MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-political-movies50c262cc-d676-410e-a9d7-3f5f73e7c2c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-political-movies50c262cc-d676-410e-a9d7-3f5f73e7c2c7-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు ఎన్నో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కో విధంగా రాజకీయ నేపథ్యంతో తీసే సినిమాలను మలుస్తూ ఉంటాడు. ఎవరి శైలి వారికి ఉంటుంది. ఇదే రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఒక సినిమా గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. TOLLYWOOD-POLITICAL-MOVIES{#}Venkatesh;Suresh;dr rajasekhar;kajal aggarwal;navdeep;teja;Tamil;producer;king;Love;D Ramanaidu;Producer;Daggubati Venkateswara Rao;June;Kick;Nimmala Ramanaidu;Chitram;rana daggubati;Director;Darsakudu;Telangana Chief Minister;Telugu;Cinemaసామాన్యుడే "సీఎం" అయితే... జోగేంద్రలా ఉంటాడు ?సామాన్యుడే "సీఎం" అయితే... జోగేంద్రలా ఉంటాడు ?TOLLYWOOD-POLITICAL-MOVIES{#}Venkatesh;Suresh;dr rajasekhar;kajal aggarwal;navdeep;teja;Tamil;producer;king;Love;D Ramanaidu;Producer;Daggubati Venkateswara Rao;June;Kick;Nimmala Ramanaidu;Chitram;rana daggubati;Director;Darsakudu;Telangana Chief Minister;Telugu;CinemaFri, 18 Jun 2021 18:07:22 GMT తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు ఎన్నో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కో విధంగా రాజకీయ నేపథ్యంతో తీసే సినిమాలను మలుస్తూ ఉంటాడు. ఎవరి శైలి వారికి ఉంటుంది. ఇదే రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఒక సినిమా గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. 2016 వరకు ప్రేమ, కుటుంబం, యూత్ కు సంబంధించిన చిత్రాలను తీస్తూ వచ్చిన డైరెక్టర్ తేజ, ఒక్కసారిగా ఒక పొలిటికల్ మూవీని తీయాలని ప్లాన్ చేశారు. అయితే ఎప్పుడూ తేజ కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నం చేస్తాడు. ఇదే అతన్ని ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ గా నిలబెట్టింది. అతని ఆలోచనల నుండి పుట్టుకొచ్చిన మరొక ఫ్రెష్ కథే "నేనే రాజు నేనే మంత్రి" సినిమా. ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క సీన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమాలో నటించిన రానా, కాజల్ అగర్వాల్, కెథెరిన్ మరియు నవదీప్ లు వారి నటనతో తమ పాత్రలకు ప్రాణం పోశారు. జోగేంద్రగా రానా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఒక వడ్డీ వ్యాపారం చేసుకునే జోగేంద్ర అనే సామాన్య వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగాడు. తాను ముఖ్యమంత్రి కావాలనుకోవడానికి దారి తీసిన పరిణామాలను తెరకెక్కించిన తీరు అత్యద్భుతం. రానా కాజల్ ల మధ్య ఉన్న లవ్ అండ్ ఎమోషన్ హైలైట్. పటిష్టమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను 2 గంటల 33 నిముషాలపాటు సీట్లో కూర్చోబెట్టడంలో తేజ సక్సెస్ అయ్యాడు. సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా బోర్ కొట్టదు. క్లైమాక్స్ మాత్రం కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఆ కథకు సరిపడా దర్శకుడు రాజీ పడలేదు. ఈ సినిమాతో రానా సోలో హీరోగా మరియు చాలా కాలంగా సరైన హిట్ లేని దర్శకుడు తేజకి మంచి కిక్ తో పాటు హిట్ ను ఇచ్చింది.
 ఈ సినిమా గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను.

* వాస్తవంగా ఈ సినిమాకు మొదట రాజశేఖర్ ని హీరోగా అనుకున్నారు మరియు కాజల్ పాత్రలో స్నేహాను సెలెక్ట్ చేసుకున్నారు డైరెక్టర్ తేజ. కథకు సంబంధించి చర్చలు కూడా జరిగాయి. కానీ వివిధ కారణాల వలన వారిద్దరూ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.

* అంతే కాకుండా ఈ సినిమాకు మొదట అనుకున్న పేరు "అహం"

* అప్పుడు ఈ చిత్ర నిర్మాత పి సత్యనారాయణరెడ్డి మరొక హీరోని చూడమని చెప్పడంతో,  అప్పుడు తేజ రానాని కలిసి చర్చించడంతో దీనికి హీరోగా చేయడానికి అతను అంగీకరించారు. అలా రానా ఈ ప్రాజెక్టులోకి రావడం జరిగింది.
* అదే సమయంలో ప్రధానమైన మహిళ పాత్ర కోసం రానా తండ్రి సురేష్ బాబు కాజల్ అగర్వాల్ పేరును సూచించారు. ఆ విధంగా కాజల్ అగర్వాల్ ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది.
* ఆ తరువాత అప్పటికే తన దగ్గరున్న స్క్రిప్ట్ ని పలు మార్లు మార్చడం వలన ఆఖరుకి "నేనే రాజు నేనే మంత్రి" కథ సిద్ధం అయింది.
* ఈ సినిమా టీజర్ ను దగ్గుబాటి రానా తాత రామానాయుడు 81 వ పుట్టినరోజు కానుకగా 2016 జూన్ 6 న విడుదల చేశారు.

 
* ఈ సినిమాలో కథానాయికగా నటించిన కాజల్ కు ఇది 50 వ చిత్రం కావడం విశేషం.  ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాజల్ కు సంబంధిచిన స్పెషల్ టీజర్ ను 2016 జూన్ 19 న విడుదల చేశారు.
* ఈ సినిమా 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా, 45 కోట్ల వసూళ్లను సాధించి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టింది.

 * ఈ సినిమా తెలుగులో భారీ విజయం సాధించడంతో, ఆ తరువాత హిందీ, తమిళ్ మరియు మలయాళ భాషల్లోనూ విడుదల కావడం విశేషం.
 ఈ సినిమా ద్వారా తేజ సామాన్య వ్యక్తి ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించగలడు అని జోగేంద్ర పాత్ర ద్వారా అందరికీ తెలియచేశాడు. అంతే కాకుండా రాజకీయాల్లో నెగ్గుకురావాలంటే కొన్ని తప్పులు చేయకతప్పదని వాస్తవ విషయాన్ని ప్రజలకు చెప్పాడు.




'విశాల్' కంటికి గాయాలు.. షూటింగ్ కి బ్రేక్..?

హైద‌రాబాద్ లో షూటింగ్ లు షురూ..ఏ సినిమా ఎక్క‌డ‌.. !

బెల్లం బాబుకి షాక్ ఇచ్చిన పెన్ స్టూడియోస్

నాని మీట్ క్యూట్ బ్యూటీ లు ఎవరంటే?

ఒకే హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్న ఆర్ఆర్ఆర్ హీరోలు..?

మహేష్ కథతో ధనుష్ ని ఒప్పించిన శేఖర్ కమ్ముల..?

అలిపిరి వ‌ర‌కు గ‌రుడ‌?

హీరోగా మారనున్న శేఖర్ మాస్టర్... ?

భారత్ లో మోస్ట్ బిజీ యాక్టర్ ఎవరంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>