MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand1cd76b78-a3fa-4a51-8588-2b345abb7b77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand1cd76b78-a3fa-4a51-8588-2b345abb7b77-415x250-IndiaHerald.jpgఅదేంటో అన్నీ ఉన్నా కూడా ఆ ఒక్క విషయంలో మాత్రం బాలయ్య డైరెక్టర్లు తెలియని ఇబ్బందులు పడుతున్నారు. వారికి కధ రాయడం కష్టం కాదు, జనాలు మెచ్చేలా డైరెక్షన్ చేయడమూ ఇబ్బంది కాదు, కానీ ఒకే ఒక్క మ్యాటర్ విషయంలో వారు ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు. gopichand{#}Shruti Haasan;meena;pragya jaiswal;Balakrishna;Tabu;boyapati srinu;Krack;Heroine;Yevaru;Cinemaనిన్న బోయపాటి... నేడు గోపీచంద్ మలినేని... ?నిన్న బోయపాటి... నేడు గోపీచంద్ మలినేని... ?gopichand{#}Shruti Haasan;meena;pragya jaiswal;Balakrishna;Tabu;boyapati srinu;Krack;Heroine;Yevaru;CinemaFri, 18 Jun 2021 18:59:14 GMTఅదేంటో అన్నీ ఉన్నా కూడా ఆ ఒక్క విషయంలో మాత్రం బాలయ్య డైరెక్టర్లు తెలియని ఇబ్బందులు పడుతున్నారు. వారికి కధ రాయడం కష్టం కాదు, జనాలు మెచ్చేలా డైరెక్షన్ చేయడమూ ఇబ్బంది కాదు, కానీ ఒకే ఒక్క మ్యాటర్ విషయంలో వారు ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు.

వారే బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని. ఈ ఇద్దరూ డైరెక్టర్లు బాలయ్యతో సినిమాలు చేస్తున్నారు. ముందుగా బోయపాటినే తీసుకుంటే అఖండ మూవీ తీస్తున్నారు. ఆయన బాలయ్యకు జోడీగా హీరోయిన్లను ఎంపిక చేయడానికి చాలా పాట్లు పడ్డారనే చెప్పాలి. పెద్ద లిస్ట్ పట్టుకుని ఆయన తిరిగితే  చివరికి ప్రగ్యా జైస్వాల్ సెట్ అయింది. ఈ మధ్యలో ఎందరో హీరోయిన్ల పేర్లు వచ్చాయి. కానీ ఎవరూ మాత్రం కుదరలేదు. మొత్తానికి ఆ హర్డిల్స్ అన్నీ దాటేసి బోయపాటి  ఇపుడు హ్యాపీగా అఖండ మూవీని ఫినిష్ చేస్తున్నారు.

ఇక క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని వంతు. ఆయన బాలయ్యతో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపైన కొత్త  సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో బాలయ్యకు హీరోయిన్ కోసం కొన్నాళ్ళుగా గోపీ సెలెక్షన్ లో తెగ బిజీగా ఉన్నారు. ఆయన చాలా మందిని చూస్తున్నారు. అడుగుతున్నారు. కానీ ఎవరూ మాత్రం సెట్ అవడంలేదు. దానికి కారణం కొంతమందికి కాల్షీట్లు ప్రాబ్లం. మరికొందరు సినిమాలు తగ్గించుకోవడం, ఇంకొందరు తమ పాత్ర నిడివిని చూసి వద్దు అనేసుకోవడం జరుగుతోంది.

ఈ విధంగా చాలా మంది హీరోయిన్లను గోపీ సెర్చ్ చేస్తున్నారుట. హీరోయిన్లు కుదిరితే ఈ మూవీ తొందరలోనే సెట్స్ మీదకు వస్తుందని అంటున్నారు. ఈ మూవీకి అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అఖండ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే బాలయ్య గోపీచంద్ తో చేసే సినిమా సెట్ లోనే దర్శనమిస్తారు. దాంతో గడువు దగ్గరపడుతోంది కానీ హీరోయిన్లు ఎవరో తేలడంలేదని టాక్ అయితే ఉంది. మరి ఈ మూవీలో శృతిహాసన్ అన్నారు, నయన తార, త్రిష, టబు , మీనా లాటి పేర్లు కూడా వచ్చాయి. మరి వీరిలో ఎవరు సెట్ అవుతారో చూడాల్సి ఉంది. మొత్తానికి బాలయ్య కోసం పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసిన గోపీచంద్ ఈ మూవీని క్రాక్ కి రెండింతల హిట్ చేసేందుకు గట్టిగానే ఉన్నారని చెబుతున్నారు.






కమెడియన్ కారణంగా కోట్లలో నష్టం తెచ్చుకున్న దర్శకుడు..

ఫస్ట్ రంగంలోకి దిగేది ఆయనే ..... ??

దళపతి విజయ్ కొత్త సినిమా టైటిల్ అదిరిపోయిందిగా..!!

చైతు కి గుడ్ బై చెప్పనున్న రాశి ఖన్నా..

అదేంటో అన్నీ ఉన్నా కూడా ఆ ఒక్క విషయంలో మాత్రం బాలయ్య డైరెక్టర్లు తెలియని ఇబ్బందులు పడుతున్నారు. వారికి కధ రాయడం కష్టం కాదు, జనాలు మెచ్చేలా డైరెక్షన్ చేయడమూ ఇబ్బంది కాదు, కానీ ఒకే ఒక్క మ్యాటర్ విషయంలో వారు ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు.

కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన నటి.. పేర్లు, ఫోటోలతో సహా బయట పెట్టేసింది?

సల్మాన్ ఖాన్ నటించిన ఈ 7 సినిమాలు తెలుగు రీమేక్స్ అని మీకు తెలుసా.. ?

రీ ఎంట్రీకి 3 కోట్లు.. సిద్ధార్థ్ రెమ్యునరేషన్ షాక్..!

సౌత్ లో రజినికాంత్ ని బీట్ చేసిన విజయ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>