PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ycp-a22f58d2-d6e2-4af4-9a5c-cb6b5a143262-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ycp-a22f58d2-d6e2-4af4-9a5c-cb6b5a143262-415x250-IndiaHerald.jpgఎమ్మెల్సీ పదవుల విషయంలో ఆంధ్రప్రదేశ్ లో కాస్త ఆసక్తి నెలకొంది. మొత్తం 11 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఎవరిని ఎంపిక చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా ముగ్గురు నేతలు మాత్రం ఎమ్మెల్సీ పదవుల కోసం చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు అనేది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో విడుదల రజిని చిలకలూరిపేట కేటాయించడంతో మర్రి రాజశేఖర్ కాస్త అసహనం గా కనిపించారు. ఆ తర్ycp {#}dr rajasekhar;krishna;Telugu Desam Party;Andhra Pradesh;Ramasubbareddy;KARANAM BALARAMA KRISHNA MURTHY;Hanu Raghavapudi;MP;Telangana Chief Minister;MLA;local language;chirala;YCP;Chilakaluripeta;Partyఅన్నా ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీలు ఇవ్వరాదే...? పోనీ ఆ ఒక్కడికి...?అన్నా ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీలు ఇవ్వరాదే...? పోనీ ఆ ఒక్కడికి...?ycp {#}dr rajasekhar;krishna;Telugu Desam Party;Andhra Pradesh;Ramasubbareddy;KARANAM BALARAMA KRISHNA MURTHY;Hanu Raghavapudi;MP;Telangana Chief Minister;MLA;local language;chirala;YCP;Chilakaluripeta;PartyFri, 18 Jun 2021 09:53:00 GMTఎమ్మెల్సీ పదవుల విషయంలో ఆంధ్రప్రదేశ్ లో కాస్త ఆసక్తి నెలకొంది. మొత్తం 11 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఎవరిని ఎంపిక చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా ముగ్గురు నేతలు మాత్రం ఎమ్మెల్సీ పదవుల కోసం చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు అనేది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో విడుదల రజిని చిలకలూరిపేట కేటాయించడంతో మర్రి రాజశేఖర్ కాస్త అసహనం గా కనిపించారు.

ఆ తర్వాత మర్రి రాజశేఖర్ కు ఎంపీ లావు కృష్ణదేవరాయలు నుంచి పూర్తి స్థాయిలో మద్దతు రాగా విడుదల రజిని ఎంపీ తో కూడా విభేదించి కాస్త అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు అని ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే ఆయన ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో వేరే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం కూడా ఎక్కువగానే జరుగుతోంది. అదేవిధంగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూస్తున్నారు.

ఆమంచి కృష్ణమోహన్ నియోజకవర్గం లో ఉండగా అదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన కరణం బలరాం ని పార్టీ లోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. అక్కడి నుంచి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న తరుణంలో  కృష్ణ మోహన్ కి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఇక ఆయనతో పాటుగా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి రామసుబ్బారెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. 2019 తర్వాత వైసీపీ లోకి వచ్చిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగానే కష్టపడ్డారు. అయితే వీరి ముగ్గురిలో కచ్చితంగా మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే బాగుంటుందని ఎమ్మెల్యే తో గొడవ కూడా అవకాశాలు ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.



కడపలో టిప్పు సుల్తాన్ విగ్రహం.. బిజెపి తీవ్ర ఆగ్రహం?

ఇది నటసింహ గర్జన లెజెండ్.. ఈ సినిమా విశేషాలు ఏంటో తెలుసా ?

రాజకీయం నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న శకుని..!!

40 ఏళ్లలో మీ హిందూత్వం ఎటు పోయింది అశోక్?

జగనన్న... అనవసరంగా తప్పు చేసావా...?

అయ్యో జగన్.. అప్పుడు కాస్త ఓపిక పడితే ఇప్పుడెంత బావుండేది..?

ప్రేక్షుకలను ఆలోచింపచేసిన 'ప్రతినిధి'..

అదేంటి ఈటెల...? చేరింది బీజేపీ లోనా...? లేక న్యూస్ ఛానల్ లోనా...?

వీడియో : బూతుపురాణంతో పాకిస్థాన్ పార్లమెంట్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>