MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vv-vinayakfc517024-607d-4c60-bfb3-60720d6966f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vv-vinayakfc517024-607d-4c60-bfb3-60720d6966f8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనేది ఆయన కల అని చాలాసార్లు చెప్పారు. కానీ ఈ కాంబినేషన్ మాత్రం సెట్ అవడం లేదు. ఏదో ఒక కారణం వీరిద్దరి కాంబినేషన్ కి అడ్డు తగులుతుంది. దీంతో ఈ కాంబినేషన్ సెట్ అవడానికి మరి కొన్ని రోజులు పట్టేలా ఉంది. మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకులలో ముందు వరుసలో ఉంటారు వినాయక్. యాక్షన్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ గుర్తొస్తాయి ఆయన సినిమాలు చూస్తే. హీరోలను ఒక రేంజ్ లో ఎలివేట్ చేసే దర్శకుడు వినాయక్ ఇటీవల కాలంలో ఇతర దర్శకులతో పోలిస్తే కాస్త వెనుక పడినట్లvv vinayak{#}Chiranjeevi;bellamkonda sai sreenivas;kalyan;sai dharam tej;Industry;Khaidi.;Darsakudu;Khaidi new;Mass;Cinema;Directorవివి వినాయక్ కల ఇక నెరవేరదా!వివి వినాయక్ కల ఇక నెరవేరదా!vv vinayak{#}Chiranjeevi;bellamkonda sai sreenivas;kalyan;sai dharam tej;Industry;Khaidi.;Darsakudu;Khaidi new;Mass;Cinema;DirectorFri, 18 Jun 2021 13:00:00 GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనేది ఆయన కల అని చాలాసార్లు చెప్పారు. కానీ ఈ కాంబినేషన్ మాత్రం సెట్ అవడం లేదు. ఏదో ఒక కారణం వీరిద్దరి కాంబినేషన్ కి అడ్డు తగులుతుంది. దీంతో ఈ కాంబినేషన్ సెట్ అవడానికి మరి కొన్ని రోజులు పట్టేలా ఉంది. మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకులలో ముందు వరుసలో ఉంటారు వినాయక్. యాక్షన్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ గుర్తొస్తాయి ఆయన సినిమాలు చూస్తే. హీరోలను ఒక రేంజ్ లో ఎలివేట్ చేసే దర్శకుడు వినాయక్ ఇటీవల కాలంలో ఇతర దర్శకులతో పోలిస్తే కాస్త వెనుక పడినట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి తో ఖైదీ నెంబర్ 150 సినిమా చేసిన తరువాత వినాయక్ సాయి ధరమ్ తేజ్ తో చేసిన ఇంటెలిజెంట్ సినిమా వల్ల తన పాపులారిటీని చాలా కోల్పోయాడు. ఆ సినిమాతో ఒక్కసారిగా డీలా పడిపోయిన వినాయక్ మళ్లీ కోలుకోలేకపోయాడు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరి ఛాన్స్ ఇచ్చి చివరికి తను తీసేయడం కూడా ఆయన వెనుకబడడానికి మరో కారణమని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు. 

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ సినిమా చత్రపతి ని తెరకెక్కిస్తున్న ఆయన అదే హీరోతో తెలుగులో కర్ణన్ సినిమా రీమేక్ చేయబోతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వినాయక్ మహేష్, పవన్ కళ్యాణ్ లలో ఒకరితో సినిమా తీయాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారు అని ప్రశ్నించగా, పవన్ కళ్యాణ్ అని సమాధానమిచ్చారు. ఎందుకంటే పవన్ తో నాకు మంచి రాపో ఉంది. మహేష్ తో మాత్రం తనకు అంత రాపొ లేదని , మేము కలుసుకున్నది కూడా చాలా తక్కువ అని అన్నారు. మరి పవన్ తో సినిమా ఎప్పుడు అని ప్రశ్నించగా అది ఆయన డిసైడ్ చేయాల్సిన విషయం అన్నారు.  పవన్ చిరంజీవి గారి లాంటి స్టార్స్ ని గమనిస్తే ఈ టైంలో తాము యాక్షన్ సినిమా చేయాలా లేక పొలిటికల్ చేయాలా అనేది వాళ్ళు డిసైడ్ అవుతారని వినాయక్ అన్నారు.



విజ‌న్ సినిమాస్ ప్రొడ‌క్ష‌న్ పై ఆది న్యూ మూవీ..?

ఓటిటి లో ఈ రోజు విడుదల కానున్న చిత్రాలివే ?

త్రీ ఇడియట్స్ డైరెక్టర్ తో షారుఖ్ కొత్త సినిమా

శ్రీను వైట్లకు ఈ ఛాన్స్ ల వరద ఏంటి?

టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ పొలిటికల్ బయోపిక్‌ ఇదే..!

రాజశేఖర్ కెరీర్ కి ఉత్సాహం తెచ్చిన ఎవడైతే నాకేంటి..?

సమంత‌కు హ‌గ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పిన రౌడీ...కార‌ణం ఇదే..!

ఐశ్వర్యరాయ్ - విక్రమ్ విలన్ కు నిజమైన విలన్ ఎవరు?

మహేష్ బాబు ను సరికొత్త కోణంలో చూపించిన పొలిటికల్ ఎంటర్ టైనర్ దూకుడు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>