MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tholi-prema3fb4818e-5789-4669-9ea2-eebd4cf949ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tholi-prema3fb4818e-5789-4669-9ea2-eebd4cf949ff-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించిన సినిమా తొలిప్రేమ. జివిజి రాజు నిర్మాతగా కరుణాకరన్ తొలిసారిగా మెగాఫోన్ పట్టిన ఈ సినిమా 1998లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద విజయాన్ని అందుకుంది. ఇందులో బాలు పాత్రలో పవన్ నటించగా స్వప్న పాత్రలో కీర్తి కనిపిస్తారు. తమ అంతస్తులు వేరైనప్పటికీ కూడా మంచి మనసు, వ్యక్తిత్వం గల బాలుని ఇష్టపడే స్వప్న చివర్లో దేశం విడిచి పైచదువులు కోసం విదేశాలకు వెళ్లే సమయంలో బాలుకి తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. tollywood-best-love-stories{#}karunakaran;keerthi reddy;king;Bike;Tholi Prema;Romantic;Andhra Pradesh;kalyan;Heroine;Hero;kirti;Darsakudu;Director;Audience;Cinemaప్రేమలోని మాధుర్యాన్ని తెలిపే తొలిప్రేమ ని ఎప్పటికీ మరచిపోలేము .... !!ప్రేమలోని మాధుర్యాన్ని తెలిపే తొలిప్రేమ ని ఎప్పటికీ మరచిపోలేము .... !!tollywood-best-love-stories{#}karunakaran;keerthi reddy;king;Bike;Tholi Prema;Romantic;Andhra Pradesh;kalyan;Heroine;Hero;kirti;Darsakudu;Director;Audience;CinemaSat, 19 Jun 2021 23:16:33 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించిన సినిమా తొలిప్రేమ. జివిజి రాజు నిర్మాతగా కరుణాకరన్ తొలిసారిగా మెగాఫోన్ పట్టిన ఈ సినిమా 1998లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద విజయాన్ని అందుకుంది. ఇందులో బాలు పాత్రలో పవన్ నటించగా స్వప్న పాత్రలో కీర్తి కనిపిస్తారు. తమ అంతస్తులు వేరైనప్పటికీ కూడా మంచి మనసు, వ్యక్తిత్వం గల బాలుని ఇష్టపడే స్వప్న చివర్లో దేశం విడిచి పైచదువులు కోసం విదేశాలకు వెళ్లే సమయంలో బాలుకి తన ప్రేమను వ్యక్తపరుస్తుంది.

ఎంతో ఎమోషనల్ గా రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో సాగె ఈ సినిమాలో నటించిన పవన్, కీర్తి ల జోడీకి అప్పటి యువత నుండి విశేషమైన క్రేజ్ లభించింది. ముఖ్యంగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవా అందించిన సాంగ్స్, బీజీఎమ్ కూడా ఎంతో అదిరిపోవడంతో పాటు సినిమా సక్సెస్ కు ఒక కారణంగా నిలిచాయి. అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు ముఖ్యంగా యువత మనోభావాలకు అద్దం పట్టేలా ప్రేమలోని మాధుర్యాన్ని తెలిపే సినిమాగా ఎంతో అద్భుతంగా తొలిప్రేమ ని తెరకెక్కించారు దర్శకుడు కరుణాకరన్.

ఈ సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్, హీరో ఒక చిన్న పాపని బైక్ మీద నుండి పడకుండా కాపాడే సీన్, అలానే హీరో, హీరోయిన్స్ ఇద్దరూ కూడా లోయలో పడే సన్నివేశంతో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమా విడుదల తరువాత పవన్ కు యువతలో విశేషమైన క్రేజ్ లభించింది. ఇక ఈ సినిమా ఉత్తమ ఫీచర్ ఫిలిం గా ఏకంగా జాతీయ అవార్డు అందుకోవడంతో పాటు బెస్ట్ ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ గా, అలానే బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా కరుణాకరన్, బెస్ట్ ఎడిటర్ గా మార్తాండ్ కె వెంకటేష్, బెస్ట్ ఆడియోగ్రాఫర్ గా మధుసూదన్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా వాసుకి, అలానే బెస్ట్ ఫీచర్ ఫిలిం గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు గెలుచుకోవడం జరిగింది. .... !!  



ప్రేమలోని మాధుర్యాన్ని తెలిపే తొలిప్రేమ ని ఎప్పటికీ మరచిపోలేము .... !! పూర్తి వివరాల కోసం హెరాల్డ్ సినిమాలు చూడండి.

త్రివిక్రం.. సూర్య.. ఈసారైనా..?

అబ్బో ... తమిళ స్టార్స్ వాటిపై గట్టిగానే గురిపెట్టినట్లున్నారుగా .... ??

నాని పై మహేష్ ప్రశంసలు..!!

తగ్గేదేలే అంటున్న సూపర్ స్టార్ ... సర్కారు వారి పాట షురూ ..... ??

క్రాక్ ఇచ్చిన కిక్.. యాక్షన్ సీన్స్ హైలెట్ గా ఖిలాడి..!

త్రిపాత్రాభినయంలో నటించి మెప్పించిన హీరోలు..

'రాధే శ్యామ్' లో 'ప్రభాస్' అది కూడా చేస్తున్నాడా..?

పుష్ప సినిమా టైటిల్ మారనుందా..? కారణం ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>