PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/yanamalb707951e-8ae6-4f1e-9135-45e07fe95506-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/yanamalb707951e-8ae6-4f1e-9135-45e07fe95506-415x250-IndiaHerald.jpgయనమల రామకృష్ణుడు....రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. దశాబ్దాల పాటు తెలుగుదేశంలో కీలక నాయకుడుగా ఉన్న యనమల....ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరమైన యనమల...తన ఫ్యామిలీని రాజకీయంగా నిలబెట్టలేకపోతున్నారు. అసలు తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం యనమలకు కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి అంటే 1983 నుంచి 2004 వరకు జరిగిన ఆరు ఎన్నికల్లో వరుసగా యనమల టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.yanamal{#}CBN;krishnudu;DADISETTI RAJA;Hanu Raghavapudi;District;East;Telugu;kakinada;Tuni;Minister;TDPయనమల కుమార్తె రెడీ అవుతున్నారా?యనమల కుమార్తె రెడీ అవుతున్నారా?yanamal{#}CBN;krishnudu;DADISETTI RAJA;Hanu Raghavapudi;District;East;Telugu;kakinada;Tuni;Minister;TDPFri, 18 Jun 2021 02:00:00 GMTయనమల రామకృష్ణుడు....రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. దశాబ్దాల పాటు తెలుగుదేశంలో కీలక నాయకుడుగా ఉన్న యనమల....ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరమైన యనమల...తన ఫ్యామిలీని రాజకీయంగా నిలబెట్టలేకపోతున్నారు. అసలు తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం యనమలకు కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి అంటే 1983 నుంచి 2004 వరకు జరిగిన ఆరు ఎన్నికల్లో వరుసగా యనమల టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.


అలాగే టీడీపీలో అనేక కీలక పదవులు అనుభవించారు. అయితే 2009 నుంచి యనమలకు ఎదురుగాలి మొదలైంది. 2009లో తొలిసారి యనమల పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికలోచ్చేసరికి యనమల పోటీ నుంచి తప్పుకుని, తన సోదరుడు కృష్ణుడుని తుని బరిలో నిలబెట్టారు. కానీ కృష్ణుడు వైసీపీ నేత దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోయారు. కాకపోతే అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో యనమలకు ఎమ్మెల్సీ పదవితో పాటు, ఆర్ధిక మంత్రి పదవి వచ్చింది.


ఆ అయిదేళ్లు యనమల ఫ్యామిలీ రాజకీయం బాగానే నడిచింది. కానీ 2019 ఎన్నికల్లో తునిలో మళ్ళీ ఎదురుగాలి వీచింది. కృష్ణుడు మరొకసారి దాడిశెట్టి చేతిలో ఓడిపోయారు. అయితే యనమల కుమార్తె దివ్యని సైతం ఆ ఎన్నికల్లో నిలబెట్టాలని యనమల చూశారు. కాకినాడ రూరల్ లేదా రాజానగరం సీట్లలో నిలబెట్టాలని చూశారు గానీ, చంద్రబాబు ఛాన్స్ ఇవ్వలేదు. ఇక వచ్చే ఎన్నికల్లో మాత్రం కుమార్తెని రాజకీయాల్లోకి తీసుకోచ్చేందుకు యనమల ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. 


అలాగే ఎన్నికల బరిలో నిలబెట్టాలని చూస్తున్నారు. ఈ సారి మాత్రం కుమార్తెకు ఎలాగైనా టిక్కెట్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే తునిలో యనమల సోదరుడు కృష్ణుడు ఉన్నారు. దీంతో దివ్యకు మరొక సీటు తీసుకోవాలి. కానీ చంద్రబాబు యనమల ఫ్యామిలీ రెండు టికెట్లు ఇస్తారా లేదా అని చూడాలి. ఒకవేళ ఒకటే టిక్కెట్ ఇస్తే యనమల కుమార్తెని ఎలా బరిలో దింపుతారనేది చూడాలి.




టీవీ: సినిమా ఆఫర్లను వదులుకున్న బుల్లితెర నటి..

మురళీమోహన్ కోడలు మళ్ళీ బరిలో ఉంటారా?

ఆళ్ళ-పిన్నెల్లి: జగన్ మనసులో ఎవరు ఉన్నారు?

తెలుగు తెరపై ముద్ర వేసిన జయమ్మ.. ఆమె కోసం పాత్రలు సృష్టిస్తున్నారు..!

విక్రమ్ - శంకర్ కాంబినేషన్ లో వచ్చిన అపరిచితుడు సినిమాకు 16 ఏళ్లు..

చంద్రబాబు అధికారంలో ఉండగా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలనీ ఇష్టారాజ్యంగా టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అలాగే వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలని సైతం చేర్చుకున్నారు. ఈ క్రమంలోనే 2014లో అరకు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కిడారి సర్వేశ్వరరావుని సైతం టీడీపీలో చేర్చుకున్నారు.

గతంలో టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు సమక్షంలో పసుపు కడువా కప్పుకున్న విషయం తెలిసిందే. అలాగే అందులో నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు సైతం ఇచ్చారు. అయితే అలా జగన్‌ని మోసం చేసి టీడీపీకి వెళ్ళి మంత్రులైన వారి పరిస్తితి ఇప్పుడు చాలా ఘోరంగా ఉందనే చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు ఆ నలుగురు ఓటమి పాలయ్యారు.

యనమల రామకృష్ణుడు....రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. దశాబ్దాల పాటు తెలుగుదేశంలో కీలక నాయకుడుగా ఉన్న యనమల....ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరమైన యనమల...తన ఫ్యామిలీని రాజకీయంగా నిలబెట్టలేకపోతున్నారు. అసలు తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం యనమలకు కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి అంటే 1983 నుంచి 2004 వరకు జరిగిన ఆరు ఎన్నికల్లో వరుసగా యనమల టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.

సినీ నటుడు మురళీమోహన్ గురించి తెలియని తెలుగు ప్రజలు ఉండరు. సినిమాల్లో తనదైన శైలిలో సక్సెస్ చూసిన మురళీమోహన్ సొంత నిర్మాణ సంస్థని పెట్టుకుని నిర్మాతగా మంచి విజయాలు అందుకున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగానే రాణిస్తున్నారు. ఇలా తాను ఉన్న రంగాల్లో సక్సెస్ చూసిన మురళీమోహన్ రాజకీయాల్లో మాత్రం పెద్దగా క్లిక్ కాలేకపోయారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>