PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag5812247a-8e6b-4ffd-902c-ab97c01d4d3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag5812247a-8e6b-4ffd-902c-ab97c01d4d3c-415x250-IndiaHerald.jpgత‌న్నేవాడొక‌డుంటే.. త‌ల‌ద‌న్నేవాడొక‌డుంటాడ‌ని సామెత ఉంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌కు స‌రిగ్గా ఈ సామెత స‌రిపోలుతుంది. కేసీఆర్‌తో కొన్ని సంవ‌త్స‌రాల‌పాటు చేసిన స్నేహంవ‌ల్లో ఏమోకానీ.. ఈటెల కూడా కేసీఆర్‌లానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజ‌కీయ వ్యూహాల్లో గండ‌ర‌గండ‌డుగా పేరుతెచ్చుకున్న ముఖ్య‌మంత్రిని ఆయ‌న‌ బోల్తా కొట్టించారు. మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన త‌ర్వాత ఈటెల సొంత పార్టీ పెట్ట‌డం ఖాయ‌మంటూ వ‌చ్చిన ఇంటిలిజెన్స్ నిదిక‌ల‌ను బాగా న‌మ్మారు. రేవంత్‌రెడ్డితtag{#}KCR;Bharatiya Janata Party;Assembly;Minister;Telangana;Partyకేసీఆర్‌ని బోల్తా కొట్టించిన ఈటెల‌?కేసీఆర్‌ని బోల్తా కొట్టించిన ఈటెల‌?tag{#}KCR;Bharatiya Janata Party;Assembly;Minister;Telangana;PartyFri, 18 Jun 2021 16:54:31 GMT
త‌న్నేవాడొక‌డుంటే.. త‌ల‌ద‌న్నేవాడొక‌డుంటాడ‌ని సామెత ఉంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌కు స‌రిగ్గా ఈ సామెత స‌రిపోలుతుంది. కేసీఆర్‌తో కొన్ని సంవ‌త్స‌రాల‌పాటు చేసిన స్నేహంవ‌ల్లో ఏమోకానీ.. ఈటెల కూడా కేసీఆర్‌లానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజ‌కీయ వ్యూహాల్లో గండ‌ర‌గండ‌డుగా పేరుతెచ్చుకున్న ముఖ్య‌మంత్రిని ఆయ‌న‌ బోల్తా కొట్టించారు. మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన త‌ర్వాత ఈటెల సొంత పార్టీ పెట్ట‌డం ఖాయ‌మంటూ వ‌చ్చిన ఇంటిలిజెన్స్ నిదిక‌ల‌ను బాగా న‌మ్మారు. రేవంత్‌రెడ్డితోకానీ, ప్రొఫెస‌ర్ కోదండ‌రాంతోకానీ జ‌ట్టుక‌ట్టి సొంత పార్టీ పెడ‌తార‌ని నివేదిక‌లు ఇచ్చాయి. పూర్తిగా వాటిపైనే ఆధార‌ప‌డ్డ కేసీఆర్‌కు ఒక్క‌సారిగా ఈటెల షాక్ ఇచ్చారు. కేసీఆర్ వ్యూహాల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తూ భార‌తీయ జ‌న‌తాపార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఎలాగైనా గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో బీజేపీ!
రాష్ట్రంలో ఒక్క హుజూరాబాద్ మిన‌హా భ‌విష్య‌త్తులో ఏ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి, ఏ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం లేదు. హుజూరాబాద్‌లో ఎలాగైనా విజ‌యం సాధించి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని బీజేపీ యోచిస్తోంది. అటువంటి అవ‌కాశం ఆ పార్టీకి ఇవ్వ‌కూడ‌ద‌ని కేసీఆర్ ఆలోచ‌న‌గా ఉంది. దుబ్బాక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో గెలుపొందిన బీజేపీ ఆ త‌ర్వాత జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌లు, నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేవ‌లం 1600 ఓట్లు మాత్ర‌మే సాధించింది. అయితే ఈటెల స్థానికంగా బ‌ల‌మైన నేత కావ‌డంతోపాటు ఆయ‌న‌పై ఉన్న సానుభూతి కూడా క‌లిసి వ‌స్తోంద‌ని బీజేపీ అంచ‌నా వేస్తోంది.

