PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi430e1e05-37d2-471e-a432-eb8dfd98aa34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi430e1e05-37d2-471e-a432-eb8dfd98aa34-415x250-IndiaHerald.jpgఇక క‌రోనా సెకండ్ వేవ్ విష‌యంలో మోడీ అట్ట‌ర్ ప్లాప్ అయ్యారు. కరోనా ఆయన పనితీరును పాలన తీరును ఎండగట్టిందన్న ఆరోపణలు తీవ్రంగా వ‌చ్చాయి. సామాన్యుడు సైతం మోడీ పాల‌న ప‌ట్ల విసిగిపోయి ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో ఓ సర్వే ప్రధాని నరేంద్రమోడీ హవా భారత్ లో తగ్గుతోందన్న విష‌యం స్ప‌ష్టం చేసింది. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సర్వే లో 2019తో పోలిస్తే మోడీకి ఉన్న జనామోదం 20 పాయింట్లు త‌గ్గింద‌ని స‌ర్వే చెప్పింది. 2019లో మోడీకి 82శాతం జనామోదం ఉంటే 2021 నాటికి అది 66 శాతానికి పడిపోయింది. narendra modi{#}Korea; South;Narendra Modi;Survey;Coronavirus;Hanu Raghavapudi;Indiaమోడీ క్రేజ్ మ‌స‌క‌బారుతోంది... ప‌డుతోన్న గ్రాఫ్ ?మోడీ క్రేజ్ మ‌స‌క‌బారుతోంది... ప‌డుతోన్న గ్రాఫ్ ?narendra modi{#}Korea; South;Narendra Modi;Survey;Coronavirus;Hanu Raghavapudi;IndiaFri, 18 Jun 2021 18:21:16 GMTఓ చాయ్ వాలా దేశ ప్ర‌ధాని కాబోతున్నాడు.. గుజరాత్‌లో జ‌రిగిన అభివృద్ధే రేపు భార‌త్ మొత్తం జ‌రుగుతుంది అంటూ 2014 ఎన్నిక‌ల‌కు ముందు ఓ బుడ‌గ లాంటి హైప్ దేశ‌వ్యాప్తంగా క్రియేట్ అయ్యింది. ఎవ‌రి నోట విన్నా మోడీ మాటే.. అయితే వారి ఆశ‌లు ఆవిరైపోవ‌డానికి ఎంతో కాలం ప‌ట్ట‌లేదు. కేవ‌లం రెండేళ్ల‌లోనే మోడీ జిమ్మిక్కులు, డ్రామాలు దేశ ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యాయి. అయితే 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి దేశంలో ఉన్న బ‌ల‌హీన‌మైన ప్ర‌తిప‌క్షం.. మోడీ డ్రామాలు న‌మ్మిన‌వారు, గ‌తంలో యూపీఏ ప్ర‌భుత్వంతో పోలిస్తే పెద్దగా అవినీతి లేక‌పోవ‌డం లాంటి అంశాలు క‌లిసి వ‌చ్చి బంప‌ర్ మెజార్టీతో మోడీ వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చారు.

ఇక క‌రోనా సెకండ్ వేవ్ విష‌యంలో మోడీ అట్ట‌ర్ ప్లాప్ అయ్యారు. కరోనా ఆయన పనితీరును పాలన తీరును ఎండగట్టిందన్న ఆరోపణలు తీవ్రంగా వ‌చ్చాయి. సామాన్యుడు సైతం మోడీ పాల‌న ప‌ట్ల విసిగిపోయి ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో ఓ సర్వే ప్రధాని నరేంద్రమోడీ హవా భారత్ లో తగ్గుతోందన్న విష‌యం స్ప‌ష్టం చేసింది. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్  సర్వే లో 2019తో పోలిస్తే మోడీకి ఉన్న జనామోదం 20 పాయింట్లు త‌గ్గింద‌ని స‌ర్వే చెప్పింది. 2019లో మోడీకి 82శాతం జనామోదం ఉంటే 2021 నాటికి అది 66 శాతానికి పడిపోయింది.

తాజా స‌ర్వేలో మోడీ 66శాతం జనామోదంతో టాప్ లో ఉంటే.. మ‌రో వైపు 28శాతం మంది ఆయన నాయకత్వాన్ని తిరస్కరించారు. విచిత్రం ఏంటంటే మోడీకి ఆద‌ర‌ణ త‌గ్గినా కూడా ప్ర‌పంచ దేశాల అధినాయ‌కుల‌తో పోలిస్తే  మోడీనే చాలా ముందు ఉండడం విశేషంగా.  మోడీ 66 శాతం జనామోదంతో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంటే మార్లో ద్రగి (ఇటలీ-65శాతం) - లోపెజ్ ఒబ్రేడార్ (మెక్సికో-63శాతం) - స్కాట్ మారిసన్(ఆస్ట్రేలియా-54శాతం) - ఏంజెలా మెర్కెల్ (జర్మనీ-53 శాతం)  - జస్టిన్ ట్రుడో(కెనడా-48శాతం) - బోరిస్ జాన్సన్(యూకె-44శాతం) - మూన్ జే ఇన్ (సౌత్ కొరియా 37శాతం) వ‌రుస‌గా త‌ర్వాత స్థానాల్లో ఉన్నారు.

ఏదేమైనా మోడీ క్రేజ్ కొంత వ‌ర‌కు త‌గ్గినా కూడా ఆయ‌న ప్ర‌పంచ దేశాల అధినేత‌ల‌తో పోలిస్తే టాప్‌లో ఉండ‌డం గొప్ప విష‌య‌మే. ఇక మోడీ ప్రభ తగ్గడంతో 2022లో జరిగే 7 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గెలుపు ఈజీ కాదని స్ప‌ష్ట‌మ‌వుతోంది.



మోడీ క్రేజ్ మ‌స‌క‌బారుతోంది... ఈజీ కాదని స్ప‌ష్ట‌మ‌వుతోంది

హైద‌రాబాద్ లో షూటింగ్ లు షురూ..ఏ సినిమా ఎక్క‌డ‌.. !

బెల్లం బాబుకి షాక్ ఇచ్చిన పెన్ స్టూడియోస్

పుష్ప పార్ట్ 1 కి టైటిల్ ఫిక్స్ చేసిన సుక్కు

జ‌గ‌న్‌కు ఆ సంతోషం రెండు రోజుల్లోనే తుస్‌...!

బాల్యంపై కరోనా కాటు

పూరీ కి యశ్ హ్యాండ్ ఇచ్చినట్లేనా?

'ఎన్టీఆర్ - కొరటాల' సినిమాకి భారీ రెమ్యూనరేషన్ అందుకోనున్న బాలీవుడ్ బ్యూటీ..?

వంశీ పైడిపల్లి, బోయపాటి శ్రీను ల బాటలోనే శేఖర్ కమ్ముల !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>