మరో మూడురోజులు తెలంగాణలో వర్షాలు.. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు

Hyderabad

oi-Shashidhar S

|

మరో మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారటంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

రాష్ట్రంలోకి నైరుతి, పశ్చిమ దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఇవాళ పశ్చిమ, నైరుతి తెలంగాణ జిల్లాలైన వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డిల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి ఒకటి, రెండుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

another three days rains in telangana

గత రెండు రోజుల నుండి పలుజిల్లాలలో వర్షాలు కురుస్తుండగా మహారాష్ట్రతోపాటు దాదాపు దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో తెలుగు రాష్ట్రం ఏపీలో కూడా పలు జిల్లాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. శుక్రవారం భారీ వర్షంతోపాటు ఉరుములు , మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురవనుంది. కొన్ని జిల్లాలలో ఒకటి ,రెండు చోట్ల వాన వచ్చే అవకాశం ఉంది. శనివారం ఉరుములు మరియు మెరుపులుతో కూడిన వర్షం కొన్ని జిల్లాలలో ఒకటి , రెండు చోట్ల వచ్చే ఛాన్స్ ఉంది.

English summary

another three days rains in telangana state weather officials said to media.

Story first published: Friday, June 18, 2021, 22:34 [IST]

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *