PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rrr-letter-to-cm-jagan4e108297-f4a0-4fbe-97bb-09f822a7103a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rrr-letter-to-cm-jagan4e108297-f4a0-4fbe-97bb-09f822a7103a-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ కు మరియు వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. దీనికి కారణాలు చాలానే ఉన్నా, రాజు అడిగిన పదవిని ఇవ్వకపోవడం వల్లనే అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అక్కసుతో ప్రతి రోజూ ప్రభుత్వాన్ని, పార్టీని, పార్టీలోని నాయకులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. RRR LETTER TO CM JAGAN{#}krishnam raju;MP;CM;2020;king;Letter;News;Ammavodi;Government;Jagan;YCP;Fatherజగన్ కు ఆర్ఆర్ఆర్ లేఖ, "మధ్యపానమే" టార్గెట్ ...జగన్ కు ఆర్ఆర్ఆర్ లేఖ, "మధ్యపానమే" టార్గెట్ ...RRR LETTER TO CM JAGAN{#}krishnam raju;MP;CM;2020;king;Letter;News;Ammavodi;Government;Jagan;YCP;FatherFri, 18 Jun 2021 11:40:32 GMTజగన్ కు మరియు వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. దీనికి కారణాలు చాలానే ఉన్నా, రాజు అడిగిన పదవిని ఇవ్వకపోవడం వల్లనే అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అక్కసుతో ప్రతి రోజూ ప్రభుత్వాన్ని, పార్టీని, పార్టీలోని నాయకులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఒకానొక దశలో ఇతని వ్యవహారం మరియు చేసే వ్యాఖ్యలు మతాలను మరియు పార్టీలను రెచ్చగొట్టేలా అనిపించాయని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అయినప్పటికీ అటు జగన్ కానీ, ప్రభుత్వం కానీ రఘురామ రాజును ఇబ్బంది పెట్టలేదు. పరస్పర విమర్శలకు దిగలేదు. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వ్యతిరేకంగా తీసుకెళ్ళడంలో ప్రముఖ పాత్ర వహించాడు. ఇసుక విధానం దగ్గర నుండి మూడు రాజధానుల విషయం వరకు ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు ప్రభుత్వం చేసింది చేసేది తప్పు అని చెబుతూనే ఉన్నాడు. ఇందులో భాగంగానే పలు లేఖలను కూడా రాయటం జరిగింది.

తాజాగా రఘురామ కృష్ణం రాజు తొమ్మిదో లేఖను సీఎం జగన్ కు రాశారు. ఈ సారి జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ గురించి ప్రశ్నిస్తూ లేఖ రాయడం రాజకీయంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్ అప్పట్లో మధ్య పానాన్ని పూర్తిగా ఎత్తివేస్తామని ప్రజలకు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఆ తరువాత విడతల వారీగా మద్యాన్ని రూపుమాపుతామని చెప్పారు. ఈ దశలో భాగంగానే ప్రైవేట్ పరమయిన అన్ని బార్ లను రద్దు చేశారు. వాటి స్థానంలో ప్రభుత్వమే మద్యం షాపులను నడిపేలా నిర్ణయం తీసుకున్నారు. అందరికీ మద్యం అందకుండా ఉండాలని మద్యం ధరలను కూడా భారీగా పెంచారు. కానీ రఘురామ రాజు తన లేఖలో మద్యం అమ్మడం ద్వారా మరియు ఎక్సయిజ్ డ్యూటీల ద్వారా  భారీగా ఆదాయం వస్తుంటే పూర్తిగా ఎలా నిషేధిస్తారని ప్రస్తావించారు. మీ అవసరం కోసం అమాయక మహిళలకు హామీలు ఇచ్చి ఇప్పుడు ఇలా చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.  ఇదే లేఖలో రఘురామ రాజు విడతల వారీగా నిషేధించాలి అనుకున్న మీ ప్రణాళిక పూర్తిగా ఫెయిల్ అయిందని అడిగారు.

మీరు చేసే సంక్షేమ కార్యక్రమాలకు మీరు ఖర్చు పెడుతున్న డబ్బును మద్యం ద్వారా అధిక ధరలను పెంచి వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. మీరనుకుంటున్నట్టు ప్రజలేమీ మీ అమ్మఒడి పధకానికి సంతోషపడట్లేదని, అమ్మఒడి - నాన్న బుడ్డి అని హేళన చేస్తున్నారని తెలిపారు. రాను రాను మధ్య నిషేధం కాస్తా మధ్య నియంత్రణగా మారిపోయిందని అన్నారు. కనీసం మధ్యంలోనైనా నాణ్యత ఉందా అంటే అదీ లేదు, ఏవేవో సొంత బ్రాండ్లను తీసుకొచ్చారు. వీటి వల్ల ప్రజల ఆరోగ్యానికి చాలా ప్రమాదమని హెచ్చరించారు. మీరు తీసుకొచ్చే బ్రాండ్లు దేశంలో ఎక్కడ దొరకవు ఇది ఖచ్చితం అని చమత్కరించారు. మీరు మీ స్వార్ధం పెంచుకుంటూ పోతున్న మద్యం ధరల కారణంగా రోజు వారీ కూలీలు పెరిగిపోతున్నాయి. దీని కారణంగా అన్నిధరలు భారీగా పెరుగుతున్నాయి అని గుర్తు చేశారు.  మీరు మద్యాన్ని ఒక టార్గెట్ గా పెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు. ఈ 2020 -21 సంవత్సరానికి 17600 కోట్ల రూపాయలు ఆదాయమే టార్గెట్ గా పెట్టుకున్నారని లేఖలో పేర్కొన్నారు. మీరు చేసే ఈ పొరపాట్లను పునరాలోచించుకుని సరి చేసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతామని చివరగా చెప్పారు. మరి ఇలా అనేక అంశాలను ప్రస్తావించిన రఘురామ రాజు లేఖపై జగన్ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.  



ఏపీ సీఎం జగన్ కు మరియు వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. దీనికి కారణాలు చాలానే ఉన్నా, రాజు అడిగిన పదవిని ఇవ్వకపోవడం వల్లనే అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అక్కసుతో ప్రతి రోజూ ప్రభుత్వాన్ని, పార్టీని, పార్టీలోని నాయకులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.

మహేష్ బాబు ను సరికొత్త కోణంలో చూపించిన పొలిటికల్ ఎంటర్ టైనర్ దూకుడు..!!

ఈటెలకు ఉపశమనమా...? ప్రభుత్వానికి కోర్ట్ గుడ్ న్యూస్ చెప్తుందా ...?

ఓ మ‌హిళా మంత్రి - ఓ మేన‌మామ - వైఎస్‌. జ‌గ‌న్ ?

మహేష్ ప్రభాస్ లపై కామెంట్స్ చేసిన విలన్ ?

విజయ్ దేవరకొండ పొలిటికల్ ప్రయోగం.. నోటా.. !!

రెండు రోజుల్లో పెళ్లి.. విగత జీవిగా కూతురు.. కారణం ఎవరు?

తిరుమ‌ల‌: రేపు టీటీడీ పాల‌క‌మండ‌లి స‌మావేశం.. ఈ నెల 21తో ముగియ‌నున్న ప్ర‌స్తుత పాల‌క‌మండ‌లి గ‌డువు

ఈ నవ్వుల వెనక భరించలేని కన్నీటి కష్టం ఉంది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>