MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shakuni-impressed-the-audience-in-the-background-of-politicsfe71757f-eb80-4cb6-9524-0e1b858428c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shakuni-impressed-the-audience-in-the-background-of-politicsfe71757f-eb80-4cb6-9524-0e1b858428c4-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో అడుగడుగునా అవినీతి పేరుకుపోయింది. ఇక దానిని అరికట్టాల్సిన రాజకీయ నాయకులే భ్రస్టుపట్టి పోతున్నారు. అయితే గతంలో ఒక్కేవక్కడు సినిమాలో అర్జున్ ఒక్క రోజు ముఖ్యమంత్రి సీన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక మహా భారతంలో శకునుడు కౌరవులకు సలహాలు అందిస్తూ ఇరువర్గాల మధ్య యుద్దాన్ని తీసుకొస్తూ ఉంటాడు.tollywood-political-movies {#}Telangana Chief Minister;king;Fort;Thief;House;Arjun;Father;Donga;Maha;Cinemaరాజకీయం నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న శకుని..!!రాజకీయం నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న శకుని..!!tollywood-political-movies {#}Telangana Chief Minister;king;Fort;Thief;House;Arjun;Father;Donga;Maha;CinemaFri, 18 Jun 2021 09:20:21 GMTనేటి సమాజంలో అడుగడుగునా అవినీతి పేరుకుపోయింది. ఇక దానిని అరికట్టాల్సిన రాజకీయ నాయకులే భ్రస్టుపట్టి పోతున్నారు. అయితే గతంలో ఒక్కేవక్కడు సినిమాలో అర్జున్ ఒక్క రోజు ముఖ్యమంత్రి సీన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక మహా భారతంలో శకునుడు కౌరవులకు సలహాలు అందిస్తూ ఇరువర్గాల మధ్య యుద్దాన్ని తీసుకొస్తూ ఉంటాడు. ఇక శకుని సినిమాలో మాత్రం శకుని పాత్ర మాత్రం తన తెలివితేటలతో ఎదుటివారికి బుద్ధి చెప్పడమనేది కొత్త కాన్సెప్ట్‌ లో చిత్రీకరించారు.

ఇక సినిమా విషయానికి వస్తే.. కార్తీ పేరు కమల్‌ కృష్ణ. ఆయన కాకినాడలో భూస్వామ్య కుటుంబంలో జన్మిస్తాడు. అయితే అన్నమో ఆకలి అని వచ్చిన ప్రతివారికి కడుపు నిండా ఎప్పుడూ తిండి పెడుతారు. అంతేకాదు.. రాజకీయనాయకులు కూడా వచ్చి ఆ ఇంటిపెద్ద ఆశీస్సులు తీసుకుంటారు. అయితే ఇంటి గౌరవం మంటగలిసే రోజు వస్తుంది. ఇక రైల్వే లైన్‌ రూపంలో ఆ ఇల్లు పోయేరోజు వచ్చింది. దీంతో ఇంటిని కాపాడుకోవాలంటే హైదరాబాద్‌ వెళ్ళి మంత్రిని కలిస్తే పనవుతుందని కమల్‌ కృష్ణను తండ్రి పంపిస్తాడు. కానీ హైదరాబాద్‌ వచ్చిన కార్తికి మంత్రిని కలుసుకునే క్రమంలో అనేక సంఘటనలు నెలకొంటాయి.

ఇక ఈ సినిమాలో రాధికా వడ్డీలు వసూలు చేస్తూ చిన్నచిన్న దందాలు చేస్తూ కనిపిస్తుంది. కార్తీకి, రాధికకు మధ్య పరిచయం ఏర్పడటంతో ఆమెను ప్రణాళిక ప్రకారం ఆమెను కార్పొరేట్‌ చేస్తాడు. అయితే ముఖ్యమంత్రి పాత్రలో ప్రకాష్ రాజు నటిస్తాడు. కార్తీ చేస్తున్న పనులు ఆయనకు మింగుడుపడదు. ఇక అలా ముఖ్యమంత్రిపై పోటీగా ప్రతిపక్షం నేత కోట శ్రీనివాసరావుకు సపోర్ట్‌, సలహాలు ఇస్తూ... తన శకుని తెలివితేటలతో అతన్ని సిఎం.పీఠంపై కూర్చొనేలా చేస్తాడు కార్తీ. ఇక ఈ సినిమాలో నాజర్ దొంగ స్వామిజీ వేశంలో కనిపిస్తాడు. రాజకీయంలో ఉండే మలుపుల గురించి సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల నుండి అనుకునంతా ఆదరణ పొందలేకపోయింది.



ఇది నటసింహ గర్జన లెజెండ్.. ఈ సినిమా విశేషాలు ఏంటో తెలుసా ?

40 ఏళ్లలో మీ హిందూత్వం ఎటు పోయింది అశోక్?

జగనన్న... అనవసరంగా తప్పు చేసావా...?

అఫీషియల్ : ధనుష్ తో శేఖర్ కమ్ముల ట్రైలింగ్యువల్ సినిమా

సీక్రెట్ ను బయటపెట్టిన మిల్క్ బ్యూటీ..

ఈ ముగ్గురు స్టార్ డైరక్టర్లు కథలు రాయలేరు.. కాని సినిమా తీస్తే బాక్సులు బద్ధలే..!

గ్యాంగ్ లీడర్ తర్వాత ఆ సీనియర్ నటి ఏమైంది ?

అలియా భట్ కు ప్రాముఖ్యత ఆర్ ఆర్ ఆర్ ముందడుగు !

ప్రేక్షుకలను ఆలోచింపచేసిన 'ప్రతినిధి'..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>