PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccin-f6626e2c-95ed-4ce8-a9cf-c9427e34cfef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccin-f6626e2c-95ed-4ce8-a9cf-c9427e34cfef-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ కారణంగా చాలా మంది జీవనోపాధి కోల్పోయిన ఘటనలను చూస్తూనే ఉన్నాము. ఈ మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే.Vaccin {#}District;Coronavirusవ్యాక్సిన్‌ వేయించుకున్నారా.. ఆఫర్లు మాములుగా లేవుగా..!వ్యాక్సిన్‌ వేయించుకున్నారా.. ఆఫర్లు మాములుగా లేవుగా..!Vaccin {#}District;CoronavirusSun, 20 Jun 2021 19:45:00 GMTదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ కారణంగా చాలా మంది జీవనోపాధి కోల్పోయిన ఘటనలను చూస్తూనే ఉన్నాము. ఈ మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. చాలా మంది ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడం వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని భయపడి వ్యాక్సిన్ వేయించుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు వ్యాపారస్తులు బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక దేశంలో 24 పట్టణాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అయితే 'టీకా మహోత్సవ్‌' పేరుతో కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ చేయడంతో మిగిలిన పట్టణాల కంటే గురుగ్రామ్‌ తొలిస్థానంలో ఉందని జిల్లా సివిల్‌ సర్జన్‌ వీరేంద్ర యాదవ్‌ వెల్లడించారు.

అంతేకాదు.. వ్యాక్సిన్‌ వేయడం, కరోనా నిబంధనలు పాటించడం వల్లే సాధ్యమైందని అన్నారు. ఇక అందుకు గురుగ్రామ్‌ ఆరోగ్యశాఖ అధికారులు కృషి చేశారని ప్రశంసల జల్లు కురిపించారు. ఇక ప్రస్తుతం గురుగ్రామ్‌ లో కరోనా డ్రైవ్‌ కొనసాగుతుండగా.. సోమవారం( జూన్‌ 21) గురుగ్రామ్‌ జిల్లాలో 30 వేల మందికి మాస్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ను నిర్వహించినట్లు తెలిపారు.

ఇక ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను ఎంకరేజ్‌ చేసేందుకు పలు మాల్స్‌, పబ్‌లు, రెస్టారెంట్లు కష్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి అందరికి తెల్సిందే. అయితే వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను సపోర్ట్‌ చేస్తూనే.. క‍్యాష్‌ చేసుకునే పనిలో పడ్డారని అన్నారు. ఇక సింగిల్‌ టీకా వేయించుకున్న వారికి 25 శాతం డిస్కౌంట్‌, రెండు టీకాలు వేయించుకున్న వారికి 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నాయని అన్నారు.

అంతేకాక.. ఈ ఆఫర్‌ పై ఓ పబ్‌ డైరెక్టర్‌ 'వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ను ప్రోత్సహించినట్లు తెలిపారు. ఇక ఇలా బిజినెస్‌ చేసుకోవచ్చని తెలియజేశారు. అయితే మరోవైపు ఫ్రంట్‌ లైన్‌ హెల్త్‌ వర్కర్ల కృషికి అభినందనలు తెలుపుతూ అంబిఎంచె మాల్ యాజమాన్యం స్పెషల్‌ డిస్కౌంట్స్‌ ప్రకటించినట్లు తెలిపారు. అంతేకాదు.. ఐడీ కార్డ్‌ ఉంటే ఫ్రీ కార్‌ పార్కింగ్‌ సర్వీస్‌ తో పాటు స్పెషల్‌ డిస్కౌంట్‌ అందిస్తున్నామని మాల్‌ ప్రతినిధి గీతా తెలిపారు.



జేసీ ఇంత‌లోనే ఎంత ప‌ని చేశావ‌య్యా ?

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ..

రేపటి నుంచి షూటింగ్ ప్రారంభించనున్న రాజమౌళి..?

సర్కారు కోసం మహేష్ అమెరికా కి ప్రయాణం

ఏ కుక్క మొరిగినా బంగారు తెలంగాణ త‌ధ్యం : కేసీఆర్

జగన్ మావయ్య ఎఫెక్ట్ 15 నిముషాల్లో సర్టిఫికేట్ !

పాట ఉన్నంతకాలం ఎస్పీ బాలు ఉంటారు..

ఏపీ : ఆ జిల్లా మిన‌హా అన్ని జిల్లాల్లో లాక్ డౌన్ సడ‌లింపు.. !

వాగడం తప్ప లోకేష్ ను ఏమీ పీకలేరట!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>