వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో వచ్చిన ఘోర ఓటమి నుంచి పార్టీని బయటపడేసేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. అయితే జగన్ బలంగా ఉండటం వల్ల ఎన్నికలై రెండేళ్ళు అయిన ఏపీలో టీడీపీ బలపడలేదు. ఇక రానున్న మూడేళ్ళలో మరింత బలపడి జగన్‌కు చెక్ పెట్టాలని బాబు చూస్తున్నారు.
అయితే జగన్‌కు చెక్ పెట్టడం బాబు ఒక్కడి వల్లే కాదని అర్ధమవుతుంది. అందుకే చంద్రబాబుకు మళ్ళీ దగ్గర జరిగే ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ సపోర్ట్ ఉంటే జగన్‌ని ఎదురుకోవచ్చని బాబు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పవన్ సపోర్ట్ ఇవ్వడం వల్లే టీడీపీ ఎక్కువ సీట్లు దక్కించుకుంది. అలాగే అధికారం దక్కించుకుంది. కానీ 2019 ఎన్నికల్లో పవన్ విడిగా పోటీ చేయడం వల్ల, టీడీపీకి డ్యామేజ్ జరిగింది.
జనసేన మెజారిటీ స్థానాల్లో ఓట్లు చీల్చేయడం వల్ల టీడీపీకి నష్టం జరిగింది. అదే వైసీపీకి ప్లస్ అయింది. ఇక టీడీపీకి కీలకంగా ఉన్న కృష్ణా జిల్లాలో సైతం టీడీపీ మీద జనసేన ప్రభావం పడింది. ఈ జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 స్థానాల్లో సగంపైనే స్థానాల్లో జనసేన ఓట్లు చీల్చి టీడీపీకి డ్యామేజ్ చేసింది. అంటే పలు నియోజకవర్గాల్లో టీడీపీ మీద వైసీపీకి వచ్చిన మెజారిటీ కంటే జనసేనకు పడిన ఓట్లే ఎక్కువ.
ఉదాహరణకు పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైసీపీకి వచ్చిన మెజారిటీ 5 వేలు వరకు ఉంది. కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేనకు 15 వేల ఓట్లు పైనే పడ్డాయి. అలాగే అవనిగడ్డ, కైకలూరు, విజయవాడ సెంట్రల్, వెస్ట్, పెనమలూరు లాంటి నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు కంటే వైసీపీకి వచ్చిన మెజారిటీలు తక్కువే. అందుకే ఈ జిల్లాలో పవనే టీడీపీకి మైనస్ అయ్యారు. ఆ ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేసి ఉంటే సగం సీట్లు అయిన గెలుచుకునేవారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్ధతు తీసుకుంటేనే వైసీపీని ఎదురుకోగలమని కృష్ణా తమ్ముళ్ళు భావిస్తున్నారు.
గౌరు చరితా లైన్‌లోకి వచ్చినట్లేనా!
ఫైర్‌బ్రాండ్‌గా లోకేష్...పార్టీకి మైలేజ్ వస్తుందా?
బాబు వర్సెస్ జగన్: హోదా అందుకే రావడం లేదా?
ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు..
అనుకి చివరగా ఆ రెండు ఛాన్సులు..!
గౌరు చరితారెడ్డి....ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకురాలు. దివంగత వైఎస్సార్‌కు అంత్యంత సన్నిహితంగా మెలిగిన నాయకురాలు. వైఎస్సార్, చరితాని సోదరిగా భావించి 2004లో నందికొట్కూరు కాంగ్రెస్ టిక్కెట్ కూడా ఇచ్చారు. ఇక వైఎస్సార్ వేవ్‌లో చరితా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక వైఎస్సార్ మరణం తర్వాత చరితా జగన్ వెంట నడిచారు. జగన్‌కు అండగా ఉంటూ వైసీపీలో బలమైన నాయకురాలుగా ఎదిగారు.
రాష్ట్రం విడిపోయాక ఏపీ పరిస్తితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అయితే విభజన ద్వారా నష్టపోయిన ఏపీని హోదా ఇచ్చి ఆదుకుంటామని అప్పటి కేంద్రంలో అధికారంలో యూపీఏ ప్రభుత్వం చెప్పింది. అలాగే విభజనకు సంబంధించి పలు హామీలు ఇచ్చింది. ఇక అప్పుడు దీనికి బీజేపీ కూడా అంగీకరించింది. పైగా హోదా ఐదేళ్లు కాదు పదేళ్ళు కావాలని బీజేపీ పట్టుబట్టి సాధించింది. అలా ఏపీ కోసం నిలబడిన బీజేపీ, 2014లో అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెద్ద సాయం చేయలేదు.
బీజేపీకి బాబు బంపర్ ఆఫర్... ?
వైఎస్సార్ అంటేనే దైవంతో సమానంగా కొలిచే వారు రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉన్నారు.. వైఎస్సార్ మీద ఎంత ప్రేమ అంటే ఆయన మూడు దశాబ్దాల పాటు అధికారానికి దూరంగా ఉన్నా కూడా ఆయన వెన్నంటే ఉండి కష్టానికి నష్టానికి ఓర్చిన వారు ఎందోరో తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తారు. వారికి వైఎస్సార్ అంటే అంత ప్రేమ.
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>