PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan19b19290-caea-4487-a8e3-0e4c5f60483f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan19b19290-caea-4487-a8e3-0e4c5f60483f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో భూములకు సంబంధించి అక్రమాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. భూముల్లో మోసాలు జరగకుండా ఉండేందుకు గానూ సర్వేలను చేపడుతుంది. కబ్జాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపడుతుంది ఏపీ సర్కార్. ప్రభుత్వ భూముల విషయంలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. అలాగే కబ్జాకు గురైన భూములకు సంబంధించి కూడా జాగ్రత్తగా ఉంటుంది. వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడమే కాకుండా గత ప్రభుత్వం కంపెనీలకు ఇచ్చిన భూములకు సంబంధించి అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో భjagan{#}adhithya;Jagan;Survey;Government;Andhra Pradesh;Districtభూముల అక్రమాలపై జగన్ సీరియస్ ఫోకస్... కబ్జా చేస్తే అంతే...?భూముల అక్రమాలపై జగన్ సీరియస్ ఫోకస్... కబ్జా చేస్తే అంతే...?jagan{#}adhithya;Jagan;Survey;Government;Andhra Pradesh;DistrictFri, 18 Jun 2021 10:39:56 GMTఆంధ్రప్రదేశ్ లో భూములకు సంబంధించి అక్రమాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. భూముల్లో మోసాలు జరగకుండా ఉండేందుకు గానూ సర్వేలను చేపడుతుంది. కబ్జాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపడుతుంది ఏపీ సర్కార్. ప్రభుత్వ భూముల విషయంలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. అలాగే కబ్జాకు గురైన భూములకు సంబంధించి కూడా జాగ్రత్తగా ఉంటుంది. వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడమే కాకుండా గత ప్రభుత్వం కంపెనీలకు ఇచ్చిన భూములకు సంబంధించి అప్రమత్తంగా వ్యవహరిస్తుంది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసారు. సిఎం వైఎస్ జగన్  ముఖ్య సలహాదారు చైర్మన్‌ గా రాష్ట్రస్థాయి స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కమిటీ కి వైస్‌ చైర్మన్‌ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ఉంటారు. ఈ కమిటీలో భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) అలాగే రెవెన్యూ, ఆర్థిక, పురపాలనతో పాటుగా పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది.

వీరితో పాటుగా సర్వే సెటిల్‌ మెంట్‌ కమిషనర్‌ అలాగే గనుల శాఖ డైరెక్టర్‌ లను కూడా సభ్యులు గా ఉంటారని సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ఇక కలెక్టర్‌ చైర్మన్‌ గా జిల్లా స్థాయి ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీకి కొన్ని ఆదేశాలు ఇచ్చింది. రీ సర్వే ప్రాజెక్టు అమలు కోసం గానూ తరచుగా స్టీరింగ్‌ కమిటీతో సమావేశమై పురోగతిపై సమీక్షించాలని ఆదేశాల్లో పేర్కొంది. అలాగే ప్రాజెక్టు పరిధిలో చేపట్టే పనులను వెంటనే పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక రీ సర్వే పనుల పర్యవేక్షణ అలాగే సమస్యల పరిష్కారం కోసం గానూ తగిన వ్యవస్థను ఏర్పాటు చేసారు. అదే విధంగా జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ ద్వారా తరచుగా క్షేత్రస్థాయి పరిశీలనలు చేస్తారని సర్కార్ వెల్లడించింది.



అమ‌రావ‌తి: నేడు జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేయ‌నున్న సీఎం వైఎస్ జ‌గ‌న్.. 2021-22 ఏడాదికి వివిధ శాఖ‌ల‌కు చెందిన 10,143 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న ఏపీ స‌ర్కార్

వైసీపీలోకి మాజీ ఎమ్మెల్సీ.... కండువా క‌ప్పేసిన జ‌గ‌న్‌

ఎంపీని కొట్టిన బిజెపి నేత దారుణ హత్య...?

సంచ‌యిత‌తోనే వైసీపీ కీల‌క నేత‌ల‌కు చెక్‌.. జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ ?

రఘురామ కృష్ణంరాజు కేసులో కీలక మలుపు

అన్నా ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీలు ఇవ్వరాదే...? పోనీ ఆ ఒక్కడికి...?

ఆయుర్వేదం మందు సక్సెస్.. ఆనందయ్య ఫెయిల్..

కడపలో టిప్పు సుల్తాన్ విగ్రహం.. బిజెపి తీవ్ర ఆగ్రహం?

40 ఏళ్లలో మీ హిందూత్వం ఎటు పోయింది అశోక్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>