BeautyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/haircfb83328-7c9b-4ecd-9d62-46ab9b2f4f88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/haircfb83328-7c9b-4ecd-9d62-46ab9b2f4f88-415x250-IndiaHerald.jpgజుట్టు రాలడం.. ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిన సమస్య అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ జుట్టురాలడాన్ని ఆపలేక ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసి విసుగు చెంది ఉంటారు. అయితే అలాంటి వారి కోసం ముఖ్యంగా ఈ జుట్టు రాలడాన్ని తగ్గించడానికి కేవలం ఆరు సులభమైన పద్ధతులను పాటిస్తే సరిపోతుంది అని అంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. HAIR{#}Soundarya;Vitamin;Ayurveda;pollution;oilజుట్టు రాలడాన్ని తగ్గించే 6 సులభమైన మార్గాలు..జుట్టు రాలడాన్ని తగ్గించే 6 సులభమైన మార్గాలు..HAIR{#}Soundarya;Vitamin;Ayurveda;pollution;oilFri, 18 Jun 2021 15:00:00 GMT
జుట్టు రాలడం.. ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిన సమస్య అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ జుట్టురాలడాన్ని ఆపలేక ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసి విసుగు చెంది ఉంటారు. అయితే అలాంటి వారి కోసం ముఖ్యంగా ఈ జుట్టు రాలడాన్ని తగ్గించడానికి కేవలం ఆరు సులభమైన పద్ధతులను పాటిస్తే సరిపోతుంది అని అంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..


1. ప్రతి రోజూ తల స్నానం చేయడం మానుకోవాలి:

కరోనా మహమ్మారి వ్యాపించిన కారణంగా లాక్డౌన్  విధించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఎక్కడి వారు అక్కడే నిలిచి పోవడంతో కాలుష్యం అన్నమాటే లేకుండాపోయింది. కాలుష్యం మన జుట్టు పై ఎలాంటి ప్రభావం చూపడం లేదు.. కాబట్టి కుదిరితే వారానికి రెండు సార్లు మాత్రమే తలస్నానం చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువసార్లు తలస్నానం చేయడం వల్ల జుట్టు నూనెలను కోల్పోయి , పొడిబారి, నిర్జీవంగా మారిపోతుంది. ఫలితంగా జుట్టు రాలడం మొదలవుతుంది.

2. తప్పకుండా జుట్టుకు కండిషనర్ వాడాలి:
తల స్నానం చేసిన ప్రతిసారి కండిషనర్ వాడడం వల్ల, జుట్టుకు సరైన పోషణ అంది జుట్టు రాలడాన్ని నియంత్రించవచ్చు. అంతేకాకుండా కాలుష్యం నుంచి కూడా జుట్టును సంరక్షిస్తుంది. సహజసిద్ధమైన కెరటిన్, పెప్టైడ్స్ అధికంగా ఉండే కండిషనర్ ను ఎంచుకోవడం ఉత్తమం.

3. జుట్టుకు ఆయిల్ మసాజ్ చేయడం:
కొద్దిగా నూనెను గోరువెచ్చగా చేసి జట్టుకు, మాడుకు పట్టించి బాగా మర్దనా చేయడం వల్ల, నూనె జుట్టు కుదుళ్ల లోపలకి చొచ్చుకొనిపోయి జుట్టు కుదుళ్ల నుంచి బలంగా పెరగడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా సిల్కీగా , షైనింగ్ గా ఉండడానికి కూడా ఈ నూనెలు చక్కగా పనిచేస్తాయి.


4. హెయిర్ మాస్క్ ఉపయోగించడం:
జుట్టుకు పోషణ ఇవ్వాలి అంటే అందుకు ఉత్తమమైన మార్గం హెయిర్ మాస్క్ అని చెప్పవచ్చు. జుట్టుకు వివిధ రకాల ఆయుర్వేద మాస్కులు వేయడం వలన, జుట్టుకు కావలసిన పోషణ అంది, జుట్టు రాలడం తగ్గుతుంది.

5. శాటిన్ పిల్లో కేస్ పై నిద్రించడం:
ఒక వేళ మీరు కనుక కాటన్ పిల్లో లను ఉపయోగిస్తున్నట్లు అయితే వెంటనే వాటిని మార్చేయండి. ఎందుకంటే కాటన్ పిల్లో మీ జుట్టులో ఉన్న తేమను గ్రహించి, జుట్టును పొడిబారేలా చేస్తుంది. శాటిన్ పిల్లో వాడడం వల్ల జుట్టు స్మూత్ గా ఉండడంతో పాటు ఎలాంటి చిక్కుపడకుండా ఉంటుంది.


6. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకోవాలి :

జుట్టు ఒత్తుగా ,బలంగా ఉండాలంటే , బయట నుంచి పోషణ అందిస్తే సరిపోదు..లోపలనుంచి శోషణ కూడా అందించాలి. ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ డి , వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా చేపలు, తాజా పండ్లు ,కాయలు, ఆకుకూరలు ,,పొద్దుతిరుగుడు విత్తనాలు ఆకుపచ్చ కాయగూరలు వంటి వాటిని తినడం అలవాటు చేసుకోవాలి. ధ్యానం చేయడం, విశ్రాంతి తీసుకోవడం వంటి పనుల వల్ల కూడా మనసు ప్రశాంతత పెరిగి తద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు.





మంచిమాట : సహాయం విలువ ఎంత గొప్పదో నేర్పిన శ్రీకృష్ణ కర్ణ..

ప్రతి రోజూ తల స్నానం చేయడం మానుకోవడం, తప్పకుండా జుట్టుకు కండిషనర్ వాడడం,జుట్టుకు ఆయిల్ మసాజ్ చేయడం,హెయిర్ మాస్క్ ఉపయోగించడం,శాటిన్ పిల్లో కేస్ పై నిద్రించడం,ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకోవడం వంటి వాటి వల్ల జుట్టు ఆరగ్యవంతంగా వుండడం తో పాటు జుల్లు రాలడాన్ని అరికట్టవచ్చు.

పెరుగుతో ఈ రెసిపి పర్ఫెక్ట్ గా రావాలంటే ఇలా చేస్తే సరి .. !

ఆయుర్వేదం మందు సక్సెస్.. ఆనందయ్య ఫెయిల్..

ఆయిల్ స్కిన్ వున్న వారు ఈ టిప్స్ పాటించండి...

పనసతో సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం...

వీటిని తింటే ఆ సమస్య మాయం ..

లివర్ ఫ్రై ఇలా చేస్తే వావ్ అనల్సిందే..!

క‌రోనాకు కొత్త మందు.. ఎలా పనిచేస్తుందంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>