ వేవ్ మన  రాష్ట్రానికి రాకముందే  ముందస్తు నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వం సెకండ్ వేవ్  తగ్గక ముందే లాక్డౌన్ ఎత్తివేత  ఎలాంటి ప్రమాదాలకు  దారితీస్తుందో అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 అయితే దీనిపై చాలా రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం,  వైద్య నిపుణులు మూడో దశ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని,  ఒకవేళ వస్తే దాన్ని ఎదుర్కోవడానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది.  ఈలోగా వ్యాక్సిన్ అందరికీ వేసి థర్డ్ వేవ్ కరోనాను  తరిమికొట్టాలని కేంద్ర ప్రభుత్వం  రాష్ట్రాలకు సూచిస్తోంది. కానీ తెలంగాణ ప్రభుత్వంలో  సూపర్ స్పైడర్ పేరుతో కొంతమందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు. రాష్ట్రంలో కనీసం పది శాతం కూడా వ్యాక్సినేషన్ పక్రియ పూర్తి చేయకుండా పూర్తి లాక్డౌన్ తీసేస్తే మళ్లీ జనాలు రోడ్లపైకి వచ్చి ఎలాంటి ప్రమాదాలకు వారదులుగా మారతారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.  అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం జులై ఒకటో తారీకు నుండి పాఠశాలలు,  కాలేజీలు తెరవడం మూడో దశకు దారి చూపినట్లు అవుతుందని పలువురు సీనియర్ వైద్యులు అంటున్నారు.  రెండో దశ ప్రారంభానికి ముందు ఇలాగే స్కూల్స్,  కాలేజీలు ప్రారంభించి,  ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రచారం చేశారు.

 దీంతో కనీసం పది రోజులైనా కాకముందే పాఠశాల పిల్లలకు రెండో దశ కరోణ రావడంతో తిరిగి  పాఠశాలను మూసివేశారు. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయం  తీసుకోవడం మంచిది కాదని పలువురు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముందుగా రాష్ట్రంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసి, కరోనా  నుండి కాపాడాలని  అంటున్నారు .  ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి,  లాక్డౌన్ ఎత్తివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని,  మూడో దశ కరోనా  నుంచి ప్రజలను కాపాడాలని వైద్యులు చెబుతున్నారు.  దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని  వేచి చూడాల్సిన సమయం ఆసన్నమైంది.



సూర్యభగవానుడి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా ?

మెట్రో ప్ర‌యాణీకులకు అల‌ర్ట్.. !

ఫాదర్స్ డే స్పెషల్ : నినదించు హృదయరవళి!

ఆ విషయంలో తండ్రి పేరును నిలబెట్టిన మహేష్ బాబు..

ఏపీలో సీన్ రివ‌ర్స్‌... చంద్ర‌బాబుతో వైసీపీ నేత భేటీ ?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు..!

మోది పాచిక ఫెయిలైంది.. యోగి పంతం నెగ్గింది.

ఉప్పు ఎక్కువ తింటున్నారా..? అయితే ఆరోగ్యానికి ముప్పే...!

భలే.. ఇక స్మార్ట్‌ఫోన్‌తోనే కరోనా నిర్థరణ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>