MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nahachaitanya55c00485-e17d-4a0c-ae41-5b0ef00bbd52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nahachaitanya55c00485-e17d-4a0c-ae41-5b0ef00bbd52-415x250-IndiaHerald.jpgజూలై నుంచి ధియేటర్లు రీ ఓపెన్ అయినప్పటికీ ఆగష్టు మొదటివారం నుండి మాత్రమే 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయి అని అంటున్నారు. దీనికితోడు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ ఇంకా మరొ రెండు వారాలు కొనసాగే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఖంగారుగా సినిమాలను విడుదల చేసేకంటే ఆచితూచి వ్యవహరించాలని చాలామంది నిర్మాతలు భావిస్తున్నారు.తెలుస్తున్న సమాచారం మేరకు అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే జూలై 13న ‘లవ్ స్టోరీ’ విడుదల అవుతుంది అన్నవార్తలు వస్తున్నాయిnahachaitanya{#}Dussehra;Vijayadashami;producer;Producer;August;Nani;October;Andhra Pradesh;Industry;Allu Arjun;News;Telugu;Tollywood;Coronavirus;Cinemaచైతన్య కోసం బ్యాక్ అవుట్ అయిన బన్ని !చైతన్య కోసం బ్యాక్ అవుట్ అయిన బన్ని !nahachaitanya{#}Dussehra;Vijayadashami;producer;Producer;August;Nani;October;Andhra Pradesh;Industry;Allu Arjun;News;Telugu;Tollywood;Coronavirus;CinemaSat, 19 Jun 2021 10:00:00 GMTజూలై నుంచి ధియేటర్లు రీ ఓపెన్ అయినప్పటికీ ఆగష్టు మొదటివారం నుండి మాత్రమే 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయి అని అంటున్నారు. దీనికితోడు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ ఇంకా మరొ రెండు వారాలు కొనసాగే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఖంగారుగా సినిమాలను విడుదల చేసేకంటే ఆచితూచి వ్యవహరించాలని చాలామంది నిర్మాతలు భావిస్తున్నారు.


తెలుస్తున్న సమాచారం మేరకు అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే జూలై 13న ‘లవ్ స్టోరీ’ విడుదల అవుతుంది అన్నవార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈమూవీ నిర్మాత ఈవిషయమై ఈమూవీ బయ్యర్లతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. భారీ అంచనాలు ఉన్న ఈమూవీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేస్తే అప్పటికి కొంతవరకు కరోనా భయాలు తగ్గడంతో ఈమూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది అన్నఅంచనాలు నిర్మాతలకు ఉన్నాయి.


వాస్తవానికి ఆగష్టు 13వ తేదీని ఇప్పటికే అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ కోసం లాక్ చేసారు. అయితే ఆ డేట్ కు ‘పుష్ప’ విడుదల అయ్యే ఆస్కారం లేదు. దీనితో ఆ డేట్ ‘లవ్ స్టోరీ’ నిర్మాతలు తీసుకుని భారీ రిలీజ్ గా ఈమూవీని విడుదల చేయాలని అప్పుడే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీకి రెండు వారాలు గ్యాప్ ఇచ్చి నాని ‘టక్ జగదీష్’ విడుదల ఉంటుంది అని అంటున్నారు.


ఈపరిస్థితులు ఇలా ఉండగా అక్టోబర్ లో రాబోతున్న దసరా హడావిడి అప్పుడే ఇండస్ట్రీ వర్గాలలో ప్రారంభం అయిపోయింది. ‘ఆచార్య’ ‘అఖండ’ ‘రాదే శ్యామ్’ ఇలా మూడు భారీ సినిమాలు దసరా రేసుకు రెడీ అవుతున్నాయి. అయితే ఒకేసారి ఈమూడు సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదలైతే ఇన్ని భారీ సినిమాలకు ధియేటర్లు ఎక్కడ దొరుకుతాయి అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మూడు సినిమాల పై సుమారు 300 కోట్లకు పైగా బిజినెస్ జరిగే ఆస్కారం ఉండటంతో ఇన్ని భారీ సినిమాలు ఒకే సీజన్ లో తలబడితే ఒక్క సినిమా మాత్రమే లాభాల బాట పట్టే ఆస్కారం ఉంటుంది అంటూ టాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..






నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలు

పవన్ కళ్యాణ్ కు ఖుషి.. వరుణ్ తేజ్ కి ఫిదా.. తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా..!!

ఆర్నబ్ దమ్ముంటే రాహుల్ ని ఇప్పుడు పిలువ్ డిబేట్ కి?

బీచ్ లో పార్ట్ నర్ తో కీర్తి సురేష్.. తనకు సరైన జోడీ అంటూ..!

రాహుల్ గాంధీ గురించి ఆసక్తికర విషయాలు ఇవే..!

భారత్‌ పేరుతో విరాళాలు.. పాక్ సంస్థ అరాచకాలు..?

తెలంగాణలో ఢిల్లీ తరహా అన్ లాక్?

ప్రేమకు మారుపేరు నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా..

అమెరికాకి రజనీకాంత్.. ఎందుకంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>