అభివృద్ధి ప‌నుల తాయిలాలు
హుజూరాబాద్‌లో బీజేపీ గెలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వాతావ‌ర‌ణం అచ్చం ప‌శ్చిమబెంగాల్ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. ఆ అవ‌కాశం బీజేపీకి ఇవ్వ‌కూడ‌ద‌నే కేసీఆర్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. హుజూరాబాద్‌లో రూ.35 కోట్ల‌రూపాయ‌ల‌తో అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మ‌రోమంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ వాటిని తాను ద‌గ్గ‌రుండి 40 రోజుల్లో పూర్తిచేయిస్తాన‌ని ప్ర‌క‌టించారు. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీచేయ‌డంక‌న్నా జాతీయ‌పార్టీ అయిన బీజేపీ గుర్తుతో పోటీచేయ‌డం ఉత్త‌మ‌మ‌ని ఈటెల రాజేంద‌ర్ భావించారు. ఒక‌ర‌కంగా ఇక్క‌డ ఈటెల గెలుపొంద‌డంక‌న్నా బీజేపీ గెలుపొంద‌డ‌మే ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. అధికార పార్టీకి ఉండే అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవ‌డంలో కేసీఆర్ దిట్ట‌. ఎవ‌రిపై ఎవ‌రు పై చేయి సాధిస్తారో తేలాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే..!

















ధూళిపాళ్ల‌పై హైకోర్టుకు ఏసీబీ...ఎందుకంటే..?

తెలియ‌కుండా మాయం చేస్తున్నారు?

అలిపిరి వ‌ర‌కు గ‌రుడ వార‌ధిని పొడిగిస్తామ‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. మే నెల‌లో జ‌ర‌గాల్సిన క‌ల్యాణ‌మ‌స్తు కార్య‌క్ర‌మాన్ని కొవిడ్ వ‌ల్ల నిర్వ‌హించ‌లేక‌పోయాని, త్వ‌ర‌లోనే దీన్ని పునఃప్రారంభిస్తామ‌ని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మ‌త్స్య‌కార గ్రామాల్లో 500కు పైగా దేవాల‌యాలు నిర్మించే ప‌నిని కూడా ప్రారంభించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు

అలిపిరి వ‌ర‌కు గ‌రుడ‌?

ఈ వైసీపీ నేత‌ల‌కు బీపీ పెంచేస్తోన్న జ‌గ‌న్‌... !

తాను ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌కముందే కుంభ‌మేళాలో న‌కిలీ క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రిగాయ‌ని ఉత్త‌రాఖండ్ సీఎం తీర‌త్‌సింగ్ రావ‌త్ అన్నారు. మార్చినెల‌లో తాను ప్ర‌మాణ‌స్వీకారం చేశాన‌ని, న‌కిలీ ప‌రీక్ష‌ల‌పై ఇప్ప‌టికే విచార‌ణ‌కు ఆదేశించాన‌ని తెలిపారు. ఈ న‌కిలీ ప‌రీక్ష‌ల‌పై న్యాయ‌విచార‌ణ జ‌రిపించాలంటూ మాజీ ముఖ్య‌మంత్రి త్రివేంద్ర‌సింగ్ రావ‌త్ డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

కుంభ‌మేళా కుంభ‌కోణం ఎవ‌రిది?

త‌న్నేవాడొక‌డుంటే.. త‌ల‌ద‌న్నేవాడొక‌డుంటాడ‌ని సామెత ఉంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌కు స‌రిగ్గా ఈ సామెత స‌రిపోలుతుంది. కేసీఆర్‌తో కొన్ని సంవ‌త్స‌రాల‌పాటు చేసిన స్నేహంవ‌ల్లో ఏమోకానీ.. ఈటెల కూడా కేసీఆర్‌లానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజ‌కీయ వ్యూహాల్లో గండ‌ర‌గండ‌డుగా పేరుతెచ్చుకున్న ముఖ్య‌మంత్రిని ఆయ‌న‌ బోల్తా కొట్టించారు.

తాజాగా తాను ద‌త్త‌త తీసుకున్న తుర్క‌ప‌ల్లి మండ‌లం వాసాల మ‌ర్రి గ్రామ స‌ర్పంచ్ కు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>