EditorialGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/anandayya-medicine7bdb6a3c-0bfc-4b99-9a7e-d342890c8ecc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/anandayya-medicine7bdb6a3c-0bfc-4b99-9a7e-d342890c8ecc-415x250-IndiaHerald.jpgఆనందయ్య ఆయుర్వేదం మందు గురించి ఆమధ్య ఏపీలో ఎక్కడలేని చర్చ. ఏపీలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే హాట్ టాపిక్. ఆగిపోయిన అనందయ్య మందుకి అనుమతిస్తారా లేదా అనేది గతంలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆ తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవడం, ప్రభుత్వం అనుమతివ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. మరి ఆనందయ్య మందు ఇప్పుడు అందరికీ అందుతోందా..? గతంలో కృష్ణపట్నం చుట్టూ తిరిగిన సామాన్య ప్రజలు ఇప్పుడు ఆయుర్వేదం మందు తీసుకున్నారా..? anandayya medicine{#}Telugu;Government;police;media;Ayurveda;Success;Krishnapatnam Portఆయుర్వేదం మందు సక్సెస్.. ఆనందయ్య ఫెయిల్..ఆయుర్వేదం మందు సక్సెస్.. ఆనందయ్య ఫెయిల్..anandayya medicine{#}Telugu;Government;police;media;Ayurveda;Success;Krishnapatnam PortFri, 18 Jun 2021 09:45:22 GMTఆనందయ్య ఆయుర్వేదం మందు గురించి ఆమధ్య ఏపీలో ఎక్కడలేని చర్చ. ఏపీలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే హాట్ టాపిక్. ఆగిపోయిన అనందయ్య మందుకి అనుమతిస్తారా లేదా అనేది గతంలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆ తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవడం, ప్రభుత్వం అనుమతివ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. మరి ఆనందయ్య మందు ఇప్పుడు అందరికీ అందుతోందా..? గతంలో కృష్ణపట్నం చుట్టూ తిరిగిన సామాన్య ప్రజలు ఇప్పుడు ఆయుర్వేదం మందు తీసుకున్నారా..?

ఆనందయ్య ఆయుర్వేదం మందు చాలామందికి సత్ఫలితాలనిచ్చిందనే ప్రచారంతోపాటు, అది పూర్తి ఉచితంగా పంపిణీ చేయడం అనే కాన్సెప్ట్ జనాల్లోకి బాగా వెళ్లింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఆనందయ్యకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత మందు పంపిణీకి వచ్చే జనాల్ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోవడంతో అధికారులు పంపిణీ ఆపివేశారు. చివరకు ఆయుష్ శాఖ ఆ మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తేల్చి చెప్పడంతో ప్రభుత్వం కూడా మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో ఆనందయ్య మందుకు అనుమతి వచ్చింది.

అయితే అక్కడినుంచి సీన్ పూర్తిగా మారిపోయింది. సామాన్యులకు అందాల్సిన ఆనందయ్య ఆయుర్వేద మందు పూర్తిగా కొంతమందికే పరిమితం అయింది. నాయకులు, పలుకుబడి ఉన్నవారు.. ఆనందయ్యకు ముందుగానే అడ్వాన్స్ లు ఇచ్చేసి మందు తయారు చేయించుకుని తమ ప్రాంతాలకు తీసుకెళ్లి పంచిపెడుతున్నారు. ఈ తంతంగం అంతా ఉచితంగానే జరుగుతున్నా.. చేతులు మారే క్రమంలో మందు బ్లాక్ లో కూడా అమ్ముడవుతుందనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదంతా జరుగుతున్న క్రమంలో అసలు ఆనందయ్య సామాన్య ప్రజలకు ఉచితంగా ఇస్తామన్న ఆయుర్వేద మందు పంపిణీ దాదాపుగా ఆగిపోయింది. కృష్ణపట్నంలో ఆనందయ్య సంప్రదాయంగా ఇస్తూ వస్తున్న ప్రదేశంలో అతి తక్కువమందికే మందు అందుబాటులో ఉంటోంది. ఒకరకంగా ఆయుర్వేదం మందు ప్రజల్లో బాగా సక్సెస్ అయినా.. ఆనందయ్య మాత్రం పంపిణీ విషయంలో ఫెయిలయ్యారు. సామాన్యులకు మందుని ఉచితంగా చేరవేయడంలో ఎక్కడో లోపం జరిగింది. అందుకే ఇప్పుడు ఆనందయ్య మందు గురించిన చర్చ తక్కువగా వినిపిస్తోంది.



జాన్వి కపూర్ తో అజ్ఞాత వ్యక్తి పై ఆశక్తికర చర్చలు !

50 ఏళ్ల క్రితం ఫోటో షేర్ చేసిన హేమామాలిని.. ఫోటో వైరల్!

ఆనందయ్య ఆయుర్వేదం మందు గురించి ఆమధ్య ఏపీలో ఎక్కడలేని చర్చ. ఏపీలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే హాట్ టాపిక్. ఆగిపోయిన అనందయ్య మందుకి అనుమతిస్తారా లేదా అనేది గతంలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆ తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవడం, ప్రభుత్వం అనుమతివ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. మరి ఆనందయ్య మందు ఇప్పుడు అందరికీ అందుతోందా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో జరిగినట్టు కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ ఆ స్థాయిలో జరగడంలేదు.

40 ఏళ్లలో మీ హిందూత్వం ఎటు పోయింది అశోక్?

అఫీషియల్ : ధనుష్ తో శేఖర్ కమ్ముల ట్రైలింగ్యువల్ సినిమా

సీక్రెట్ ను బయటపెట్టిన మిల్క్ బ్యూటీ..

ఈ ముగ్గురు స్టార్ డైరక్టర్లు కథలు రాయలేరు.. కాని సినిమా తీస్తే బాక్సులు బద్ధలే..!

గ్యాంగ్ లీడర్ తర్వాత ఆ సీనియర్ నటి ఏమైంది ?

అలియా భట్ కు ప్రాముఖ్యత ఆర్ ఆర్ ఆర్ ముందడుగు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>