PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr5a7fb90e-ea8b-4911-b08d-c3f26e0168b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr5a7fb90e-ea8b-4911-b08d-c3f26e0168b3-415x250-IndiaHerald.jpgఇప్ప‌టికే ప‌ది పేర్లను టీఆర్ఎస్ ప‌రిశీలిస్తున్నా ఎవ్వ‌రూ కూడా ఈట‌లు స‌రైన అభ్య‌ర్థి కాద‌ని గులాబీ పార్టీ వాళ్లే భావిస్తున్నారు. చివ‌ర‌కు ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న ఇనుగాల పెద్దిరెడ్డి, చివ‌ర‌కు టీ టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న ఎల్ .ర‌మ‌ణ‌, హుజారాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ గా ఉన్న పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌మీ ప బంధువు పాడి కౌశిక్ రెడ్డి ఇలా చాలా పేర్లు ప‌రిశీలించి చివ‌ర‌కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ముద్ద‌సాని పురుషోత్తం రెడ్డి ని కూడా అడిగిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న సోద‌రుడు ముద్ద‌సాని దామోదkcr{#}KCR;Kumaar;kaushik;Telangana Rashtra Samithi TRS;Congress;రాజీనామా;Reddy;MLA;TDP;Bharatiya Janata Party;Partyకేసీఆర్ ఆ ఎమ్మెల్యేను బ‌లి చేస్తారా ?కేసీఆర్ ఆ ఎమ్మెల్యేను బ‌లి చేస్తారా ?kcr{#}KCR;Kumaar;kaushik;Telangana Rashtra Samithi TRS;Congress;రాజీనామా;Reddy;MLA;TDP;Bharatiya Janata Party;PartySun, 20 Jun 2021 07:47:02 GMTతెలంగాణ‌లో ఇప్పుడు అంద‌రి దృష్టి హుజూరాబాద్ మీదే ఉంది. నిన్న‌టి వ‌ర‌కు కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్ ఇప్పుడు బీజేపీ లో కీల‌క నేత అయిపోయారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా ఈట‌ల కేసీఆర్ కు రైట్ హ్యాండ్ గానే ఉంటూ వ‌స్తున్నారు. అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఈట‌ల‌ను కేసీఆర్ మంత్రి వ‌ర్గం నుంచి భ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డంతో పాటు ఆయ‌న‌కు ప్ర‌యార్టీ లేకుండా చేయ‌డంతో చివ‌ర‌కు ఈట‌ల పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేసేశారు. ఆ వెంట‌నే ఆయ‌న ఆల‌స్యం చేయ‌కుండా బీజేపీలోకి జంప్ చేసేశారు. ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉంది. ఇప్పుడు హుజూరాబాద్ లో ఈట‌ల‌పై టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు స‌రైన అభ్య‌ర్థులే దొర‌క‌ని ప‌రిస్థితి.

ఇప్ప‌టికే ప‌ది పేర్లను టీఆర్ఎస్ ప‌రిశీలిస్తున్నా ఎవ్వ‌రూ కూడా ఈట‌లు స‌రైన అభ్య‌ర్థి కాద‌ని గులాబీ పార్టీ వాళ్లే భావిస్తున్నారు. చివ‌ర‌కు ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న ఇనుగాల పెద్దిరెడ్డి, చివ‌ర‌కు టీ టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న ఎల్ .ర‌మ‌ణ‌, హుజారాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ గా ఉన్న పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌మీ ప బంధువు పాడి కౌశిక్ రెడ్డి ఇలా చాలా పేర్లు ప‌రిశీలించి చివ‌ర‌కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ముద్ద‌సాని పురుషోత్తం రెడ్డి ని కూడా అడిగిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న సోద‌రుడు ముద్ద‌సాని దామోద‌ర్ రెడ్డి క‌మ‌లాపూర్ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచారు.

ఇక ఇప్పుడు మ‌రో పేరు తెర‌మీద‌కు వ‌స్తోంది. తాజా ఎన్నిక‌ల్లో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్ర‌వీణ్ రెడ్డి పేరు కూడా ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌వీణ్‌ను ఇక్క‌డ నుంచి పోటీ చేయించి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు హుస్నాబాద్ సీటు ఇస్తామ‌న్న హామీలు కూడా ఇస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం హుస్నాబాద్ ఎమ్మెల్యే గా ఉన్న స‌తీష్ బాబుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో హుజూరాబాద్ సీటు ఇస్తార‌ని అంటున్నారు. అదే జ‌రిగితే రెండు సార్లు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన స‌తీష్‌.. హుజూరాబాద్‌కు వ‌స్తే ఇక్క‌డ ఈట‌ల‌ను ఎదుర్కోవ‌డం క‌ష్టం.. అప్పుడు స‌తీష్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు బ‌ల‌వుతుంది. ఈ నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.

 



లోకేష్ మంగ‌ళ‌గిరిని వ‌దిలేశాడు... ఈ సారి అక్క‌డ నుంచే పోటీ ?

రజనీకాంత్ అమెరికా ప్రయాణం పై మొదలైన మీడియా హడావిడి !

ఏపీలో సీన్ రివ‌ర్స్‌... చంద్ర‌బాబుతో వైసీపీ నేత భేటీ ?

హుజూరాబాద్ టీఆర్ఎస్ బ‌రిలో ప్ర‌వీణ్ రెడ్డి ?

మోది పాచిక ఫెయిలైంది.. యోగి పంతం నెగ్గింది.

ధాన్యం కాపాడుకునేందుకు మాజీ ఎంపీ ఐడియా సూపర్..?

లోకేష్ లో ఆ బెంగ ... ?

ప్ర‌ముఖ బాక్స‌ర్ నిఖాత్‌ను అభినందించిన ఎమ్మెల్సీ క‌విత‌

హీరో అల్లు అర్జున్ ఎన్ని కోట్ల కట్నం పుచ్చుకున్నారో తెలుసా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>