MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sai-pallavia0d9cf0e-c0dd-4f8c-b236-1ee31fc3e8f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sai-pallavia0d9cf0e-c0dd-4f8c-b236-1ee31fc3e8f1-415x250-IndiaHerald.jpgఫిదా బ్యూటీ సాయి పల్లవి తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ ల తో సమానంగా గుర్తింపు తెచ్చుకుంది. కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోలు డేట్స్ కోసం ఈ అమ్మడి వెంట పడుతున్నారు. కానీ సాయి పల్లవి మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తూ ముందుకు వెళుతుంది. స్టార్ హీరోల నుండి సినిమా ఆఫర్ వచ్చినా పాత్రకి ప్రాధాన్యత లేకపోతే సున్నితంగా పక్కన పెట్టేస్తోంది. పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాల్లోనే నటిస్తూ అలరిస్తోంది. ఇక సాయి పల్లవి మలయాళ సినిమా ప్రేమతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాకు దేశ‌వ్యాప్తంగా గుర్sai pallavi{#}BEAUTY;Virata Parvam 1992;Sai Pallavi;sekhar;dhanush;Love Story;Fidaa;Love;Heroine;India;Cinemaసాయిప‌ల్లవికి శేఖ‌ర్ క‌మ్ముల బంపరాఫ‌ర్.. !సాయిప‌ల్లవికి శేఖ‌ర్ క‌మ్ముల బంపరాఫ‌ర్.. !sai pallavi{#}BEAUTY;Virata Parvam 1992;Sai Pallavi;sekhar;dhanush;Love Story;Fidaa;Love;Heroine;India;CinemaSun, 20 Jun 2021 12:11:09 GMTఫిదా బ్యూటీ సాయి పల్లవి తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ ల తో సమానంగా గుర్తింపు తెచ్చుకుంది. కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోలు డేట్స్ కోసం ఈ అమ్మడి వెంట పడుతున్నారు. కానీ సాయి పల్లవి మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తూ ముందుకు వెళుతుంది. స్టార్ హీరోల నుండి సినిమా ఆఫర్ వచ్చినా పాత్రకి ప్రాధాన్యత లేకపోతే సున్నితంగా పక్కన పెట్టేస్తోంది. పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాల్లోనే నటిస్తూ అలరిస్తోంది. ఇక సాయి పల్లవి మలయాళ సినిమా ప్రేమతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాకు దేశ‌వ్యాప్తంగా గుర్తింపు రావ‌డంతో ఫ‌స్ట్ సినిమాతోనే ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. 


ఇక‌ తెలుగులో ఫిదా సినిమా తో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడం తో వరుస అవకాశలతో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ చేతినిండా సంపాదిస్తోంది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన సాయిప‌ల్లవి  ప్రస్తుతం ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన లవ్ స్టోరీ సినిమాలోనూ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుద‌లకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా శేఖర్ కమ్ముల ధనుష్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలోనూ సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించబోతుంద‌ట‌.
 

మరోసారి శేఖర్ కమ్ముల సాయి పల్లవి వైపే మొగ్గు చూపుతున్నారట.ఈ విష‌య‌మై ఇప్పటికే క‌మ్ముల‌ సాయి పల్లవి ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ధనుష్ కు జోడిగా సాయి పల్లవి నటించనుంది. మరోవైపు సాయి పల్లవి ధనుష్ ప‌క్క‌న‌ మారి 2 సినిమాలో నటించి అలరించింది. ఇక సాయి పల్లవి ఓకే చెబితే ధనుష్ తో ఇది రెండో సినిమా అవుతుంది. కాగా కమ్ముల దర్శకత్వంలో ఇది సినిమా అవుతుంది. మరి ఈ కాంబినేషన్ చివరికి ఫిక్స్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఇక ఇప్పటికే సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ, విరాట పర్వం సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధిస్తే సాయి పల్లవి క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.




రామ్ ను హీరోగా నిలబెట్టిన "రెడీ"...

ఉద్ధవ్ థాకరే 'కడుపు నొప్పి' కామెంట్స్.. వెనుక అంత కధ ఉందా?

ఈ సినిమా ను భలే వదిలించుకున్నారే..!!

కొడుకుల కెరీర్ ను తీర్చి దిద్దుతూ.. వారిపై ప్రేమను చూపిస్తున్న అసలు సిసలైన తండ్రి..!!

నెట్టింట్లో వైరల్ గా మారిన పవన్ 90'S ఫోటో..

పీతలతో ఇలా ట్రై చేసారా...?

తండ్రి - కూతురి బంధాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన చిత్రం..!

డ్ర‌గ్స్ మ‌త్తులో టాలీవుడ్ స్టార్ హీరో కూతురు ?

పట్టు వదలని చిరంజీవి... జగన్ ఫైనల్ చేసినట్టే...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>