PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgఈ ఇద్ద‌రు నేత‌లు గ‌తంలో కాంగ్రెస్‌లో ఉండేవారు. ఆ త‌ర్వాత బాలినేని ముందుగా వైసీపీలోకి వెళ్లారు. మాగుంట టీడీపీలోకి వెళ్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. చివ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు మాగుంట వైసీపీలోకి వ‌చ్చి ఎంపీగా పోటీ చేశారు. ఈ ఇద్ద‌రు నేత‌లు 2019 ఎన్నికల్లో చెట్టపట్టాలేసుకుని తిరిగారు. పైగా బాలినేని సీఎం జ‌గ‌న్‌కు ద‌గ్గ‌రి బంధువు. ప్ర‌కాశం జిల్లా పార్టీ బాధ్య‌త‌లు అన్ని జ‌గ‌న్ బాలినేనికే అప్ప‌గించారు. జ‌గ‌న్ బాలినేనిని వాసు మామా అని ఎంతో ముద్దుగా పిలుస్తుంటారు. jagan mohan reddy ysrcp{#}srinivas;Loksabha;YCP;Minister;MP;District;Hanu Raghavapudi;CMజ‌గ‌న్ మామ‌పై కాలు దువ్వుతోన్న వైసీపీ ఎంపీ ?జ‌గ‌న్ మామ‌పై కాలు దువ్వుతోన్న వైసీపీ ఎంపీ ?jagan mohan reddy ysrcp{#}srinivas;Loksabha;YCP;Minister;MP;District;Hanu Raghavapudi;CMSat, 19 Jun 2021 10:06:00 GMTఏపీ సీఎం జ‌గ‌న్ ముద్దుగా వాసు మామా అని పిలుచుకునే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై ఓ వైసీపీ ఎంపీ కాలు దువ్వుతున్నారు. స‌ద‌రు మంత్రి వ‌ర్సెస్ ఎంపీ మ‌ధ్య జ‌రుగుతోన్న కోల్డ్‌వార్‌లో త‌ప్పు ఎవ‌రిది అన్న‌ది కాసేపు ప‌క్క‌న పెట్టేస్తే సుధీర్ఘ రాజ‌కీయ అనుభ‌వంలో ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న స‌ద‌రు ఎంపీ సైతం మంత్రితో ఢీ అంటే ఢీ అనే విష‌యంలో ఎంత‌కు వెన‌క్కు త‌గ్గ‌క‌పోవ‌డ‌మే ఇక్క‌డ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం. ఆ ఇద్ద‌రు నేత‌లు ఎవ‌రో కాదు. ప్ర‌కాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి.. ఈ ఇద్ద‌రి మధ్య అస్సలు పొసగడం లేదు.

ఈ ఇద్ద‌రు నేత‌లు గ‌తంలో కాంగ్రెస్‌లో ఉండేవారు. ఆ త‌ర్వాత బాలినేని ముందుగా వైసీపీలోకి వెళ్లారు. మాగుంట టీడీపీలోకి వెళ్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. చివ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు మాగుంట వైసీపీలోకి వ‌చ్చి ఎంపీగా పోటీ చేశారు. ఈ ఇద్ద‌రు నేత‌లు 2019 ఎన్నికల్లో చెట్టపట్టాలేసుకుని తిరిగారు. పైగా బాలినేని సీఎం జ‌గ‌న్‌కు ద‌గ్గ‌రి బంధువు. ప్ర‌కాశం జిల్లా పార్టీ బాధ్య‌త‌లు అన్ని జ‌గ‌న్ బాలినేనికే అప్ప‌గించారు. జ‌గ‌న్ బాలినేనిని వాసు మామా అని ఎంతో ముద్దుగా పిలుస్తుంటారు.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీలో చేరిన మాగుంట ఒంగోలు లోక్‌సభ సభ్యుడిగా రెండున్నర లక్షల మెజారిటీతో గెలిచారు. మాగుంట వైసీపీలోకి రావడం వెనక బాలినేని ఉన్నారని టాక్ ?  ఈ ఇద్ద‌రు నేత‌లే కాదు బాలినేని కుమారుడు ప్రణీత్‌రెడ్డి, మాగుంట కుమారుడు రాఘవరెడ్డి సైతం ఎంతో స్నేహంగా ఉండేవారు. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్ద‌రు నేత‌ల‌తో పాటు వారి వార‌సుల మ‌ధ్య సైతం ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంద‌ట‌. ఇటీవ‌ల క‌రోనా మందు పంపిణీ విష‌యంలో ఒకే రోజు ఇద్ద‌రూ వేర్వేరుగా పోటాపోటీ శిబిరాలు ఏర్పాటు చేసి మ‌రీ పంపిణీ చేశారు. ఏదేమైనా ప్ర‌కాశం వైసీపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్ ?

 



ఆర్నబ్ దమ్ముంటే రాహుల్ ని ఇప్పుడు పిలువ్ డిబేట్ కి?

తెలంగాణలో ఢిల్లీ తరహా అన్ లాక్?

మిల్కా సింగ్ మృతి.. బాబు ఏమన్నారంటే ?

చైనా బలగాలు పడవల్లో.. ఇది నిజమా? గ్రాఫిక్సా?

అంతులేని కథ: అమరావతి ఉద్యమానికి 550 రోజులు..!

బీజేపీలో అంతర్గత పోరు..!మరీ ఆపేదెవరు..?

వైరల్ వీడియో : ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన విద్యుత్ శాఖ మంత్రి?

సారూ మాకు విముక్తి లేదా...? ఆ జిల్లాలకు మళ్ళీ లాక్ డౌన్...?

గుండె గుభేలే: కరోనా మరణాల లెక్క తేల్చిన రాయిటర్స్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>