PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag60cc371f-6cbb-40f8-8db1-aea8e58f803e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag60cc371f-6cbb-40f8-8db1-aea8e58f803e-415x250-IndiaHerald.jpgత‌ర‌చూ వివాదాల‌కు నిల‌యంగా మారుతున్న హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత క‌న్ను ప‌డిందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు హెచ్‌సీఏ అధ్య‌క్షుడిగా ఉన్న మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్‌ను తొల‌గిస్తున్న‌ట్లు అపెక్స్ కౌన్సిల్ ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా సంజాయిషీ నోటీసులు కూడా జారీచేసింది. అజార్ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దుచేస్తున్న‌ట్ల ప్ర‌క‌టించింది. హెచ్‌సీఏనుత‌న చేతుల్లోకి తీసుకోవాల‌ని భావించిన క‌విత ఇందులో భాగంగానే అజ‌హ‌రుద్దీనtag{#}Cricket;KCR;masood azharక‌విత చేతిలో 'హైద‌రాబాద్ క్రికెట్' బౌల్డ్‌?క‌విత చేతిలో 'హైద‌రాబాద్ క్రికెట్' బౌల్డ్‌?tag{#}Cricket;KCR;masood azharFri, 18 Jun 2021 11:28:00 GMTత‌ర‌చూ వివాదాల‌కు నిల‌యంగా మారుతున్న హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత క‌న్ను ప‌డిందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు హెచ్‌సీఏ అధ్య‌క్షుడిగా ఉన్న మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్‌ను తొల‌గిస్తున్న‌ట్లు అపెక్స్ కౌన్సిల్ ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా సంజాయిషీ నోటీసులు కూడా జారీచేసింది. అజార్ స‌భ్య‌త్వాన్ని  ర‌ద్దుచేస్తున్న‌ట్ల ప్ర‌క‌టించింది. హెచ్‌సీఏను త‌న చేతుల్లోకి తీసుకోవాల‌ని భావించిన క‌విత ఇందులో భాగంగానే అజ‌హ‌రుద్దీన్ పొగొబెట్టిన‌ట్లు కొంత‌మంది మాజీ పాల‌క‌వ‌ర్గ స‌భ్యులు భావిస్తున్నారు. హెచ్‌సీఏ గాడి త‌ప్పిందంటూ ఇటీవ‌ల క‌విత వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.!

మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధం!
తొమ్మిది మంది స‌భ్యులుండే అపెక్స్ కౌన్సిల్‌కు త‌న‌ను అధ్య‌క్షుడిగా తొల‌గించే అర్హ‌త లేద‌ని అజ‌హ‌రుద్దీన్ నిన్న హైద‌రాబాద్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో చెప్పారు. కొన్ని సంవ‌త్స‌రాలుగా ఈ ప‌ద‌వుల్లో ఉన్న‌వారే అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, కోట్ల‌రూపాయ‌ల నిధులు దుర్వినియోగ‌మ‌వుతున్నాయ‌ని ఆరోపించారు. ఉప్ప‌ల్ స్టేడియంలో క‌నీస సౌక‌ర్యాలు కూడా లేవ‌ని, వ‌చ్చిన నిధుల‌న్నీ ఏమ‌వుతున్నాయ‌ని ప్ర‌శ్నించారు. త‌న‌ను తొల‌గించే అధికారం అంబుడ్స్ మెన్‌కు మాత్ర‌మే ఉంటుంద‌ని, కార్య‌వ‌ర్గాన్ని ర‌ద్దుచేస్తే ఎన్నిక‌ల్లో పోటీచేయ‌డానికి తాను సిద్ధంగా ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిరోజు ఏసీబీ కోర్టుల చుట్టూ తిరిగేవారు త‌న‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. ప్ర‌స్తుత వివాదంపై బీసీసీఐకి స‌మ‌గ్ర నివేదిక పంప‌నున్న‌ట్లు చెప్పారు.

క‌విత విష‌యం నాకు తెలియ‌దు!
హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌లోకి క‌విత రానున్నారా? అని అడిగిన ప్ర‌శ్న‌కు త‌న‌కు తెలియ‌ద‌ని అజ‌హ‌రుద్దీన్ బ‌దులిచ్చారు. ఒక‌వేళ ఎన్నిక‌ల్లో పోటీచేయాల‌నుకుంటే ఎవ‌రి ఇష్టానుసారం వారు వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చ‌న్నారు. నిధులు పుష్క‌లంగా ఉండ‌టంతోపాటు దేశంలోని అతి ప్ర‌ధాన‌మైన న‌గ‌రాల్లో ఒక‌టైన హైద‌రాబాద్ పేరుతోన్న క్రికెట్ అసోసియేష‌న్లో ప‌ట్టుసాధించి  బీసీసీఐలోకి అడుగుపెట్టాల‌నేది క‌విత ఆలోచ‌న‌గా ఉందంటున్నారు. భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని ఇప్ప‌టినుంచే పావులు క‌దుపుతున్న క‌విత ముందుగా హెచ్‌సీఏతో తొలి అడుగు వేయ‌నున్నారు. మున్ముందు ఈ వ్య‌వ‌హారం ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో తెలుసుకోవ‌డానికి కొన్నాళ్లు వేచిచూద్దాం..!









త‌ర‌చూ వివాదాల‌కు నిల‌యంగా మారుతున్న హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత క‌న్ను ప‌డిందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు హెచ్‌సీఏ అధ్య‌క్షుడిగా ఉన్న మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్‌ను తొల‌గిస్తున్న‌ట్లు అపెక్స్ కౌన్సిల్ ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా సంజాయిషీ నోటీసులు కూడా జారీచేసింది.

అయోధ్య ను మించిన భారీ ఖర్చుతో యాదగిరిగుట్ట నిర్మాణం..

WTC FINAl : టీమిండియా అలా చేస్తే బెటర్.. గంగూలీ సూచన?

WTC ఫైనల్ ఒక సాదాసీదా మ్యాచ్.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు?

ధోని సిక్సర్ కి.. గూగుల్ అరుదైన గౌరవం?

ఫైనల్ లో కోహ్లీ ఏం చెయ్యాలి...? విలియమ్సన్ ప్లాన్ ఏంటీ...?

బుమ్రానూ ఇంటర్వ్యూ చేసిన భార్య.. వీడియో వైరల్?

సుప్రీంకోర్టుతో నేను మాట్లాడ‌తానులే?

ఇండియ‌న్ ఆర్మీ సాంకేతిక విభాగంలో ప‌నిచేస్తోన్న దాద‌న్న‌గారి క‌ల్యాణ్‌రావు(25) దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఒక ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఆరు సంవ‌త్స‌రాల క్రితం ఆర్మీకి ఎంపికైన క‌ల్యాణ్‌రావు సాంకేతిక విభాగంలో ప‌నిస్తున్నారు. విధినిర్వ‌హ‌ణ‌లో భాగంగా పంజాబ్‌లోని ప‌టిండా ప్రాంతంలో ఉండ‌గా చెట్టుపై నుంచి ప‌డ‌టంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>